S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రుచి
ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే పీచు పదార్థాలు మన దైనందిన ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి. జీర్ణం కాని కార్బోహైడ్రేట్స్‌నే ‘పీచు’గా వ్యవహరిస్తారు. మన జీర్ణాశయం జీర్ణించుకోలేని ఆహార పదార్థాలను పీచు పదార్థాలు అంటారు. నిజానికి పీచు చేసే మేలు ఎలాంటిదో నేటితరానికి అంతగా తెలియదు. ఇది ఆహారంలో పుష్కలంగా జీర్ణవ్యవస్థ మెరుగుపడడమే కాదు, చర్మానికి కాంతి వస్తుంది.
పోషకాలున్న ఆహారం అంటే ఏమిటన్న సంశయం శాకాహారులను తరచూ వేధిస్తుంది. మంచి ఆరోగ్యం కోసం వేటిని తీసుకోవాలన్న ఆలోచన కలిగినపుడు పోషక విలువలపై తగిన అవగాహన ఏర్పరచుకోవాలి. శాకాహారులు తమ ఆహారానికి సంబంధించి ముఖ్యంగా అయిదు విషయాలను గుర్తుంచుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. గింజలు, పాలు, ఆహార ధాన్యాలు, పండ్లు-కూరగాయలు, కాయధాన్యాలు విరివిగా తీసుకుంటే శాకాహారులకు అవసరమైన పోషకాలు లభిస్తాయి.
అరటిమొక్క కాండాన్ని ఒలిస్తే లోపలి భాగంలో తెలుపురంగులో పొడవైన గొట్టాల మాదిరి దవ్వ ఉంటుంది. అరటి దూటగా కూడా వ్యవహరించే దీనితో పలురకాల రుచికరమైన వంటకాలు చేస్తారు. ఆరోగ్యరీత్యా అరటిదవ్వ ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. దవ్వను ముక్కలుగా కోసి బాగా ఎండబెట్టి తేనెతో కలిపి తింటే మహిళల్లో గర్భాశయ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఇది మలబద్ధకాన్ని నివారించి శరీరానికి చలువను అందిస్తుంది.
సరైన పోషకాలు తీసుకోని పక్షంలో చలికాలంలో ఏ వయసువారికైనా ఆరోగ్య సమస్యలు తప్పవు. వాతావరణ పరిస్థితుల కారణంగా జలుబు, దగ్గు, ఫ్లూ, వైరస్ వ్యాధులతో పాటు చర్మం పొడి బారడం వంటి ఇబ్బందులు అనివార్యమవుతాయి. చలిగాలుల వేళ శరీరానికి వేడిని అందించే ఆహార పదార్థాలను తీసుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది.
కొబ్బరికి భారతీయ సంస్కృతిలో ఓ విశిష్ఠస్థానం ఉంది. పూజలు,వ్రతాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, శుభకార్యాల్లో ఇది తప్పనిసరి. రుచికరమైన పలు వంటకాల తయారీలోనూ కొబ్బరిని విరివిగా వాడతారు. ఆరోగ్యరీత్యా కొబ్బరి నీళ్లు తాగడం మంచిదని వైద్యులు చెబుతుంటారు. నిస్సత్తువ, పైత్యం, వాంతులు, విరేచనాలు, జలుబు, దగ్గు, కామెర్లు, గర్భాశయ వ్యాధులు, అజీర్ణ వ్యాధులకు ఇది ఔషధంలా పనిచేస్తుంది.
విలువైన పోషకాలు, మంచి ఔషధ గుణాలున్న ఆకుల నుం చి తీసిన రసాన్ని తరచూ తాగితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని ఆయుర్వేద వైద్యు లు అనాదిగా చెబుతున్నారు. ‘హరితజలం’ పేరిట పలురకాల ఆకుల నుంచి తీసిన రసాన్ని వాడేందుకు ఇటీవల పట్టణ ప్రాం తాల్లో సైతం మొగ్గు చూపుతున్నారు. దీన్ని మన ఇంట్లోనే ఎంతో సులభంగా తయారుచేసుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.
మొక్కజొన్నలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇందులోని పోషక విలువలు మన శారీరక ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తాయి. మొక్కజొన్న కండెలను కాల్చుకుని లేదా ఉడకబెట్టుకుని తినడానికే కాదు, దీని గింజలను పిండి చేసుకుని పలురకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇందులో స్వీట్‌కార్న్, అమెరికన్ కార్న్, బేబీకార్న్, దేశవాళీ కార్న్ వంటి పలురకాలు ఉన్నాయి.
మొక్కజొన్న గింజలు - 2 కప్పులు
ఉల్లిముక్కలు - 1 కప్పు
పచ్చిమిర్చి - 6
కరివేపాకు - కొంచెం
అల్లం తరుగు - 2 చెంచాలు
ఉప్పు - 1 చెంచా
నూనె - 1/2 కప్పు
బొంబాయి రవ్వ - 2 కప్పులు
జీడిపప్పు - 24
ఆవాలు - 2 చెంచాలు
మినప్పప్పు - 4 చెంచాలు
జీలకఱ్ఱ - 1 చెంచా
టమాటాలు - 4
క్యాప్సికమ్ ముక్కలు - 1 కప్పు
మొక్కజొన్న గింజలు - 2 కప్పులు
క్యారెట్ కోరు - 2 కప్పులు
నెయ్యి - 1/2 కప్పు
యాలకులు - 5
లవంగాలు - 5
జీడిపప్పు - 12
ఖర్జూరం - 1 కప్పు
కొబ్బరి పాలు - 1 కప్పు
ఉప్పు - చిటికెడు
తేనె - 1 కప్పు
బెల్లం కోరు - 1 కప్పు
మొక్కజొన్న గింజలు - 4 కప్పులు
బియ్యప్పిండి - నాలుగు కప్పులు
పచ్చిమిర్చి - 6
వెల్లుల్లి - 12 రెబ్బలు
యాలకులు - 5
లవంగాలు - 5
దాల్చిన చెక్క - 2
ఉల్లిముక్కలు -1 కప్పు
అల్లం కోరు - 5 చెంచాలు
మైదా - 2 కప్పులు
కార్న్‌ఫ్లోర్ - 1/2 కప్పు
జీలకఱ్ఱ - 2 చెంచాలు