S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

11/15/2018 - 18:33

రైలు, టెలిగ్రాము, ఓడ, విమానం, ఫోను, విద్యుద్దీపాలు, నూనె, నెయ్యి తయారుచేయడం, అన్నం వండటం, బెల్లం, పంచదార, ఫలహారాలు, బంగారు ఆభరణాలు, కారు, పెట్రోలు, కిరసనాయిలు, ఇత్తడి, రాగి, పాత్రలు, లోహాలతో ఉపకరణాలు శస్త్ర, అస్తల్రు, వివిధ లోహాల భస్మాలు, సిమెంటు, సిమెంటు ఉపకరణాలు ఇలా ఎన్నని లెక్కపెట్టాలి? ఇవన్ని మనిషియే సృష్టించాడు. కాబట్టి మనిషిని చిన్నో- పెద్దో ఒక బ్రహ్మగా అంగీకరించడంలో తప్పేమీలేదు.

11/14/2018 - 18:41

ఆ విధంగా చేయక జీవించేవాడు జీవితంలో హానిని పొందడమేగాక లోకంలోని అత్యాచారుల చేతిలో మరణాన్ని కూడ పొందుతాడు. అంతేకాక భగవద్భక్తుడు గోశాలలో చేర్చబడతాడు. అంటే సర్వోన్నత స్థానంలో ఉంచబడి జనులందరిచేత సేవింపబడతాడు.

11/13/2018 - 18:24

చివరగా మరియొక ప్రార్థన. ‘తేషు ధేహ్యోజో జనేషు యేషు తే స్యామ.’ నీవు వారికి అపారమైన తేజస్సును మరియు శక్తిని అనుగ్రహించు. ఆ శక్తి వలయంలోనికి చేరిన మేముకూడ నీవారమే అయ్యెదము. ఓ జీవనాధారా! అమృత స్వరూపా! నేను నీవాడను కావాలన్నదే నా వాంఛ. నినే్న ధ్యానిస్తాను. నీ కీర్తినే గానంచేస్తాను. ఓ దేవా! నన్ను నీ వాడిగాచేసే భక్తునకు నీవు తప్పక శక్తి నిమ్ము. శరణాగతులను ఆశీర్వదించుట నీ వ్రతం కదా.
***

11/12/2018 - 18:25

ఆ విధంగా పొందిన శక్తివలన ‘దేదిష్టే ఇంద్ర ఇంద్రియాణి విశ్వా’ ‘ఆత్మ సర్వేంద్రియాలకు మార్గదర్శకమవుతుంద’ని ఈ మంత్రం వివరిస్తూంది. అంటే ఆత్మ ఇంద్రియాలను తనకిష్టమైన మార్గాల వైపునకు నడిపించుకొని వెళ్లగలదని భావం. కాకుంటే దుర్బలమైన ఆత్మను ఇంద్రియాలు తమ ఇష్టానుసారంగా ఎక్కడికైనా ఈడ్చుకొనిపోగలవు. బలీయమైన ఆత్మ ఆవిధంగా ఇంద్రియాలు లాగుకొనిపోయే ముళ్లబాటనెన్నడూ పట్టదు. అంతేకాక ఆత్మే ఆ ఇంద్రియాలకు-

11/11/2018 - 22:19

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512

11/09/2018 - 18:52

యా తే తనూర్వాచి ప్రతిష్ఠితా యా శ్రోత్రే యా చ చక్షుషి
యా చ మనసి సంతతా శివాం తాం కురు మోత్క్రమీః॥
(ప్రశ్నోపనిషత్తు. 2-12)

11/08/2018 - 18:59

‘‘మనస్సు లేకపోతే ఏ పని నిర్వహింపబడదు.’’ ఈ దృష్ట్యా పరిశీలిస్తే కళ్లు చూస్తాయి. మనస్సుతో కూడినప్పుడే చెవులు వింటాయి. ఇలా మనస్సుతో సహయోగం లేకుంటే ఏ ఇంద్రియమూ పనిచేయదు. కాబట్టి అట్టి బలసంపన్నమైన మనస్సును చంచలంగా వదిలివేయకుండా దానిని నిగ్రహించాలి. మనస్సే నిగ్రహింపబడి వశవర్తి అయితే అజ్ఞానశిల బ్రద్దలైపోతుంది.

11/06/2018 - 19:36

వేదమావిధంగా చెప్పడం ద్వారా రెండు ముఖ్య విషయాలు గ్రహించాలి. చదువురానివాడు విద్వాంసులు చేసే పనుల్ని, చేష్టలను మొ.చూచి వానిననుసరించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇది మొదటిది. విద్వాంసులు వచ్చి వినిపించే విషయాలను శ్రద్ధగావినాలి. ఇది రెండవది. చదవడం వినడంలోనే అంతర్భవిస్తుంది. గురువు చెబుతాడు. శిష్యుడు వింటాడు. దీని పేరే చదవడం- చదివించడం. వినకుండ చదవడం సంభవం కాదుకదా. ఋగ్వేదమొక సందర్భంలో-

11/05/2018 - 19:05

ప్రాణ- అపానాలు లేదా జ్ఞాన-కర్మలు అనే రెండు గుఱ్ఱాలచేత నడుపబడుతున్న ఆత్మను చూచినవాడెవడు? లోకంలో అట్టి వీరుడున్నాడా? సిద్ధమైన - సిద్ధంచేయబడిన ప్రసిద్ధమైన ఐశ్వర్యాన్ని కోరుతూ వజ్రబల సంపన్నమైన ఆత్మప్రీతిపూర్వకంగా సంరక్షణాభావంతో శరీరమనే గృహానికి వెళ్లుతున్నది?

11/04/2018 - 22:12

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఓ ఇంద్ర! నీవొక్కడవే సృష్టిలోని సమస్తకార్యాలను సహజమైన నీ శక్తి- సామర్థ్యాలతో అనేక రీతులుగా చేసావు. ఓ వజ్రధారీ! ఏ కార్యాలను నీవు ఏ శక్తిసామర్థ్యాలతో శీఘ్రంగా చేసావో వానిని ఎవరూ కూడ పూర్తిగా స్వాధీనపరచుకోలేదు. మరియు అణచిపెట్టలేదు.

Pages