S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

07/25/2018 - 18:32

దుర్యోధనుడు దుష్టతతుష్టయంలోని వాడయినా ‘‘సూచ్యగ్రం నైన దాస్వామి వినా యుద్ధేన కేశవ!’’ యుద్ధం చేయకుండ వాడి సూది మొనమోపినంత నేలను కూడ పాండవుల కీయను’’అని చెప్పిన మాటకు సందర్భం వేరయినా జీవన యుద్ధం చేయకుండా ఎవరికి ఏమీ లభించదన్న సత్యాన్ని నిర్ద్వంద్వంగా చెప్పిందే.

07/24/2018 - 18:24

భగవద్గీత కూడా-
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః
‘‘ప్రాణులన్ని నిద్రించే సమయంలో సంయమీంద్రులు మేల్కొని యుంటారు. సంయమివరులు నిద్రించే సమయంలో ప్రాణులు నిద్రిస్తాయి’’ అని ఇదే విషయాన్ని సమర్థించింది.

07/23/2018 - 18:27

ఆచంద్ర తారార్కంగా ఆయుష్షు లభించినా అది అనంతకాల పరిమాణంలో స్వల్పమే. నృత్య- గానాది సామగ్రిని నీ వద్దనే ఉంచుకో. ధనంతో ఎవరికి తృప్తిలభించదు. నిజంగా ఆత్మతత్త్వ సంబంధియైన జ్ఞానమే ప్రాప్తిస్తే ధనం లభించినట్లే. భోగాలెంత పరిమితమో అంతకాలమే జీవిస్తాము. ఆత్మతత్త్వ జ్ఞానం లభించే వరాన్ని మాత్రమే సమవర్తీ! దయతో నిమ్ము.
జాగరణశీలం కలవాడు ఇతరులకు బోధింపగల సమర్థుడయినచో వారిని జ్ఞానులను చేయగలడు.

07/22/2018 - 21:15

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*

07/20/2018 - 21:52

జీవన సమరంలో పోరాడి పోరాడి చివరకు లక్ష్యాన్ని చేరుకోలేక జీవితమంతా సంగ్రామంలో గడిచిపోతే ఆ జీవితం వ్యర్థమైనట్లే. కాబట్టి జీవన పోరాటాన్ని గ్రుడ్డిగా చేయరాదు. పోరాటం కేవలం సాధనం మాత్రమే. కాని సాధ్యం మాత్రంకాదు. అందుచేత లక్ష్యసాధనకై సాధన రూపమైన తమ ప్రయత్నాన్ని బుద్ధిమంతులు మనీషా= బుద్ధిబలంతో అనుసంధానించి దానిని బలవత్తరం చేస్తారు.

07/19/2018 - 19:10

*
హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*

07/18/2018 - 19:24

సంసార సాగరాన్ని దాటడానికి ఈ దేహం నౌక వంటిది. దానికి చిల్లు పెట్టి ముంచివేస్తే మునిగేది నౌకే కాదు దానితోబాటు మీరూ మునిగిపోతారు. మోక్ష్య లక్ష్యాన్ని చేరుకోకనే సంసార కూపంలో మునిగిపోతారు. అందుకే దేహనౌకను శ్రద్ధగా రక్షించుకోవాలి. అందుకే వేదమీ మంత్రంలో ‘యజస్వ తన్వమ్’ అని చెప్పింది.

07/17/2018 - 18:50

శరీర సంరక్షణయే యజ్ఞం
స్వయం యజస్వ దివి దేవ దేవాన్ కిం తే పాకః కృణవదప్రచేతాః
యథా యజ ఋతుభిర్దేవ దేవా నేవా యజస్వ తస్వం సుజాత
భావం: ఓ మానవుడా! శిరస్సున నుండే జ్ఞానేంద్రియాల ద్వారా సమీకరింపబడిన సదాలోచనలను ఉత్తేజపరచుము. సదాలోచన తత్పరుడవైన నిన్ను మూఢులేమి చేయగలరు? ప్రతి ఋతువునందు తదనుగుణంగా దేవతలనెలా ఆరాధిస్తావో అదే విధంగా నీవు దేవతామయమైన శరీరాన్ని ఆరాధనాభావంతో ఆదరించుము.

07/16/2018 - 19:00

శుక్రమ్= జ్ఞాన బలరూపమైన తేజస్సును; యజతమ్- హృదయగతంగా చేసికొంటున్నాను.;
భావం:- అగ్నిరూపుడైన భగవంతుని తల్లి-తండ్రి-సోదరుడు- మిత్రుడుగా స్వీకరిస్తున్నాను. జీవనప్రదాయకమైన అట్టి భగవానుని మహాతేజస్సు సదా పూజార్హమైనది. జ్ఞానబలరూపమైన పరమాత్మ సూర్యాగ్ని తేజస్సును సదా హృద్గతంగా చేసికొంటున్నాను.

07/15/2018 - 22:14

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*

Pages