S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రుచి
పిల్లలకు లంచ్ బాక్స్ కట్టాలంటే తల్లులకు కత్తిమీద సామే. ఎందుకంటే వారికి పెట్టిన డబ్బా ఒక్కరోజు కూడా ఖాళీగా రాదు. మరికొంతమంది పిల్లలైతే డబ్బాలో పెట్టింది పెట్టినట్లు ఇంటికి తీసుకువస్తారు. కారణం రోజూ అదే టిఫినా.. బోర్ కొడుతోంది అంటారు. అలాంటి పిల్లల కోసమే ఈ కేకులు. ఇంట్లో రకరకాల పండ్లతో తయారుచేసే ఈ కేకులతో ఆరోగ్యానికి ఆరోగ్యం.. పిల్లలకు ఎంతో సరదా.
ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లి స్టార్టర్స్ ఆర్డర్ చేయాల్సి వస్తే పిల్లల నుంచి కానీ, పెద్దల నోటి నుంచి కానీ వచ్చే మొదటి మాట.. మంచూరియా. ఎంత తిన్నా అలా నాన్‌స్టాప్‌గా నోట్లోకి వెళ్లి కరిగిపోతూ.. వేడివేడిగా.. కారంకారంగా.. భలేగా ఉంది అనుకుంటూ లొట్టలేసుకుంటూ తింటుంటారు పిల్లలు. హోటల్లో అయితే అలా ఆర్డర్ ఇచ్చి, ఇలా తినేస్తాం కానీ.. ఇంట్లో దీన్ని చేయాలంటే పెద్ద పనే..
దేశమంతా ఆనందంగా, వేడుకగా జరుపుకునే పండుగ వినాయక చవితి. ‘గణపతి బొప్పా మోరియా’ అంటూ సందడి సందడిగా ఊరేగుతూ పందిళ్లకు చేరుకోబోతున్నాడు గణపతి. వినాయకుడు ప్రతి ఒక్కరిలో శక్తిని, స్థైర్యాన్ని పెంచి కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి అలాంటి ఆరాధ్య దైవమైన బొజ్జ గణపయ్యకు చవితి రోజున ఎలాంటి ఫలహారం నైవేద్యంగా పెడదామనుకుంటున్నారు?
వానాకాలంలో చేపలను తినని వారు ఉండరేమో.. నదులు, సముద్రాలు, చెరువులు నీటితో నిండుగా కళకళలాడే ఈ రోజుల్లో చేపలకు లోటేంటి? పులస, కొరమీను, హిల్సా, చందువా.. ఇలా ఎన్నో రకాలు.. చేపల్లో అనేక పోషకాలుంటాయి. ముఖ్యంగా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. ఫలితంగా గుండె జబ్బులు, ఒత్తిడి, మతిమరుపు వంటివి రాకుండా ఉంటాయి. చర్మం ఆరోగ్యంగా కూడా ఉంటుంది.
మార్కెట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర. ఇందులో పోషకాలు లెక్కలేనన్ని. తరచూ తోటకూరను తినడం వల్ల బరువు తగ్గిపోవచ్చు. శరీరంలోని అనవసరమైన కొవ్వును ఇది హరిస్తుంది. తక్షణ శక్తికి తోడ్పడుతుంది. అయితే వేపుడు కన్నా వండుకుని తిన్న తోటకూర అయితే చాలా ఉత్తమం. అప్పుడు అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. ఇది అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుంది.
శుభకార్యమేదైనా నోటిని తీపి చేసుకోవడం మన సంప్రదాయం. రాబోయేది అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని తెలియజేసే రాఖీపౌర్ణమి. ఆ వేడుక రోజున రాఖీలు మాత్రమే కొత్తగా ఉంటే సరిపోదు. ఆనందాన్ని పంచుకునేందుకు చేసుకునే మిఠాయిలు కూడా కాస్త కొత్తగా, భిన్నంగా ఉన్నప్పుడే పండుగకు నిండుదనం. అయితే మిఠాయిల్లో హల్వాను మించిన మిఠాయి మరొకటి ఉండదు కదా.. అందుకోసమే రకరకాల హల్వాలు మీకోసం..
‘లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం..’ అంటూ ప్రతిరోజూ శ్రావణలక్ష్మిని మనసారా పూజించే నెల ఇది. మరి వరలక్ష్మీ వ్రతం రోజున.. ఆ పండక్కి పరిపూర్ణత తెచ్చే నైవేద్యాల సంగతేంటి? ఎప్పుడూ వండుకునే చింతపండు పులిహోర, సేమియా పాయసం, క్షీరాన్నం.. వంటివి కాకుండా ఈసారి భిన్నంగా చేసుకునేందుకు ప్రయత్నిద్దాం.. అమ్మవారికి ఆరగింపు చేద్దాం..
దబ్బకాయ, వాక్కాయ పులిహోర
సాయంత్రం వేళ స్నాక్స్ అంటే పానీపూరీనే గుర్తొస్తుంది పిల్లలకైనా.. పెద్దలకైనా.. ముఖ్యంగా చిటపట చినుకులు పడుతుంటే సమోసాచాట్, పావ్‌బాజీ వంటివి గుర్తొచ్చి నోట్లో నీళ్లూరతాయి. అయితే రోడ్ల పక్కన పానీ పూరీ బండ్లలో పానీపూరీ తినడానికి తల్లులు ససేమిరా ఒప్పుకోరు. కాబట్టి ఇంట్లోనే శుచి, రుచిగా చేసుకుంటే.. పిల్లలు ఎంత తిన్నా ఇబ్బంది ఉండదు. మరి అలాంటి చాట్ రకాలు ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..
వానల్లో పిల్లలుకానీ, పెద్దలు కానీ చిరుతిళ్లే కావాలంటారు. జలుబు, దగ్గు, జ్వరాలు ఎక్కువగా వచ్చే ఈ సమయంలో చిరుతిళ్ల వల్ల మరిన్ని చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది. చినుకుపడేవేళ కరకరలాడే పకోడీలు, నోరూరించే బజ్జీలు, ఘాటైన మసాలాలు రుచిగానే ఉంటాయి కానీ వ్యాధి నిరోధకశక్తిని ఏమాత్రం పెంచలేవు. ఈ కాలంలో దొరికే ఆకుకూరలు, ఇతర పదార్థాలతో తయారుచేసే అద్భుతమైన వంటకాలు చేసుకుంటే.. రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం..
చినుకుపడిందంటే చాలు.. వేడివేడిగా, కరకరలాడుతూ ఏవైనా తినాలనిపిస్తుంది. కానీ వాన.. తనతో పాటు జలుబు, దగ్గు, జ్వరాలను వెంటబెట్టుకుని వచ్చేస్తుంది. ఇలాంటి వాటికి వామాకు చక్కని ఔషధం. వామాకుతో బజ్జీలను వేసుకుంటే ఎలా ఉంటుంది? అటు ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇటు రుచికి రుచి.. అనుకున్నారేమో పెద్దవారు.. వెంటనే రుచిగా, వేడివేడి బజ్జీలను చేయడం మొదలుపెట్టేశారు. ఒక్క వామాకుతోనే కాదు, కార్న్‌తో, పల్లీలతో..