S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

12/01/2015 - 05:09

తాజా కూరగాయలను వంటల్లో విరివిగా వాడితే ఉదర సంబంధ క్యాన్సర్ల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. కాలీఫ్లవర్, బంగాళాదుంపలు, ఉల్లిపాయలను వీలైనంత ఎక్కువగా తింటే ఉదర సంబంధ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉండవని చైనాలోని జెజియాంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఓ అధ్యయనంలో తేల్చిచెప్పారు.

11/28/2015 - 23:25

శీతాకాలంలో వంటల్లో నువ్వుల నూనె వాడటం, నువ్వులతో పలురకాల వంటకాలు చేయడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. రక్తహీనతను తగ్గించడానికి నువ్వులు దోహదపడతాయి. తీపి ఉండలు, అచ్చులు, కజ్జికాయలు, బొబ్బట్లు, వడలు, చెక్కలు వంటి పిండివంటల్లో వీటిని విరివిగా వాడతారు. బెండ, దొండ, ఆనపకాయ కూరల్లోనూ వినియోగిస్తారు. పెరుగుపచ్చడి, తీపిపచ్చడి వంటివి కూడా చేస్తారు.

11/24/2015 - 04:47

బొప్పాయి పండులో విలువైన పోషకాలతోపాటు ఆరోగ్యానికి అవసరమైన ఔషధాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. సౌందర్య సాధనాల తయారీలో దీన్ని వినియోగిస్తారు. బీటా కెరోటిన్, విటమిన్ ఎ,బి,సి,ఇ , ఖనిజ లవణాలు, ప్రొటీన్లు, పీచు పదార్ధాలు ఈ పండులో లభిస్తాయి. ఇందులోని పీచుపదార్ధం రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిని తగ్గించి, గుండె సంబంధ వ్యాధులకు దివ్యౌషధంలా పని చేస్తుంది.

11/22/2015 - 04:53

అరటిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. లేత అరటి కాయలు అయితే అజీర్ణం చేయవు. అరటి పువ్వు, దూట,కాయలు, అన్నీ కూడ తింటాము. అరటి ఆకులో అన్నం తినడం అత్యంత శ్రేష్టం. అరటి పండును శుభ కార్యాలకు దేవతా పనులకు తప్పనిసరిగా వాడతారు. ఇది జీర్ణకోశ వ్యాధులపై పనిచేస్తుంది. దీన్ని చిన్న చిన్న చక్రాలుగా చేసి ఎండబెట్టి చూర్ణం చేసి తేనె లేక బెల్లంతో తింటే జిగట విరేచనాలు, అమీబియాసిస్ తగ్గుతుంది.

03/18/2015 - 11:34

కరివేపాకు ప్రతి కూరలోనూ అవసరమే. శరీరంలో రక్తపుష్టికి దోహదపడుతూ ఎనీమియా, మలబద్ధకం,
అజీర్ణం వంటి అనారోగ్యాలను తగ్గించి కరివేపాకు బలం చేకూరుస్తుంది. మొదటి ముద్దలో కరివేపాకు పొడి వేసుకుని తింటే ఎలర్జీలు, జీర్ణకోశ వ్యాధులు,
విరేచనాలు, గ్యాస్టిక్ ట్రబుల్ తగ్గుముఖం పడతాయ. పోపులకు, పులిహోరలో,
పులుసుల్లో వాడే కరివేపాకు మనకు నిజంగా ఆరోగ్య ప్రదాతే.

పచ్చడి

Pages