S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

01/09/2016 - 22:53

మొక్కజొన్న గింజలు - 4 కప్పులు
జీలకఱ్ఱ, అల్లం, పచ్చిమిర్చి పేస్టు - 5 చెంచాలు
ఉప్పు - 2 చెంచాలు
ఉల్లిపాయలు - 2 కప్పులు
టమాటా ముక్కలు - 1 కప్పు
కొబ్బరి కోరు - 1 కప్పు
జీడిపప్పు- 12
నూనె - 250 గ్రా.
మసాలా కారం - 4 చెంచాలు
కొత్తిమీర - కొంచెం
బియ్యప్పిండి - 1/2 కప్పు
పసుపు - 1/2 చెంచా

01/08/2016 - 22:43

వంటచేసే విధానంలో కొన్ని మెళకువలు పాటిస్తే కూరల్లోంచి విలువైన పోషకాలు బయటకు పోకుండా అరికట్టవచ్చు. క్యారెట్, బంగాళాదుంపలు, బీట్‌రూట్, క్యాబేజీ వంటి కూరగాయల్లో మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే విలువైన పోషకాలు ఎన్నో ఉంటాయి. వీటిని ముక్కలుగా కోసి ఉడికించడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పోషక పదార్థాలు బయటకు పోకుండా ఉంటాయి.

01/06/2016 - 22:48

అధిక ఔషధ గుణాలు, విలువైన పోషకాలున్న మెంతికి ఆకుకూరల్లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. మెంతి ఆకుల్లో పీచు, పొటాషియం, ప్రొటీన్లు, విటమిన్-సి, నియాసిన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. వంటల్లో తరచూ మెంతికూరను వాడితే రక్తంలో హానికారక కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది. బాలింతల్లో చనుబాలు పెరిగేందుకు ఇది దోహదపడుతుంది. ఆహారంలో మెంతికూర కలిపి తింటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.

01/05/2016 - 21:22

అప్పటికప్పుడు తయారుచేసిన ఆహారాన్ని భుజించడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు కలుగుతుంది. తాజా ఆహారం రుచిగానే గాక, విలువైన పోషకాలు ఉన్నందున సులభంగా జీర్ణమవుతుంది. మానసిక సంతృప్తి కూడా కలుగుతుంది. నిల్వ ఉంచిన ఆహారం రుచిగా ఉండదు సరికదా పోషక విలువలు చాలావరకూ తగ్గిపోతాయి. నిల్వ చేసిన ఆహారం కొన్నిసార్లు పాడైనట్లు కనిపించకపోయినా ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపడానికి అవకాశముంది.

01/03/2016 - 00:11

ఆకుకూరలు ప్రతిరోజూ 100 నుంచి 150 గ్రాముల వరకూ తీసుకుంటే శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. మనం నిత్యం వాడే తోటకూర, గోంగూర, మెంతికూర, చుక్కకూర వంటివే కాకుండా చామాకు, వామాకు, పొన్నగంటి ఆకు, గంగావాయి కూర, సిలోన్ బచ్చలి వంటివి కూడా అప్పుడప్పుడైనా వంటల్లో వాడితే రుచితో పాటు మంచి పోషకాలూ అందుతాయి. విభిన్నమైన ఈ ఆకుకూరలు మార్కెట్లో అంతగా లభించవు.

12/29/2015 - 22:13

కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు.. వివిధ ఆకృతుల్లో, విభిన్న రుచులను అందించే కేకులను కొనేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. నూతన వత్సరంలో ప్రతిరోజూ మధురంగా గడిచిపోవాలని ఆకాంక్షిస్తూ తియ్యటి కేకులతో సంబరాలు చేసుకుంటారు. నోరూరించే కేకులను తినాలని పిల్లలే కాదు, పెద్దలు సైతం ఆరాటపడుతుంటారు. దుకాణాల్లో భారీ ధరలకు కేకులను కొనే బదులు మనకు నచ్చిన రుచులను ఆస్వాదించేలా ఇంట్లోనే సొంతంగా కేకులను తయారు చేసుకోవచ్చు.

12/26/2015 - 21:47

ఆకుకూరల్లో ‘రాణి’ వంటిదని తోటకూరను అభివర్ణిస్తుంటారు. దీనిలో పెరుగు తోటకూర, ఎర్ర తోటకూర, చిలక తోటకూర వంటి పలురకాలున్నాయి. ఐరన్‌తో పాటు పలు పోషక విలువలున్న తోటకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి రోజూ కనీసం 200 గ్రాముల తోటకూరను తినాలని ఆయుర్వేద వైద్యులు సలహా ఇస్తుంటారు. దీన్ని తరచూ వంటల్లో వాడితే మొలల వ్యాధి, కడుపులో పురుగులు తగ్గుతాయి. రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది.

12/22/2015 - 22:59

ప్రతిరోజూ గుప్పెడు బాదం పప్పు తింటున్న వారు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ప్రొటీన్లు, ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఇ, మ్యాంగనీస్ వంటివి పుష్కలంగా ఉన్నందున బాదం తీసుకునే పిల్లలు, పెద్దలు ఆరోగ్యవంతంగా కనిపిస్తుంటారని ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి (అమెరికా) చెందిన పరిశోధకుడు అలిస్సా బర్న్స్ చెబుతున్నారు.

12/19/2015 - 23:22

ఐరన్, విటమిన్-ఎతో పాటు మంచి పోషకాలు ఉన్నందున తరచూ మెంతికూరను వంటల్లో వాడితే నేత్రసంబంధ సమస్యలు, చర్మవ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.మధుమేహ వ్యాధిగ్రస్తులు, నరాల జబ్బులున్నవారు దీన్ని తీసుకుంటే మంచి ఫలితంకనిపిస్తుందని వైద్యులు చెబుతుంటారు. మెంతికూరతో పప్పు, పరోటాలు, పచ్చడి, వడలు, పులుసు, పలురకాల కూరలు వండవచ్చు. వంటల్లో విరివిగా దీన్ని వాడితే శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

12/06/2015 - 07:20

దుంప జాతికి చెందిన పెండలం వాడకం ఆహార పదార్థాల్లో తక్కువే. విలువైన పోషకాలున్న ఈ దుంపలతో చేసే విభిన్నమైన వంటలు మంచి రుచినే కాదు, శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, పొటాషియం, పీచు వంటి పోషకాలు వీటిలో సమృద్ధిగా లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్లు అధికంగా ఉంటాయి. మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిల్ని పెంచేందుకు దోహదపడతాయి.

Pages