S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

06/10/2017 - 21:25

మనం ప్రతిరోజూ ఎన్నో రకాల ఆహార పదార్థాలను తీసుకుంటాం. కాని వీటిలో ఏది మనకు ఎక్కువ పోషకాలను అందిస్తుందో తెలియదు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఆహార నియంత్రణ పాటించకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. వీరు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. విపరీతమైన నీరసం, అలసటకు గురవుతుంటారు.

06/02/2017 - 20:51

ప్రేమకు చిహ్నంగా భావించే పారిస్‌వాసులు అరకు కాఫీ ప్రేమలో పడిపోయారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ ఆరు అరకు కాఫీ విక్రయ కేంద్రాలు ఉన్నాయి. కిలో కాఫీ పౌడర్‌ను 92.05 యూరోలు అంటే మన దేశీయ కరెన్సీలో దీని రేటు 6,700.20 రూపాయలన్న మాట. నెస్‌కేఫ్ వంటి బహుళజాతి సంస్థలు అందించే కాఫీతో అరకు కాఫీ రుచిని పారిస్‌వాసులు ఆస్వాదిస్తారు. పారిస్ మహిళలు అధిక సంఖ్యలో వచ్చి అరకు కాఫీని కొనుగోలు చేస్తారు.

06/01/2017 - 20:54

వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి కలుపుకుని తింటే ఆ రుచే వేరు. ఒక్క ముద్ద తింటే చాలు స్వర్గానికి బెత్తడు దూరంలో ఉన్నట్లు తెలుగువారు భావిస్తుంటారు. వేసవి సీజన్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఆవకాయ తప్పనిసరిగా ఏడాదికి సరిపడా పెట్టుకుంటారు.

05/31/2017 - 23:44

నాలుగైదు మిరియాల గింజలను నోట్లో వేసుకుని నమిలితే గొంతు సమస్యల నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
రోజ్‌వాటర్‌లో ముంచిన దూదితో కనురెప్పలపైన, కింద తుడుచుకోవాలి. ఇలా రెండు, మూడు వారాల పాటు చేస్తే కళ్ల కింద నల్లటి చారలు తొలగిపోతాయి.
మెత్తగా నూరిన పుదీనా ఆకుల ముద్దలో కాస్త నిమ్మరసం వేసి కళ్ల కింద నల్లటి వలయాలపై తరచూ రాసుకుంటే కొద్దిరోజులకు మచ్చలు తొలగిపోతాయి.

05/31/2017 - 04:58

లెమన్‌డైట్ పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వారం రోజుల పాటు లెమన్‌డైట్ చేయటం వల్ల మీరు ఆశించే ప్రయోజనాన్ని పొందుతారు.
నిమ్మరసాన్ని ఓ పద్ధతి ప్రకారం తీసుకోవాలి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయి శుభ్రపడుతుంది. చర్మం సరికొత్త కాంతిని సంతరించుకుంటుంది.

05/28/2017 - 08:35

ఉదయం నిద్రలేవంగానే టీ తాగటం ఓ అంతర్భాగమైపోయింది. టీ తాగితే ఉత్సాహం వచ్చేస్తుందని అనుకుంటాం. కొంతమంది కాలక్షేపానికి టీ తాగుతారు. ఉద్యోగస్తులు పని ఒత్తిడిని దూరం చేసుకోవటానికి టీ చక్కగా ఉపకరిస్తుందని కనీసం రోజుకు నాలుగైదుసార్లు టీ తాగకుండా ఉండేలేరు. ఈ అలవాటును ఏలాగు మానుకోలేం. కాబట్టి పంచదార కలిపిన టీ కాకుండా గ్రీన్ టీని అలవాటు చేసుకోమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

05/26/2017 - 21:11

భోజనానికి ముందు సూప్స్ తాగితే శరీరంలో కొవ్వుశాతం తగ్గి శరీరాకృతి బాగుంటుంది.
సూప్స్ తాగటం వల్ల మితాహారం తీసుకోవడం అలవాటవుతుంది.
మిరియాలను, మిర్చిలను ఆహారంలో తగు మోతాదులో వాడడం వల్ల శరీరంలో అధిక బరువును
తగ్గించుకోవచ్చు.

05/26/2017 - 01:45

వేసవికాలంలో ఏడాదికి సరిపడా నిల్వ వడియాలు పెట్టుకుంటారు. కూరగాయలతో వరుగులుగా, వడియాలుగా చేసి ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు. మార్కెట్లో దొరికే చిప్స్ వాడటం వల్ల డబ్బు వృథా. పప్పు కూర, పులుసులు, రసం, చారు వంటివి చేసుకున్నపుడు వడియాలను వేయంచుకుని తింటే బాగుంటుంది. వివిధ కూరగాయలతో వడియాలు, వరుగులు ఎలా తయారుచేసుకోవచ్చో తెలుసుకుందాం.

05/26/2017 - 01:43

బెండకాయ, దొండకాయ, మిర్చి, బెండకాయలు లేక దొండకాయలు - 2 కేజీలు, ఉప్పు - 4 చెంచాలు, నిమ్మరసం - 1 కప్పు (లేక) చింతపండు రసం - 1 కప్పు, పసుపు - 1 చెంచా

05/26/2017 - 01:42

మిర్చి - 2 కేజీలు, ఉప్పు - 5 చెంచాలు, వాము - 100 గ్రా., జీలకఱ్ఱ - 200 గ్రా.
పసుపు - 2 చెంచాలు, నిమ్మరసం - 2 కప్పులు
ముందుగా మిర్చి కడిగి తుడిచి వాము, జీలకఱ్ఱ చేర్చి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని నిమ్మరసంలో నానబెట్టి రెండు గంటలు ఉంచి తర్వాత పళ్ళెంలో పెట్టి ఆరనివ్వాలి. ఇది బాగా ఎండాక డబ్బాలో పెట్టుకోవాలి. ఇది నూనెలో వేయించి అన్నంలో తింటే అజీర్తి తగ్గుతుంది.

Pages