S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరటి చెట్టు

07/15/2018 - 22:28

ఈ ఏడాది మార్చ్ ఇరవయ్యో తేదీన ‘ఆంధ్రభూమి’ దినపత్రికలో ‘పెరటి చెట్టు’ రోజూవారీ ‘కాలమ్’గా మొదలయింది.
అంటే ఇవాళ్టికి నాలుగు రోజులు తక్కువగా నాలుగు నెలల కాలం అయిందన్న మాట.
మొన్న శనివారంనాడు సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి రాసిన రైటప్‌తో వంద ఖండికలు పూర్తయ్యాయి.
ఇంతటితో విరమించడం మీకూ-నాకూ కూడా బావుంటుందని అనిపించింది.

07/13/2018 - 18:23

టేకుమళ్ల కామేశ్వరరావు ఎనభై, ఎనభై అయిదేళ్ల కిందట ఓ కథ రాశారు. తెలికిచెర్ల వెంకటరత్నం గారి ‘ప్రతిభ’లో చదివిన గుర్తు. ‘రొజా’ దాని పేరు. కోదు భాషలో రొజా అంటే బాట, దారి అని అర్థమట. వెదుళ్లు నరికి బండిలో తోలుకొచ్చే కోయదొర, బొర్రన్న కథ అది. వెదురుతోపుల మధ్య నడుస్తూండగా, మోళ్లు తగిలి ఓ ఎద్దు కాలు విరిగి కూలిపోతుంది. గూడెంలో పిన్నా పెద్దా దాన్ని కోసుకు తినేసి, ఆ సంగతి అక్కడితో మర్చిపోతారు.

07/12/2018 - 18:02

‘నిశిరాతిరి చెట్టుమీద-
కాలమెరుగని కొమ్మమీద
చీకటి చాయలో, చిక్కని జూలుతో,
ఓ నల్ల చిరుత కాచుక్కూచుని వుంది!
తళతళమెరిసే రెండు బంగరు కన్నులు
అడవినంతటినీ పహరా కాస్తున్నాయి...
దాని పద్యాలు చిట్టిచిట్టి కాయితం పడవలు-
చందనమూ, తేనెపట్టులోనూ మైనమూ కలగలిపి చేసిన

07/11/2018 - 18:36

కళాప్రపూర్ణ, పద్మభూషణ, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రతిభ ఎంత గొప్పదంటే, ఆయన గురించి అతిశయోక్తులు చెప్పడం అసాధ్యమన్నారు దివాకర్ల వెంకటావధాని. అంటే అర్థమేమిటంటే, విశ్వనాథ గురించి చెప్పే స్వభావోక్తులే, అత్యుక్తుల్లా వుంటాయన్నమాట!

07/10/2018 - 18:59

పందొమ్మిదో శతాబ్ది మన ప్రపంచంలో ఎన్నో మార్పుల్ని తెచ్చిపెట్టింది. ఈ శతకంలోనే బానిస వ్యవస్థ రద్దయింది. రెండో పారిశ్రామిక విప్లవం జరిగింది. పట్టణాలూ నగరాలూ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. శ్రమ విభజన అనే అందమయిన పేరు మాటున ఓ క్రూరమయిన వ్యవస్థ పుట్టుకొచ్చి, ఉత్పాదకతని ఇబ్బడి ముబ్బడిగా చేసిందీ ఈ శతాబ్దిలోనే.

07/09/2018 - 21:51

నలభయ్యోపడిలోనే నూరేళ్లు నిండిపోయాయి బసవరాజు అప్పారావుకి. భావకవిత్వం పేరుతో తెలుగులో ప్రచురమయిన ప్రణయ కవితకి ప్రతినిధి ప్రాయుడాయన. తొలితరం సినిమా పాటల రచయిత, న్యాయవాది, పత్రికీయుడు, సాహిత్య చరిత్రకారుడు కూడా అయిన బసవరాజు గురజాడ మహాకవిత్వం గురించి మొట్టమొదట నొక్కిచెప్పారు.

07/08/2018 - 21:40

జంటకవులు తెలుగు సాహితీ లక్ష్మికి కంటసరులు వెలుగు పంట సిరులు నడచు వెంటవెంట అడుగు జంట విధాన కవుల జంట కౌతుకముల పంట!’ అన్నారట జంధ్యాల పాపయ్య శాస్ర్తీ. జంట కవుల శిష్యులు చాలామంది జంట కవులు కావాలనుకోవడం సాధారణం. కానీ, అలా జయప్రదంగా జంట కవిత్వం చెప్పగలగడం; చెప్పి గురువుల్నీ రసికుల్నీ మెప్పించగలగడం అందరికీ సాధ్యంకాని పని. అటువంటి అసాధ్యులయిన కవియుగళం పింగళి - కాటూరి.

07/06/2018 - 20:46

సంగీత సాహిత్యాలను సరస్వతీదేవి స్తన్యంతో పోల్చాడట కవిగారు. వాటిల్లో ఒకటి ఆపాతమధురమయితే, వేరేది ఆలోచనామృతంగా ఉంటుందన్నాడట మహాకవి. కానుకోగల జ్ఞానికి రెండూ ఆపాతమధురాలే! అలాంటి సంగీత సాహిత్య సమలంకృతుడయిన జ్ఞాని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. పందొమ్మిదో శతాబ్ది చిట్టచివరి దశకంలో కన్ను తెరిచిన మరో బహుముఖ ప్రతిభావంతుడు రాళ్లపల్లి.

07/05/2018 - 20:54

తెలుసుకో గలిగిన వాళ్లకి సాహిత్య చరిత్ర ఓ చెరుకు గెడ లాంటిది! అయితే, అది సరుగుడు వాసంలాగా ఏకమొత్తంగా ఉండదు. కణుపులు కణుపులుగానే ఉంటుంది. ఆ కణుపులనే మనం, యుగాలూ శకాలూ అని పిల్చుకుంటాం. అలాంటి ఒక ఇక్షు ఖండమే నవ్య కవిత్వం. ఇది గురజాడ సారథ్యంలో ఆవిష్కృతమయిన ఆధునిక మహాయుగానికి సమాంతరంగా సాగింది.

07/04/2018 - 22:27

జెర్మన్ భాషలో ‘జెయ్ట్ గెయ్‌స్ట్’ అనే మాట ఒకటుంది. చరిత్ర యొక్క, లేదా కాలం యొక్క ఆత్మ అని ఆ మాటకి - స్థూలంగా - అర్థం. పద్దెనిమిది పందొమ్మిది శతాబ్దాల్లో ఫ్రెంచ్ - జెర్మన్ - ఇంగ్లిష్ తత్వవేత్తలు వోల్టేయ్,్ర హెగెల్, స్పెన్సర్‌లు ‘చరిత్రాత్మ’ అనే ఈ మాట కనిపెట్టి, ప్రయోగించే నాటికి మల్లంపల్లి సోమశేఖర శర్మ పుట్టలేదు.

Pages