S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

05/23/2017 - 21:04

నల్లనల్లని నేరేడు పండ్లు మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ కాలం లో సమృద్ధిగా దొరికే ఈ పండ్లలో ఉండే ఆమ్లాలే ఈ పండుకు ప్రత్యేకమైన రుచిని అందిస్తున్నాయి. అటు తీపి కాదు, పూర్తిగా వగరు కాదు. అదోరకమైన గమ్మత్తయిన రుచి. ఇందులో ఆక్సాలిక ఆమ్లం, మాలిక ఆమ్లం వంటివి ఉండటం వల్లే ఈ పండుకు ఈ రుచి వచ్చిందని పరిశోధనల్లో వెల్లడైంది. నేరేడు పండ్లను పండిన తరువాత సాస్‌ను తయారు చేస్తారు.

05/22/2017 - 00:18

వేసవికాలంలో మాత్రమే పనసకాయలు, పండ్లు లభ్యమవుతాయి. కాయలను పొట్టుగా తరిగి చేసే కూరలు, పండ్లలోని తియ్యటి తొనలు నోరూరిస్తాయి. చివరకు వాటి గింజలతోనూ వంటలు చేస్తారు. పనస ఆకులతో విస్తర్లు చేస్తారు. ఔషధ గుణాలుండే పనస ఎన్నో రోగాల నివారణకు పనిచేస్తుంది. ముఖ్యంగా వీటిలో ఉండే ఫైటో న్యూట్రియంట్లు, ఐసోఫ్లేవిన్లు క్యాన్సర్ నివారణకు బాగా పనిచేస్తాయి.

05/19/2017 - 21:39

వేసవి ఎండలు మండిపోతున్నాయి. చమట కారణంగా శరీరంలోని నీటిశాతం తగ్గిపోయి నిస్త్రాణ వస్తుంది. అందువల్ల ఎలక్ట్రోలైట్స్ బయటకు వెళ్లిపోవడంతో నిస్సత్తువ ఆవరించి వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు పుదీనా కలపిన లస్సీ లేదా పుదీనా కలపిన మజ్జిగను తాగితే ఎంతో మేలు జరుగుతుంది. వాటిలో పుష్కలంగా లభించే ఎలక్ట్రోలైట్స్ త్వరితగతిన శక్తినిస్తాయి. ఉదరంలో గడబిడ తగ్గుతుంది.

05/19/2017 - 07:20

కాఫీ గింజల డికాషన్ పాలు, పంచదారల తో కలగలిసి చక్కగా, చిక్కగా తయారయ్యే అమోఘమైన కాఫీని తయారుచేయడాన్ని కూడా ఒక కళగా చెబుతుంటారు. కాఫీని చూసేందుకూ కూడా కళాత్మకంగా ఉండాలని కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అలాంటివారిని మెప్పించేందుకే ‘లాటే ఆర్ట్’ ఆవిర్భవించింది. కాఫీ కప్పులో వివిధ కళాత్మక రూపాలను పాల నురగతో ఆవిష్కరించడానే్న ‘లాటే ఆర్ట్’గా పిలుస్తారు.

05/16/2017 - 21:50

పిల్లలు, పెద్దలు మధ్యాహ్నం వేళ స్నాక్స్‌గా తీసుకునే ఐటెమ్సెలో కారప్పూస ఉంటే అమితంగా ఇష్టపడతారు. పిల్లలకు చిరుతిండిగా చిటికెలో చేసేయ్యవచ్చు. శనగపిండితో బలవర్థమైన తృణధాన్యల పిండితో వీటిని తయారుచేసుకుంటే పిల్లలకు ఆరోగ్యరీత్యా కూడా ఎంతో మంచిది. ముఖ్యంగా రాగిపిండి,
సోయాపిండి, శనగపిండి, బఠాణీపిండిలతో రుచికరంగా చేసి డబ్బాల్లో పెడితే 15 రోజులవరకూ నిల్వ ఉంటాయి.

05/10/2017 - 01:20

పిల్లలు బ్రెడ్ తినడానికి ఇష్టపడరు. బ్రెడ్‌లో రకరకాల కూరలు, మొలకెత్తిన విత్తనాలు, పళ్లు కూరగాయలతో టోస్ట్‌లు చేసిపెడితే ఇష్టంగా తింటారు. పెనంపై కాల్చేవారు. ప్రత్యేకమైన టోస్టర్లు వచ్చాయి.
టమాటాతో..

05/07/2017 - 10:15

బార్లీ పేరు వినగానే అనారోగ్యంతో బాధపడేవారికి మాత్రమే అది ఉపయోగపడుతుంది అనే దురభిప్రాయం ఉంది. ఇది ఎంతమాత్రమూ సరికాదు. బార్లీ అనారోగ్యంతో బాధపడేవారికి ఎంత ఉపయోగపడుతుందో, ఆరోగ్యంగా ఉన్నవారు అనారోగ్యంకు గురికాకుండా చూడడం కూడా చేస్తుంది. అయితే, నాగరికత ముసుగులో మనం ఎన్నో పోషక విలువలు ఉన్న బార్లీని నిర్లక్ష్యం చేసి, జంక్‌ఫుడ్స్‌పట్ల ఆకర్షితులమై అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం.

05/02/2017 - 22:33

హల్వా అనగానే శనగపిండి, గోధుమ పిండితో చేసేవే జ్ఞప్తికి వస్తాయి. కాని పండ్లతో కూడా నోరూరించే హల్వాలు చేసుకోవచ్చు. ఆరోగ్య రీత్యా మంచివి. యాపిల్, పైనాపిల్, సపోటా, సీతాఫలం, కర్బూజా, జామ, మామిడి, ద్రాక్ష, దానిమ్మ, కమలా హల్వాలు, పందిరిదోస పుచ్చ వంటి వాటితో రకరకాల హల్వాలు చేసుకోవచ్చు.
దానిమ్మ హల్వా

04/25/2017 - 23:43

వేసవిలో చల్లదనానికి పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. ఇది బలవర్థకమైన ఆహారం. వెరైటీ ఫ్రూట్ కస్టర్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
బనానా కస్టర్డ్
చక్కరకేళి అరటిపళ్ళు -2
పాలు - 1/2 లీటరు
కస్టర్డ్ పౌడర్ - 1 కప్పు
పంచదార - 1/2 కప్పు
ఏలకులు - 5
ఎండుకొబ్బరికోరు - 1/2 కప్పు

04/23/2017 - 20:59

సీజనల్‌గా దొరికే పండ్లలో వెలగపండు ఒకటి. దీనిని కనీసం ఒక్కసారైనా తింటే మంచిది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధులను దరిచేరనివ్వదు. మహిళల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్, గర్భకోశంలో వచ్చే పుళ్లను రాకుండా ఆపుతోంది. వెలగ ఆకులను ఎండబెట్టి మెత్తగా నూరి, పొడిచేసి పంచదార కలిపి ఉంచుకోవాలి.

Pages