S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

09/03/2018 - 19:26

శమ- దమ- ఉపరతి- తితిక్ష- శ్రద్ధ మరియు సమాధానం ఈ యారు షట్క సంపత్తి. అధర్మాచరణ నుండి మరలించి ధర్మాచరణ దిశగా మనోబుద్ధి అహంకార చిత్తాలనే అంతరింద్రియాలను మరలించుట ‘శమం’ నేత్ర- శ్రోత్ర- జిహ్వాది జ్ఞానేంద్రియాలను మరియు హస్త- పాదాది కర్మేంద్రియాలను దుష్టకర్మల నుండి మరలించి శుభకర్మల దిశగా ప్రవర్తింపచేసే ఇంద్రియ జయత్వం ‘దమం’. దురాచారులకు సదా దూరంగా ఉండటం ‘ఉపరతి’.

09/02/2018 - 22:15

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఏ విధంగా రాణి ఈగ (తేనెటీగ) బయటకు వెళ్ళినంతనే తక్కిన కూలి ఈగలు చెదరిపోతూ మరల అది ఒకచోట నిలిచినంతనే కూలి ఈగలు ఎలా నిలిచి ఉంటాయో అదే విధంగా కళ్ళు-ముక్కు- చెవి- నాలుక- చర్మం మొదలైన జ్ఞాన మరియు కర్మేంద్రియాలకు ఉచ్ఛస్థితి లేదా దీనస్థితి ఏర్పడింది.

08/31/2018 - 19:54

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
భావం:- ఓ ఆత్మా! ప్రాణాలు నీ వైభవప్రాప్తికై నిన్ను ప్రకాశింపచేస్తున్నాయి. అదే నీ అద్భుతమైన సుందరమైన జన్మ. నీవు విష్ణువుతో సమానమైన స్థానాన్ని శరీరంలో పొంది శరీరేంద్రియాలలో గుప్తంగా ఉన్న సామర్థ్యాన్ని సంరక్షిస్తున్నావు.

08/30/2018 - 19:23

పుత్ర- మిత్ర- కళత్ర బంధుజనులెవరూ మనవెంట రారు అన్న ఆలోచన నిజంగా ఎందరికి వస్తుంది? అందరు అన్నీ చూస్తూ కూడ మనం మాత్రం శాశ్వతంగా ఉండిపోతామన్నట్లు గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు. లోకంలోని ఈ జీవులందరి దురవస్థ మంత్రం ప్రథమార్ధంలో వర్ణింపబడింది.

08/29/2018 - 18:31

నిత్యం మృజంతి వాజినం ఘృతేన
భావం:- వారు నిత్యమూ ఘృతం ద్వారా జ్ఞాన ప్రకాశం ద్వారా ఆత్మను పరిశుద్ధం చేసుకుంటున్నారు.

08/28/2018 - 19:23

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
జన్మసంసార బంధనాలలో చిక్కుకొన్న ఓ మానవుడా! హృదయాన్ని జలధిగా చేసుకో. ప్రియతమ దైవాన్ని దర్శించు. అప్పుడు చూడు. కెరటాలు లేచి బంధనాలు తెగాయో లేదో!!!
***
యజ్ఞం పూజనీయం
ప్ర ణు త్యం విప్ర మధ్వరేషు సాధుమగ్నిం హోతార మీళతే నమోభిః

08/27/2018 - 18:47

అథ యదిద మస్మిన్ బ్రహ్మపురే దహనం పుండరీకం వేశ్మ
దహరో- స్మిన్నంతరాకాశ స్తస్మిన్
యదంత స్తదనే్వష్టవ్యం, తద్వావ విజిజ్ఞాసితవ్య మితి ॥

తం చేద్ బ్రూయుర్యదిదమస్మిన్ బ్రహ్మపురే దహరం
పుండరీకం వేశ్మ దహరో- స్మిన్నంతరాకాశః
కిం త దత్ర విద్యతే యదనే్వష్టవ్యం యద్వావ విజిజ్ఞాసితన్యమితి॥

08/26/2018 - 21:13

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*

08/24/2018 - 18:17

మోక్షమే సర్వోత్తమ గమ్యం
దేవేభ్యో హి ప్రథమం యజ్ఞియేభ్యో- మృతత్త్వం సువసి భాగముత్తమమ్‌
ఆదిద్దామానం సవితార్వ్యూర్ణుషే - నూచీనా జీవితా మానుషేభ్యః॥
ఋ.4-54-2॥

08/23/2018 - 18:56

అంతేకాదు ఆ భగవానుడు మనకు జీవించేందుకు ముల్లోకాలలో శ్రేష్ఠమైన సర్వ శుభాశ్రయాన్ని అనుగ్రహించుగాక!

Pages