S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మ ధ్వజం

07/04/2018 - 21:40

ఉఫన్యాసం ఒక కళ. కొందరు ఉపన్యాసం పెద్దగా చేయకున్నా సభాసరస్వతులుగా చలామణి అవుతారు. ఇంకొందరు ఏమీ మాట్లాడడం రాదు అంటూ ‘నేను సభాధ్యక్షుణ్ణి’అని గర్వంగా మురిసిపోతారు. కొందరికి సభతో సంబంధం లేకున్నా, ఏమీ మాట్లాడడం రాకున్నా సభావేదికపైకి ఎక్కి తమకు తోచింది చెప్పి తమనుతామే గొప్ప వక్తలుగా భావించుకొని మురిసిపోతుంటారు.

07/03/2018 - 21:32

ఎక్కువమంధి ఇంగ్లండు దేశంనుండి వచ్చిన సేనానులు ఆంగ్లేయులు కారు. మన దేశంలో పనిచేసిన 84 మంది బ్రిటిషు గవర్నర్ జర్నల్స్ ఎవ్వరూ ఆంగ్లేయులుకారు. వాళ్లు బ్రిటిష్ అధికారులు మాత్రమే. రాబర్ట్ క్లైవ్ స్కాటిష్, వౌంట్ బాటన్ ఐరిష్ భాషకు చెందినవాళ్లు. అలాగే ప్రపంచంలోని ధైర్య సాహసాలుగల వ్యక్తులుగా ప్రవర్తించిన గాలీబార్డ్, నెపోలియన్, బిస్మార్క్, రాబర్ట్‌క్లైవ్ ఎవ్వరూ ఆంగ్లేయులు కారు.

07/02/2018 - 21:37

ఫ్రపంచంలో దాదాపు 200 దేశాలున్నాయి. 650 కోట్ల జనాభా ఉంది. కాని కేవలం 11 దేశాల్లో మాత్రమే ఆంగ్లం చదవడం, రాయడం బాగా తెలిసిన వాళ్లున్నారు. అంటే 5% దేశాల్లో మాత్రమే ఆంగ్ల ప్రాధాన్యం ఉందన్నమాట. ప్రపంచ జనాభా 4% మాత్రమే ఆంగ్లం తెలిసినవారున్నారు. అది ప్రపంచంలోనే పెద్ద భాష ఎలా అయ్యిందో ఈ మేధావులే చెప్పాలి?

07/01/2018 - 21:50

భారతదేశంపై మొదట దండయాత్ర చేసిన మహమ్మద్ ఖాసీం ఆ తర్వాత వచ్చిన తైమూర్, గజనీ, నాదిర్షి, పోర్చుగీసు, ఆంగ్లేయులు. ఇలా అందరూ ఈ దేశ భాషాసంస్కృతులపై దాడిచేసినవారే. ప్రత్యేకించి ఆంగ్లేయులు నాటి భారతదేశంలోని 7 లక్షల 32వేల గురుకులాలను మూసి వేయించారు. దాంతో సంస్కృతం ఇతర దేశ భాషల ప్రాబల్యం తగ్గిపోయింది. ఆంగ్లేయులు ఈ పరంపరను అలాగే కొనసాగించారు.

06/29/2018 - 21:17

ఫ్రపంచం ముందుకు దూసుకుపోతుందని మనం అంటుంటాం. కాని ఆ పరుగులో మనం ఎక్కడున్నా, ఈ దేశ అస్థిత్వం మాత్రం పలుచబడుతుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా సాంస్కృతిక, భాషాపరమైన అంశాల్లో మనం చాలా వెనుకబడ్డామనే చెప్పొచ్చు.

06/28/2018 - 21:10

వేమన రసవాధి అని చెప్పే పద్యాలు మచ్చుకు కొన్ని చూడొచ్చు.
* ఇహమున సుఖియింప హేమతారక విద్య
పరమున సుఖియింప బ్రహ్మవిద్య
కడమ విద్యలెల్ల కల్ల మూఢుల విద్య॥
* అంజనంబు కనుల కంటించి చూచిన
సొమ్ము దొరకు భువిని సూత్రముగను
నమ్మి గురుని కరుణ నభిమంటి చూడరా ॥
* ఉక్కుదిన్నవాడె ఉర్విపై సిద్ధుండు
యుక్కుదిన్నవాడె యుండు జగతి
నుక్కుసుధకు మిఱుగ నెక్కు కల్పంబు॥

06/27/2018 - 21:16

అరభ్బీలోని ‘ఆల్’ (పవిత్రమైన) చేర్చబడి- అల్కెమీ- ధాతువాదం రసవాదంగా రూపొందింది. అంటే ఇది పవిత్ర రహస్య శాస్త్రం అని భావించారు.
- ఆచార్య నాగార్జునుడి తర్వాత ఈ శాస్త్రానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది.
- న్యూటన్ పరిశోధనలపై ఆధారాలతో కూడిన పరిశోధన చేసి- ఆయన కూడా ‘ఆల్కెమిస్టు’గా మారాడాని తెలిపారు.

06/26/2018 - 21:07

‘‘ఏ జాతి తన ఫూర్వులను స్మరించదో, ఏ జాతి తన ఉజ్వల గత చరిత్రను విస్మరిస్తుందో- ఆ జాతికి భవిష్యత్తు ఉండదు. ఏ జాతి తన ధర్మ సంస్కృతి పరంపరలను విడనాడుతుందో ఆ జాతికి మనుగడే లేదు. కాబట్టి ఈ పవిత్ర భారతావనిలో జన్మించిన మహనీయుల సుగుణాలు స్మరించుకుంటూ, గత వైభవాన్ని నెమరేసుకుని స్ఫూర్తిని పొంది ఉత్తేజితులై, నవభారత నిర్మాణానికి కంకణధారులం కావాలి మనం’’- అని దేశంబధు చిత్తరంజన్‌దాస్ అంటారు. నిజమే!

06/25/2018 - 21:35

‘యోగం’అనే మాటకు ‘కలయిక’ అని అర్థం. జీవాత్మ ఫరమాత్మతో కలిసే ప్రక్రియనే యోగం అంటారు అని యాజ్ఞవల్కుడు మొ.న మహర్షులు తెలిపారు. జీవాత్మ తనకున్న జీవలక్షణాన్ని వదలిపెట్టి పరమాత్మతో ఐక్యం చెందే మహోన్నత స్థితి చేరడమే యోగం.

06/24/2018 - 21:15

గ్రామాల్లో ‘శిగెం’ నింఢడం (దేవతలు ఆవహించడం, పూనడం) భవిష్యత్తు చెప్పడం నిజమేనా? వైదిక సంప్రదాయంలో వున్న దేవభాష, ఆచార వ్యవహారాలు అందుకోలేని కొందరు గ్రామ దేవతలను ఏర్పాటుచేసుకొన్నారు. అయితే గ్రామ దేవతల మూలాలన్నీ హిందూ ధర్మంలో పూజించే దేవతల నుండి గ్రహించినవే. మైసమ్మ - మహిష అమ్మ అనీ, (మహిషాసురమర్దినీ) ఎల్లమ్మ - ఎల్ల అంటే అంతటా వ్యాపించి తల్లి లేదా శక్తి అని అర్థం.

Pages