S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

10/23/2019 - 19:26

ఈ తీయని ఉపాలంభన వెనుక భక్తుని ఎంత చేదయిన నిర్వేదన.
ఓ ప్రభూ! ఇప్పటికే ఎంతో దుఃఖితుడవై బాధపడ్డాను. ‘సకృత్సు మఘవన్నింద్ర మృళయ’ ‘‘పరమేశ్వర! ఒక్కసారి మాపై దయచూపు.

10/22/2019 - 19:26

యస్య దేవే పరాభక్తి ర్యథా దేవే తథా గురౌ
తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః॥

10/21/2019 - 19:55

సులభంగా వశపడని దైవం వశపడిందన్న ఘోష నిర్భరంగా వినవచ్చింది.’’ నిజమే భగవంతుని హృదయంలో నిలుపుకొన్న వానికట్టి ఫలాలు తప్పక సిద్ధిస్తాయి. ఋగ్వేదం ఈ విషయాన్ని ‘సో అస్త్వయం చ సోమో హృదయం బిభర్మి’ (ఋ.10-32-9) నా హృదయమంతా నిలిచియున్న భగవానుడు నా కొరకై సోమ=ఐశ్వర్యప్రదాయకుడగుగాక’’అని సూటిగా ప్రకటించింది.
**
గురుశిక్షణామహత్త్వం
నిధీయమాన మపగఃళ్హమప్సు ప్ర మే దేవానాం వ్రతపా ఉవాచ

10/20/2019 - 22:54

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఉత్తమ కుల సంజాతుడు, కమనీయుడు అయిన పతిని కోరుతూ మహాగణపతి అయిన ఈ వధువు పతిగృహానికి వస్తున్నది. వీరి గృహస్థాశ్రమ రూపరథం దశదిశల కీర్తనీయమై ప్రసిద్ధమగుగాక! భార్యాభర్తలుగా వీరు కలిసి అనేక యజ్ఞయాగాది శుభక్రతువులను చేయుదురుగాక!

10/15/2019 - 18:30

మాతా రుద్రాణాం దుహితా వసూనాం స్వసాదిత్యానామమృతస్య నాభిః
ప్ర ను వోచం చికితుషే జనాయ మా గామనాగామదితిం వధిష్ట॥ ॥
వేదవాణి రుద్రులను సత్కరించేది. వసువుల మనోభీష్టాలను పరిపూర్ణం చేసేది. ఆదిత్యులయందంతర్గతమైన శక్తిస్వరూపం. అట్టి నిర్దోషమైన వేదవాణిని హత్యచేయవలదని జ్ఞానాభిలాషులనందరికి హితవు పలుకుచున్నాను
**
329. ఆత్మ చంపబడదు

10/14/2019 - 19:33

దానికి భగవంతుడు ‘‘్భగభాగ్యాలను ఎప్పుడూ ప్రదానం చేస్తూనే ఉన్నాను. నేను ప్రదానం చేసేది నీకు హితకరమైనది భద్రప్రదాయకమైనది. పాపనాశనంకోసం నీవు సహాయమర్థిస్తే నా కుడి పార్శ్వానికి రా. నీకు నీవే నాకు ఉపకరణం కా. అహంకార మమకారాలను విడిచి నాకాయుధంగా మారిపో’’అని ఆదేశించాడు.

10/13/2019 - 22:00

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఆయన నేత్రాలు, ఆయన ముఖాలు, ఆయన పాదాలు విశ్వంలో సర్వదిశలా అభివ్యాప్తమై యున్నాయి.

10/10/2019 - 19:25

సమాజ సువ్యవస్థలను ధ్వంసంచేసి సమాజానికి చెరుపు కలిగించే శత్రువులు మరొక రకం. దేశాన్ని దురాక్రమణ చేసే విదేశ శత్రువులొక రకం. దేశంలోనే ఉండి దేశాన్ని బలహీనపరస్తూ దేశద్రోహంచేసే శత్రువులు మరో రకం. శత్రువులెవరైనా, ఎట్టివారయినా వారిని అణచివేయాలికదా! స్థూలంగా అది స్వశక్తితో సాధ్యపడుతున్నట్లు కనబడినా నిజానికి భగవత్సాహాయ్యం చేత మాత్రమే సాధ్యపడుతుంది.

10/09/2019 - 18:28

త్వం దాతా ప్రథమో రాధసామస్యసి సత్య ఈశానకృత్‌
తువిద్యుమ్నస్య యుజ్యా వృణీమహే పుత్రస్య శపసో మహ.॥॥
భావం:- ఓ సర్వేశ్వరా! సమస్త ధనాలను ప్రదానంచేసే ప్రథమ ప్రదాతవు నీవే. భూత భవిష్యత్ వర్తమానాలలో పరిణామం చెందని సత్యస్వరూపుడవు. సమస్త శాసనకర్తవు -రాజాధిరాజువు నీవే. తేజశ్శాలివి, బలశోధకుడవు, పూజ్యుడవు అయిన నీ సాంగత్యాన్ని మేము కోరుకొంటున్నాం.

10/07/2019 - 19:03

ఆ జ్ఞానమెట్టిది? ప్రియమ్= ప్రీతికరమైనది. శూషమ్= బలవర్థకమైనది. బృహత్= చాలా శ్రేష్ఠమైనది. అందుకే భగవదత్తమైన ఈ జ్ఞానం భోగ- మోక్ష ప్రదాయక సమర్థమైనది. కాబట్టి మానవుడుగా జన్మించిన ప్రతి వ్యక్తికి ప్రథమకర్తవ్యం ‘దేవత్తం బ్రహ్మ గాయత’(ఋ.1-37-4) ‘‘పరమాత్మచే ప్రదానం చేయబడిన వేదాన్ని గానం చేయి’’అని ఋగ్వేదం శాసిస్తూంది.

Pages