S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

03/19/2019 - 22:32

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ముందుగా తనలోని కుటిలతను వీడి ఇతరులను తనతో సమానమైన వారనే దృఢభావనగలవారే సమాజంలో ‘సమత’ను సాధింపగలరని అథర్వవేద నిశ్చితాభిప్రాయం. మరి కుటిలత ఎలా తొలగిపోతుంది? అంటే జ్ఞానంచేత మనస్సు, హృదయాలు సంస్కారం పొందినప్పుడు కుటిలత తొలగిపోతుంది.

03/18/2019 - 19:14

మానవులంతా దుఃఖపడేది తాముండే భూలోకంలో ఈ మూడు లక్షణాలు దాదాపుగా మృగ్యంకావడమే. అందుకే భూలోకవాసులు స్వర్గమెక్కడో ఉందని భ్రాంతికి లోనవుతున్నారు. ఈ లక్షణాలున్న లోకం భూలోకమే అయినా మరే లోకమే అయినా అట్టి ఆనందమయ లోకమే స్వర్గమన్న భావంతో యత్ర-తత్ర శబ్దాలతో స్వర్గలక్షణాలను వేదమభివర్ణించిందిగాని ఇవే లక్షణాలని ఇతమిత్థంగా చెప్పలేదు.

03/17/2019 - 22:33

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

03/13/2019 - 19:43

కుక్క దానికి చిహ్నం. కాబట్టి కుక్కవంటి మాత్సర్యాన్ని వెంటనే విడిచిపెట్టాలని వేద హితవు.
కోకయాతుమ్:- కోక అంటే పిచ్చుక. దీనికి కామాతురత అధికం. అందుకే పిచ్చుక కామానికి సూచకం. సాధకుడు దీనిని విడనాడాలని వేదాదేశం.

03/12/2019 - 21:01

‘ఋతమృతాయ పవతే సుమేధాః’ (ఋ.9-97-23) ‘‘బుద్ధిమంతులు మరియు విద్వాంసులు కేవలం ఋతంకోసమే ఋతాన్ని పవిత్రం చేస్తారు’’అని ఋత పరాయణుల స్వభావాన్ని స్పష్టపరచింది. వారలా ఎందుకు చేస్తారు? అంటే ఋత స్మరణ- ఆచరణచేయకుంటే ప్రాప్తించేది అనర్థమే కాబట్టి. ఆవిధంగా ఆచరింపనివాడు ‘ఋతస్య పంథాం న తరంతి దుష్కృతః’ (ఋ.9-73-6) దురాచారియే. అతడే ఋతమార్గాన్ని అనుసరించడు. మరి ఎటువంటివాడు ఋత ధర్మాన్ని ఆచరించగలడు?

03/11/2019 - 20:22

శరీరానికి రెండు కళ్లు, రెండు చెవులు, నాసారంధ్రాలు రెండు, నోరు ఒకటి, మలద్వారమొకటి, మూత్ర ద్వారమొకటి ఇలా తొమ్మిది రంధ్రాల రూపంగా తొమ్మిది ద్వారాలున్నాయి. ఈ ద్వారాలున్న శరీరంలో ఒక హిరణ్మయ కోశమొకటియుంది. మనసును మందిరమనిగాని, దహరమనిగాని, పుండరీకమని గాని, వేశ్మమని గాని పిలువవచ్చు. సత్వరజస్తమో గుణాలు మూడు అందలి మూడు అంతరాలు. ఇట్టి మానవ మందిరమే జీవాత్మ, పరమాత్మలిద్దరకూ నివాసం.

03/10/2019 - 22:30

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

03/07/2019 - 19:56

ఎందుకంటే ఆత్మశక్తికి మూలాధారం దైవమే కదా. జ్ఞానులు దానిని విస్మరింపకపోవడం చేతనే వారిలో ఆత్మశక్తి ప్రబుద్ధమై, ప్రవృద్ధమై వారిని లోకంలో లోకోత్తర శక్తిసంపన్నులుగా విఖ్యాతపరుస్తుంది.
***
ఒంటరిగానే నీవు ప్రయాణించాలి
యమస్య లోకాదధ్యా బభూవిథ ప్రమదా మర్త్యాన్ ప్ర యునక్షి ధీరః
ఏకాకినా సరథం యాసి విద్వాన్‌త్స్వప్నం మిమానో అసురస్య యోనౌ॥

03/06/2019 - 20:00

ఇక మానవుని ఆత్మ సృష్టికూడ వాటికి తక్కువేమీకాదు. సూర్యతాప ప్రభావం తనమీద పడకుండ ఎన్నో శీతలీకరణ సాధనాలను కనుగొన్నాడు. బడబానలాన్ని పూర్తిగా చల్లార్చివేసే జలాన్నికూడా గొట్టాల ద్వారా తన గృహసీమలోనకి తెచ్చుకోగలిగాడు.

03/05/2019 - 21:59

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
శుక్ల యజుర్వేద మీ మంత్రార్థానే్న-
యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూద్విజానతః
తత్ర కో మోహ. కః శోక ఏకత్వమనుపశ్యతః శు.య.వే. 40-7
‘‘సమస్తజీవులు ఆత్మతో(తనతో) సమానమని భావించిన క్షణంలో ఆ జ్ఞానికి శోకమేమిటి? మోహమేమిటి? అని అనువదించింది.

Pages