S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరటి చెట్టు

04/13/2018 - 21:07

బమ్మెర పోతన చెప్పిన పద్యంగా ప్రసిద్ధమయిన ‘బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్...’ పద్యం (వౌలికంగా) ఆయన సొంతం కాదు. ‘కేయూరబాహు చరిత్రం’ అనే కావ్యం ద్వారా, తెలుగులో కథాకావ్య రచనకు ఒరవడి దిద్దిన మంచన రాసిన పద్యానికి ప్రతిధ్వని అది. కోమల కావ్యకన్యకను చిగురు కొమ్మలతో కూడిన మామిడి మొక్కతో పోల్చారు పోతన.

04/12/2018 - 21:49

తెలుగువాళ్లకి మహాభారతమంటే కవిత్రయ మహాభారతమే. వేదవ్యాసుడనే కృష్ణద్వైపాయనుడు రచించిన భారతాన్ని కాక, వేరే భారతాలను కనీసం ఇద్దరు ప్రముఖ కవులు అనువదించిన సంగతి సువిఖ్యాతమే. పదిహేనో శాబ్దంలో పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమిని భారతాన్ని జయప్రదంగా అనువదించాడు. మరో రెండు వందల సంవత్సరాల తర్వాత సముఖం వెంకట కృష్ణప్ప నాయకుడు కూడా జైమిని భారతానే్న పునః అనువదించాడు.

04/11/2018 - 21:27

కవిత్రయ మహాభారతం లేని తెలుగు సంప్రదాయ కవిత్వం లేనట్లుగానే, తిక్కన గారు లేని తెలుగు భారతమూ లేదు. మహాభారతంలోని పద్దెనిమిది పర్వాల్లో, పదిహేనింటిని ఆయన ఒక్క చేత్తో నిర్వహించాడన్న వాస్తవం ఒక్కటి చాలదూ, తిక్కన ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవడానికి? ఒక్క భారతంలోనే తిక్కన పదహారు - పదిహేడు వేల పద్యాలను చెప్పారు.

04/10/2018 - 21:56

తెలుగు మహాభారతాన్ని ‘కవిత్రయ మహాభారత’మనడం కద్దు. కానీ, అందులో ఆరింట అయిదు వంతులు తిక్కన ఒంటిచేత్తో రాసిందే! అలాంటి తిక్కన కొట్టరువు వారింట పుట్టి పెరిగినవాడు. ఆ వంశంలో ఆయన కనీసం మూడో తరం కవి. ఇక, కొట్టరువు వారింటి నట్టరుగు, బుధజనులు కొలువుండే మెట్టరుగు అని ఎవరయినా అంటే దాన్ని కాదనేవారెవరు? తిక్కన తన ‘నిర్వచనోత్తర రామాయణం’లో తాతగారయిన మంత్రి భాస్కరుడి గురించి చెప్పనే చెప్పారు.

04/09/2018 - 21:44

తెలుగు పద్య సాహిత్యంలో శతకాలది ఓ ప్రత్యేక స్థానం. ఆ శతకాల్లో సుమతీ శతకానిది ఓ విశిష్ట స్థానం. దురదృష్టమేమిటంటే, సదరు విశిష్ట శతకాన్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ రాశారనే విషయంపై సాహిత్య చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. ఈ శతకాన్ని సుమతి అనే పేరిట ప్రసిద్ధుడయిన ఓ జైన గురువు రాశాడన్నది ఓ వాదం. దాన్ని మరో వర్గం పరిశోధకులు ఎలుగెత్తి ఖండించారు.

04/08/2018 - 21:18

చరిత్ర - ముఖ్యంగా, సాహిత్య చరిత్ర - నిజంగానే ఓ మట్టికాళ్ల మహారాక్షసి! తలెత్తుకుని నిలబడేవాళ్లని మట్టి పారేస్తూ పోతూనే ఉంటుంది. అత్యధికుల విశ్వాసాలకు తాళం కొట్టని వాళ్లకీ, గొంతు చించుకుని గోలచేసే వాళ్లని మించి గర్జించని వాళ్లకీ, దర్పం ఒలకబోసే దర్బారీ కవులకు దీటుగా డాబులు కొట్టని వాళ్లకీ సాహిత్య చరిత్ర పుటల్లో స్థానం దక్కం సందేహాస్పదమే.

04/06/2018 - 22:07

బహుభాషావేత్త, సహజ కవి, తెలుగులో వౌలిక పౌరాణిక కావ్యరచనకు ఆదిపురుషుడు పాల్కురికి సోమనాథుడు. తెలుగు - కన్నడం - సంస్కృత భాషల్లో శివ కవిత చెప్పిన సోమన పనె్నండో శతాబ్దం ప్రథమార్ధంలో - నన్నయకూ తిక్కనకూ మధ్యకాలంలో - పుట్టాడని సాహిత్య చరిత్ర చెప్తోంది.

04/05/2018 - 21:54

‘కవిత్రయం’ గురించి తెలియని తెలుగు సాహిత్య విద్యార్థులు ఉండరనే చెప్పొచ్చు. ఆ ముగ్గురి చేతిమీదుగా అనువాదమయిన మహాభారతం తెలుగు సంప్రదాయ సాహిత్య చరిత్రలో కొండగుర్తుగా నిలిచి ఉంది. అయితే, నన్నయ్య - తిక్కన్నలకు మధ్యకాలంలో వర్థిల్లిన ముగ్గురు శివకవులు ‘శివకవి త్రయం’గా పేరు పొందారన్న సంగతి మనలో చాలామందికి తెలియకపోవచ్చు.

04/04/2018 - 21:17

తెలుగు సాహిత్య చరిత్రలో ప్రహేళికలకూ, ప్రవహ్లికలకూ కొదవలేదు. మన వాళ్లకు తారీఖులు దస్తావేజులు చరిత్ర సారం కావని బాగా తెలుసు. కానీ, అవి లేకుండా చరిత్ర సారం పిండడం సాధ్యం కాదనే స్పృహ లేకపోవడం పెద్ద విషాదం. మల్లియ రేచన, ననె్నచోడుడు, వేములవాడ భీమకవి తదితరులకు సంబంధించిన కవికాలాదులు వందల సంవత్సరాలుగా చర్చనీయాంశాలుగా కొనసాగుతూనే ఉన్నాయంటే అందుకు మనవాళ్ల చారిత్రిక నిస్పృహే కారణం.

04/03/2018 - 21:35

తెలుగు సాహిత్య చరిత్రలో, పదిమంది దృష్టిని ఆకర్షించిన ప్రతి అంశమూ అచిరకాలంలోనే ‘వివాదాస్పదం’గా మారడం కొత్తేమీ కాదు. వాదానువాద వివాద సంవాద ప్రతివాదాలనేవి తర్క పద్ధతులనే విషయం దృష్టిలో పెట్టుకుని చూస్తే, మన సాహిత్య పరిశోధకులు ఎంతటి తర్క కర్కశులో బోధపడుతుంది. అయినా, చరిత్ర విషయంలో స్పష్టంగానూ, స్ఫుటంగానూ, నిక్కచ్చిగానూ, నిర్మొహమాటంగానూ ఉండడమే మంచిది.

Pages