S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

11/08/2017 - 19:09

ఉత్తరాదివారు ఎక్కువగా ఇష్టపడే పదార్థం పన్నీర్ పాయసం. పనీర్ ఖీర్ అని పిలుస్తారు. పండుగలకే కాదు వ్రతాల్లోనూ ఉత్తరాది వారు నైవేద్యంగా దీన్ని సమర్పిస్తారు. గట్టిపడిన పాల తియ్యదనం, డ్రైఫ్రూట్ ముక్కలతో, పన్నీర్ ఉప్పదనం తగులుతూ పిల్లలకూ, పెద్దలకూ అద్భుతమైన రుచిని అందిస్తోంది. ఇంట్లోనే ఈ పాయసాన్ని తయారుచేసుకోవచ్చు.

10/17/2017 - 19:47

అమావాస్య చీకట్లను చిచ్చుబుడ్లు, మతాబుల వెలుగులతో పున్నమి వెనె్నలగా మార్చే పండుగ దీపావళి. ఈ పండుగ తీపి వంటకాలకు ప్రసిద్ధి. పిల్లలకూ, పెద్దలకూ ఇష్టమైన రకరకాల హల్వాలతో పాటు మరికొన్ని తీపి పదార్థాలు చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇలా తీపి వంటకాలతో ఆ ఇల్లు ఆనందాల హరివిల్లు అవుతుంది.

మాల్‌పువా

10/04/2017 - 19:30

ఉరుకులు పరుగుల జీవనంలో ఆరోగ్యకరంగా తినడం ఎంతో అవసరం. మనం తినే ఆహారంలో అన్నిరకాల పోషకవిలువలు ఉండవు. గోధుమ రవ్వతో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే పోషకాహారం తీసుకున్నట్లే. గోధుమ రవ్వలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బరువు పెరగడానికి, కండరాల నిర్మాణానికి ఇది సరైన ఆహారం. ఈ ఆహారాన్ని ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. ఫైబర్ అధికంగా ఉంటుంది. రవ్వ ఉప్మా తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదు.

09/28/2017 - 18:08

మహిషాసురమర్దినికి కొబ్బరన్నం

కావల్సినవి: అన్నం - రెండు కప్పులు (నీళ్లు ఒకటికి ఒకటిన్నర తీసుకోవాలి.) పచ్చి కొబ్బరి ముక్కలు - కప్పు, పచ్చిమిర్చి - నాలుగు, అల్లం ముక్క - చిన్నది, నిమ్మకాయ - ఒకటి, ఉప్పు - తగినంత, తాళింపు దినుసులు - మినపప్పు, జీలకర్ర, జీడి పప్పు - పావు కప్పు, నెయ్యి - ఐదు చెంచాలు.

09/26/2017 - 21:23

సంతల్లో, తిరునాళ్లల్లో పంచదార బొమ్మలు తెల్లగా, ఎర్రగా మనకి దర్శనమిస్తాయి. ఆదరణ తగ్గిన వీటిల్లో ఎక్కువగా కోడి బొమ్మలే వుంటాయి. అయితే ఇప్పుడు చక్కెర బొమ్మల్లో కూడా సృజనాత్మకత సంతరించుకుంది. మామూలుగా అయితే స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్, పెళ్ళిళ్ళల్లోనూ భోజనాల దగ్గర ఓ టేబుల్‌మీద ఫలాలతోనూ, వివిధ రకాల ఆహార పదార్థాలతో బొమ్మలను (వెజ్ కార్వింగ్) ప్రత్యేక అలంకరణగా పెడుతున్నారు.

09/23/2017 - 19:10

శ్రీశరన్నవరాత్రి ఉత్సవాల్లో శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని పూజించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో అమ్మను పూజిస్తే తప్పక పలుకుతుంది. భక్తికి తలవంచే ఆ జగన్మాత నవరూపాలలో దర్శనమిస్తుంది కాబట్టి ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఎవరికి తోచిన విధంగా వారు నైవేద్యాలు సమర్పిస్తారు. అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు గురించి తెలుసుకుందాం.

08/15/2017 - 22:07

గోధుమ పిండితో మనం ఎక్కువగా పుల్కాలు, పూరీలు, చపాతి, పరోటాలు చేస్తుంటాం. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే కొన్ని వంటకాలు చేసుకోవచ్చు. రోజు రోజుకు మధుమేహగ్రస్తులు పెరుగుతుండటంతో రైస్ కన్నా గోధుమలతో చేసిన వంటకాలు ఎక్కువగా చేసుకుంటున్నారు. గోధుమ పిండితో లడ్డులు, తీపి దోశె, కారం దోశె, తీపి పొంగడాలు, కారం పొంగడాలు, మడత పూరీలు, కాజాలు వంటివి చేసుకోవచ్చును.
లడ్డూలు

07/20/2017 - 23:56

పనస తొనల రుచి అద్భుతం. ఈ కాలంలో దొరికే పండ్లలో పనస ఒకటి. తొనలు తినేసి గింజలను చాలామంది పారేస్తుంటారు. వీటితో కూడా రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. హల్వా, వడ, పాఠళీ, ఫ్రై, వంకాయ పనస గింజల కూర ఎలా తయారుచేసుకోవచ్చో తెలుసుకుందాం.

07/14/2017 - 23:10

ప్రకృతిలో లభించే పండ్లు ఆరోగ్య పరంగా మంచిది. సమతుల్య ఆహారం తిన్నామంటే పండ్లు కూడా ఆహారంగా తీసుకుంటేనే సాధ్యం. పిల్లలు కొన్నిరకాల పండ్లను తినటానికి ఇష్టపడరు. వారికి ఆయా పండ్లలోని విటమిన్లు అందాలంటే వాటిని తియ్యగా, పుల్లగా హల్వా చేసి తినిపిస్తే సరిపోతుంది. కొన్నిరకాల ఆహార పదార్థాలు కూడా రోగనిరోధక శక్తిగా ఉపయోగపడతాయి. ఇటువంటి ఆహారపదార్థాల్లో హల్వా కూడా చేరుతుంది.

07/07/2017 - 22:56

పండ్లతో చేసే హల్వాలు ఆరోగ్యరీత్యా మంచివి. తియ్యగా, పుల్లగా ఉండటం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. యాపిల్, పైనాపిల్, సపోట, సీతాఫలం, కర్బుజా, జామ, మామిడి, ద్రాక్ష, దానిమ్మ, కమలా, పందిరి దోస, పుచ్చ వంటివాటితో హల్వా తయారుచేసుకుంటే పిల్లలు, పెద్దలకు ఎంతో మంచిది.

Pages