S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

06/17/2019 - 22:26

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
కాకుంటే సంకల్ప వికల్పాలు గల మనస్సుచేసే తొందరపాటు నిర్ణయాలు అనతికాలంలోనే ‘చిత్త’ తార్కిక పరీక్షకు గురి అయి మార్పుకు గురి అవుతాయి. అందుకే మనస్సుతో చిత్తం కూడ ఏకీభవించి ప్రవర్తించాలని దైవం హితవు చెప్పింది. ఆ హితవును పాటించకుంటే సాఫల్యత సందిగ్ధమైపోతుంది.

06/17/2019 - 22:25

మీ మనస్సులతోబాటు మీ చిత్తం (తర్క సహితమైన బుద్ధి) కూడ సమానంగా ఉండుగాక. నేను మీ అందరికి ఒకే విధమైన భోగ ద్రవ్యాలను సృష్టించి ప్రదానం చేసియున్నాను.
వివరణ:- మనసుతో ఆలోచించుట, దానిని బాహ్యంగా పలుకుట, పలికిన దానినిచేయుట ఈ మూడు సమానంగా ఉండే సాధనోపాయాలను భగవంతుడీ మంత్రంలో ఆదేశిస్తున్నాడు.

06/13/2019 - 18:20

‘‘మీ మనస్సులు, జ్ఞానుల మనస్సులు సమానమై ఉండుగాక’’అని దీని అర్థం. ఆ విధంగా మన మనస్సులు ఎప్పుడు కాగలవు? అంటే-జ్ఞానులు ఏమిచేస్తారో దానినే నోటితో వచిస్తారు. వచించిన దానినే మనస్సులో సంకల్పిస్తారు. ఆ విధంగా మనమూ ఆచరిస్తే మన మనస్సులు జ్ఞానుల మనస్సులతో సంవదిస్తాయి అంటే సమానమవుతాయి. అలా జ్ఞానులవలె మనసా, వాచా, కర్మణా ప్రవర్తిస్తే సంకల్పించిన లక్ష్యాలు ఫలవంతమై ఐశ్వర్య ప్రదాయకమవుతాయి.

06/12/2019 - 19:41

అయితే పూర్వజన్మల సుకృతఫలం ఏ లవలేశమో ఉంటే సత్కర్ముల సాంగత్యభాగ్యం లభించి పాపకర్మ విముక్తులై సుజ్ఞానవంతులు కాగలరు. కాబట్టి సంసార విషవృక్షానికి పండే సజ్జన సాంగత్య ఫలాన్ని ఆస్వాదించండి. సుజ్ఞానులు కండి.
**
కలిసి నడవండి. కలిసి పలకండి
సం గచ్ఛ్ధ్వం సం వదధ్వం సం వో మనాంసి జానతామ్‌
దేవా భాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే॥ ఋ.10-191-2॥

06/11/2019 - 18:59

కవలలుగా ఒకేసారి పుట్టిన బిడ్డలు ఒకే దారుఢ్యం కలిగి యుండరు. ఇదే విధంగా ఒకే రక్తసంబంధం గల ఇద్దరు వ్యక్తులు సమానంగా దానగుణం కలిగి యుండరు. సృష్టిలో ఇటువంటి విషమత అందరకు అనుభవంలోనిదే. వీనినుండి ఓ మానవుడా! అలాంటి స్వభావాన్ని అలవరచుకోవద్దు. ఫలానా వ్యక్తి ధనవంతుడైనా దానం చేయడు. నిర్ధనుడైన నేనెందుకు చేయాలి? అని అనుకోవద్దు. నేనెందుకు చేయకూడదు? అనే ప్రశ్న వేసుకో. ఆ విధంగా నీవు బుద్ధివికాసాన్ని సాధించు.

06/10/2019 - 22:12

అట్టివారి దానాలు, సానుభూతులు కేవలం బాహ్యాడంబరాలే. దానం, దయ మొదలైన సత్‌ప్రవృత్తులు దీనపు కాంతులవలె సమీపంనుండి దూరానికి వ్యాపిస్తాయి.’’ అట్టి అదాతయైన వానినుండి, అదాతయైన మిత్రునినుండి దూరంగా వెళ్లిపొమ్మ ‘న స సఖాయో...పిత్వః’అని వేదం హితవు పలికింది. మరో సందర్భంలో ఋగ్వేదమే మిత్రుడు అయినాకాకున్నా యాచకుడుగా వచ్చినవానిని సంతృప్తిపరచాలి.మోఘమన్నం విందతే అప్రచేతాః సత్యం బ్రవీమి వధ ఇత్స తస్య

06/10/2019 - 22:11

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
తనకు సహాయపడే మిత్రుడు ‘అన్నాభిలాషియై రాగా అతడికింత అన్నంపెట్టి ఆదరించనివాడు మిత్రుడే కాడు. అటువంటి మిత్రుడినుండి దూరంగా వెళ్లిపోవాలి. ఎందుకంటే అటువంటి వాని ఇల్లు ఇల్లేకాదు. వానిని విడిచి సులభంగా ఆశ్రయమిచ్చే దాతనాశ్రయించాలి.

06/06/2019 - 19:23

సరే, వర్ణాలు నాలుగే అయితే దానికి ప్రమాణమేది? అంటే భగవంతుని విరాట్ స్వరూపాన్ని వేదం ఒక మానవుడుగా, ఒక మానవ సమాజంగా భావించింది. దానిని నాలుగు భాగాలుగా చూపింది. అవే శిరస్సు, బాహువులు, ఊరువులు (తొడలు), పాదాలు. ఈ అన్నీ కలిసినపుడే ఒక పరిపూర్ణ మానవుడవుతాడు. అట్లే సమాజంలో విడిగా ఉన్న భాగాలన్నీ కలిసినపుడే ఒక పరిపూర్ణ సమాజమవుతుంది. దీనికి ప్రతిరూపమే ఈ ‘బ్రాహ్మణో-స్య...’అన్న మంత్రం.

06/05/2019 - 19:48

6. అసుర్యం వర్ణం ని రిణీతే అస్య తమ్... ఋ.9-71-2
7. పరివర్ణం భరమాణో రుశంతమ్... ఋ.9-97-15
8. శుచిం తే వర్ణం అధి గోషు ధీధరమ్... ఋ.9-105-4
9. స్పార్హే వర్ణే... ఋ.2-1-12
10. ఉభౌ వర్ణౌ... ఋ.1-179-6
11. రుశద్భిర్వర్ణైరభి... ఋ.10-3-3
12. దాసం వర్ణమధరం గుహాకః ... ఋ.2-12-4
13. హత్వీ దస్యూన్ ప్రార్యం వర్ణమావత్... ఋ.3-34-9

06/04/2019 - 19:33

నాలుగు వర్ణాలు
బ్రాహ్మణో- స్య ముఖమాసీద్ బాహూ రాజన్యః కృతః
ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాం శూద్రో- అజాయత॥ ॥
భావం:- బ్రాహ్మణులు భగవంతుని ముఖం-వంటివారు. బాహువుల వంటివారు క్షత్రియులు. తొడల వంటివారు వైశ్యులు. శూద్రులు పాదాల వంటివారు.
వివరణ:- అలంకారిక రీతిలో ఈ మంత్రం చాతుర్వర్ణ్య వ్యవస్థను వర్ణిస్తూంది.

Pages