S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

01/03/2019 - 19:34

అందుచేత ‘శ్రుధీ హవం విపిపానస్య’ (ఋ.7-22-4) ‘‘అత్యంత దాహార్తుని (నీ నామామృతపాన దాహార్తుని) హృదయవేదనారావాన్ని విను.’’ నీవు వినకుంటె ఓ జనార్ధనా! ఇంకెవరు వింటారు?
నీవు విను, వినకపో. నేను మాత్రం ‘సదా తే నామ స్వయశో వినక్మి’ అనుపమానమైన కీర్తిశాలివగు నీ నామానే్న స్మరిస్తూ నినే్న పిలుస్తూ ఉంటాను.’’
**
175. దేశ కల్యాణానికి కలిసి భగవదారాధన చేయండి

01/02/2019 - 19:36

వ్యాధిస్త్యాన సంశయ ప్రమాదాలస్యావిరతి భ్రాంతి దర్శనాలబ్ధ భూమికత్వా నవస్థితత్వాన్ని చిత్త విక్షేపాస్తే న్తరాయాః. అన్న సూత్రానుసారం వ్యాధి, స్త్వాన= భారకత్వం, సందేహం అజాగ్రత్త, సోమరితనం, అవిరతి= యోగసాధనాల ఆచరణలో అనాసక్తి, భ్రాంతికారక వస్తు దర్శనం, చిత్తచాంచల్యం, యోగ భూమికను పొందకపోవడం, ఇవన్ని యోగసిద్ధికి విఘ్నకారకాలు.

01/01/2019 - 19:52

విశ్వసంపద అంతా చేత చిక్కినా ఒక్క దైవానుగ్రహం లభించకుంటే అంతా వ్యర్థమే. దీనిని గ్రహించి ఓ మానవుడా నీకున్నదంతా ఈ లోకంమీదే విసిరివేసిపో. కాని ఆ దైవాన్ని మాత్రం విడువకు అన్న ఈ మంత్రోపదేశం సర్వమానవులకు శిరోధార్యమే.
172. నీ భక్తుణ్ణి ఎవరు ప్రతిఘటించగలరు?
కస్తమింద్ర త్వావసుమా మర్త్యో దధర్షతి
శ్రద్ధా ఇత్తే మఘవన్‌పార్యే దివి వాజీ వాజం నిషాసతి॥

01/01/2019 - 04:09

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
అయితే ‘యుక్తాహ్యస్య హరయః శతాదశ’ ఆత్మను తరిమివేసేవి, పెడదారిని పట్టించే శక్తులు వేలకొలది ఉంటాయని మాత్రం చెప్పగలం. కాబట్టి సావధానులు కండి.
**

12/30/2018 - 23:01

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఎందుకంటే ‘అపృణన్మర్ధితారం న విందతే’ (ఋ.10-117-1) ‘‘ఎప్పుడు ఎవరికి పెట్టని ఆ లోభి తనకు ఏదైనా దానం చేసి సహాయపడేవానిని పొందలేడు కదా’’కాబట్టి ఆ లోభి నిస్సహాయంగా మరణిస్తాడు.
**
ఆత్మ ప్రతిఒక్క రూపానికి
అనురూపంగా ఉంటుంది

12/28/2018 - 20:25

పృథివికి ఆంతరంగా ఉండి నియమిస్తున్నవాడే నీలో అంతర్యామిగా ఉన్న అమృతమయమైన ఆత్మ’’. ఇలా ఆత్మను సూత్రీకరించి యాజ్ఞవల్క్యుడు అగ్ని, అంతరిక్షం, వాయువు, దివి, ఆదిత్య, చంద్ర, తారలు, ఆకాశం, అంధకారం, తేజస్సు, సర్వభూతాలు, ప్రాణం, వాక్కు, చక్షువులు, శ్రోతలు, మనస్సు, చర్మం, విజ్ఞానం మరియు రేతస్సులలో ఉంటున్న ఆ భగవానుడు వానికంటే భిన్నుడే అని దీర్ఘమైన వివరణ ఇచ్చాడు.

12/27/2018 - 19:53

సూర్యునినుండియే వర్ధిస్తూంది. సూర్యుడొక అగ్నిగోళమే కదా అని అనుకోనేరు. అలా కానేకాదు. సమస్త జీవులను పరిపోషించే జీవన రసాలన్నీ భూమినుండి ఉద్భవించే సమస్త పదార్థాలలోనికి సూర్యుని కిరణజాలం వర్షించే రసవృష్టి ద్వారా వచ్చి చేరుతూంది. అందువలననే భూమిపై వృక్ష, లతా, గుల్మాదులు పుష్పించి, ఫలించినట్లుగా వివిధ జీవులు ఉద్భవించి విరాజిల్లుతూ ఉన్నాయి. అట్టి శక్తి సూర్యునిలో బహుధా నిక్షిప్తమైయుంది.

12/26/2018 - 19:00

సూర్యచంద్రులే గాక నక్షత్రాలు, జ్యోతిర్మండలాలు ఆకాశమనే గీటురాయి మీద గీయబడిన సువర్ణరేఖలా వెలిగిపోతూ ఉంటాయి.

12/25/2018 - 19:21

దుర్బల ప్రార్థనకు దైవం కరుణించదు
అని రేణ వచసా ఫల్గ్వేన ప్రతీత్యేన కృధునాతృపాసః
అధా తే అగ్నే కిమిహా వదంత్యనాయుధాస ఆసతా సచంతామ్‌॥ ఋ.4-5-14.
భావం:- ఓ ప్రభూ! దుర్బలమైన, నిర్సారమైన, అనిశ్చతమైన, హీనమైన, అల్పమైన మాట చేత, ప్రార్థన చేత తమకుతాము సంతృప్తులు కానివారు ఈ జన్మలో ఏమి చేయగలరు? ఏమి చెప్పగలరు? ఎప్పుడైనా లోకంలో నిరాయుధులకు రక్షణ ఉండదు గదా!

12/24/2018 - 19:41

వాస్తవానికి ధనత్యాగంలో సుఖముంది. దాచుకోవడంలో దుఃఖముంది. ఏ కారణంచేతనయినా ఐశ్వర్యం అరకొరగా లభిస్తే ఏమిచేయాలి? దానిని భగవదర్పణంగా పరోపకారార్థమే త్యాగం చేయాలా? వేదమావిధంగా చెప్పలేదు. ‘యద్యశ్రాతం మమత్తన’ ఐశ్వర్యం అరకొరగా ఉంటే అధికంగా ఆశించక దానితో సంతృప్తి చెందుమని హితవు చెప్పింది. అంటే స్వల్పసంపద నిమిత్తంగా దుఃఖపడరాదు. దానిని ఇంకా ఇంకా పెంచి దాచుకోవడానికి ప్రయత్నించరాదు అని వేదోపదేశ పరమార్థం.

Pages