S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

12/21/2018 - 19:53

పశుజాతికి భిన్నంగా తనకు మరియు తమ జాతి అభ్యున్నతికై ఎప్పుడూ విచారణచేస్తూ ఆ ప్రయత్నాలలో నిమగ్నమై యుంటారు. కేవలం ప్రస్తుత జన్మలోనే కాదు భవిష్యజ్జన్మలలో కూడ సుఖజీవనంకోసం ప్రయత్నాలను ఈ జన్మలోనే చేస్తూ ఉంటారు.

12/20/2018 - 19:03

వేదమొక సర్వాంగ పూర్ణమైన ధర్మప్రబోధక గ్రంథం. సమస్త మానవ సమాజాన్ని ఒక పరిపూర్ణమైన సువ్యవస్థిత మార్గంలో నడిపేందుకు ఏ పదార్థాలు - ద్రవ్యాలు అవసరమో వానినన్నింటిని అందరూ పొందేందుకు అవసరమైన సాధనాలను వేదాలు వర్ణించాయి. మానవ జీవితాన్ని ఉత్కృష్ట చరమస్థాయికి చేర్చి ముక్తిమార్గానికి చేర్చటమే వేదాల పరమ లక్ష్యం.

12/19/2018 - 18:59

రెండు రాజ్యాల మధ్య వైర భావాలు పొడసూపితే అవి ఒకదానినొకటి దురాక్రమణ చేసేందుకు తీవ్ర ప్రయత్నంచేస్తాయి. ఆ సమయంలో ఆ దేశంలోని ఉత్సాహవంతులైన వీరులు- పౌరులు తమ దేశాధిపతి, సేనాధిపతి లేదా నాయకునితో ఎలా ప్రసంగిస్తారో దానిని ఈ మంత్రం వివరిస్తూంది.

12/18/2018 - 19:35

కాబట్టి సంయమన శక్తితో గార్హస్థ్య జీవితాన్ని అందరు సాఫల్యమొనర్చుకొందురు గాక!
***
రాజా! మనం మిత్రులమై సహకరించుకొందాం
వధైర్దుః శంసాన్ అప దూధ్యో జహి దూరే వా యే
అంతి వా కే చిదత్రిణః అథా యజ్ఞాయ గృణతే సుగం
కృధ్యగ్నే సఖ్యే మా రిషామా వయం తవ॥
ఋ.1.94-9.

12/17/2018 - 18:51

అయితే అట్టి అంధ తమ సాకృత లోకాలలో పడినవారికి దైవానుగ్రహంవలన ఏనాడో వారు చేసిన పుణ్యకర్మ ఫల లవలేశాలు జాగృతమయితే ‘దోషాఃశివఃసహసః సూనో అగ్నే యం దేవ ఆ చి త్సచసే స్వస్తి’ ‘‘ఓ మహాబలాగ్రణీ భగవాన్! వారివద్దకు దయతో దరిచేరే శివస్వరూపులు మీరే’’అని ప్రతి మంత్రం వారికి స్వాంతన పలికింది.

12/16/2018 - 22:10

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
మేమూ దేవాధిదేవుని ఆజ్ఞలను, నియమాలను ఏ విధంగా అతిక్రమించాం? లోకంలో ఈ విషయాన్ని ఎవడు పూర్తిగ తెలుసుకొంటున్నాడో వాడు సహజ మిత్రులైన దేవతలపైన కూడ కోపంతో ఉండడు. పాపఫలమైన దుఃఖంచేత భయకంపితులు కాక ధర్మాచరణ చేసే వారికి అన్నం, బలం, జ్ఞానం సమస్తమూ సిద్ధిస్తాయి.

12/14/2018 - 18:28

బాల్య, కౌమార, వన, వృద్ధాప్యాల నన్ను క్రమ్ముకొంటాయి. దయతో నా ప్రార్థన విను. ‘సఖే సఖాయ మజరో జరిమ్ణే’ ‘‘ఓ మిత్రుడా! నన్ను వృద్ధాప్య దశనుండి రక్షించు. అయితే ఈ కోరిక దురాశతో కోరినదికాదు. నా శరీరం వృద్ధాప్య దశను తప్పక పొందేదది నాకు బాగా తెలుసు. కాని నేను కోరేది బాల్యంలోనో వనంలోనో ఆ వృద్ధాప్యదశ నా శరీరాన్ని ఆవహించ కూడదన్నదే నా ప్రార్థన. ఓ విత్రుడా! ఈ నా మరొక ప్రార్థన విను. నీవు మరణ రహితుడవు.

12/13/2018 - 19:12

దైవం తన వద్దగల ప్రాకృతిక సంపదనంతా తనకొఱకు కాస్తంత కూడ స్వార్థబుద్ధితో దాచుకొనక జీవులందరకు పంచిపెట్టాడు. అంతేకాక జీవులకు భోగంతోబాటు మోక్షాన్ని కూడ ప్రదానం చేసేందుకు విశ్వాన్ని బహుధా విస్తరించాడు. జీవుల కర్మానుసారంగా వారికి తగిన నూతన లోకాలను కూడ సృష్టించాడు.

12/12/2018 - 19:49

వివరణ:- సదాశ్రయాన్ని కోరిన మనిషి లోకమంతా తిరుగుతూ తిరుగుతూ ఒక ఆశ్రయాన్ని పొందాడు. కాని కొంతకాలానికే అతడికి అందులో లోపాలు కనబడసాగాయి. దోషాలు లేని ఆశ్రయంకోసం దానిని వెంటనే విడిచి మరల లోకమంతా తిరుగసాగాడు. చివరకాతనికి బంధువులు, చుట్టాలు, మిత్రులు, భార్యాపుత్రులు, మాతాపితలు ఇలా అందరూ వ్యర్థమైన గడ్డిబొమ్మల్లా కనబడ్డారు. దిక్కుతోచక సదాశ్రయం దొరకక ఆర్తుడై ‘అయమగ్నే జరితా...

12/11/2018 - 22:19

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
భావం:- ఋషియజ్ఞం (బ్రహ్మయజ్ఞం), దేవయజ్ఞం(అగ్నిహోత్రం), భూతయజ్ఞం (బలివైశ్వదేవయజ్ఞం), నృయజ్ఞం (అతిథి యజ్ఞం), పితృయజ్ఞం. ఈ ఐదు యజ్ఞాలను చేయకుండ ఎన్నడూ ఉండరాదు.

Pages