S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం కథ

05/06/2016 - 21:12

కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది.
‘ఎక్కడెక్కడికో వెళ్లాలి, ఎవరి దాహార్తినో తీర్చాలి’- అని కంకణం కట్టుకున్నదాన్లా ఉరవళ్ళతో పరుగులు పెడుతోంది.
దిగులుగా భయంగా నదీపాయ వంకే చూస్తూ కూర్చుంది ఎల్లవ్వ.
ప్రవాహ వేగం ఆమె గుండెల్లో సుడిగుండాలు సృష్టిస్తోంది.
దీనంగా చూసింది. కనికరించమని ప్రార్థిస్తూ చూసింది. చేతులూ జోడించింది.

04/29/2016 - 21:49

దేశంలో శిశు మరణాల సంఖ్య నానాటికి అధికమవుతోంది. శాస్ర్తియ అవగాహన కొరవడటం వల్ల పురిట్లోనే పిల్లలకు నిండు నూరేళ్లు నిండుతున్నాయి. వెయ్యి మంది పిల్లలు పుడితే 40 మంది పిల్లలు చనిపోతున్నారు. అలాగే అపుడే పుట్టిన వెయ్యి మంది శిశువుల లో 28 మంది చనిపోతున్న ట్లు పార్లమెంట్‌లో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. ఐదేళ్ల లోపు పిల్లల మరణాలు మనదేశంలో ఎక్కువగా ఉంది.

04/29/2016 - 21:44

‘ఇది విన్నారా?... విద్యానగర్‌లో ఓ కాలేజీ లెక్చరర్ నుంచి లక్షా యాభై వేలు కాజేశారుట..’ స్ట్ఫా రూమ్‌లో పిచ్చాపాటీకి తెరతీస్తూ అన్నాడు ఫిజిక్స్ చెప్పే మాధవ్.
‘బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకువెడుతుంటే బ్యాగ్ లాక్కున్నారా?’ అడిగాడు కెమిస్ట్రీ లెక్చరర్ సతీశ్.

04/22/2016 - 22:13

అనుపమ బస్టాండులో నిల్చుంది. ఎక్కాల్సిన బస్ ఇంకా రాలేదు. చిరాకుగా టైం చూసుకుంది. అప్పటికే రావాల్సిన బస్ ఆవేళ ఎందుకనో ఆలస్యం అయినది. ఇంతలో కాస్త దూరంలో ముగ్గురు వ్యక్తులు కనిపించారు ఆమెకు. ఇద్దరు యువకులు, ఒక యువతి ఏదో విషయమై మాట్లాడుకుంటున్నారు. ఆ దృశ్యం ఎందుకో అసహజంగా అనిపించి, మరింత పరిశీలనగా చూసింది. ఆ యువకులలో ఒకరు తన చేతిలోని సెల్‌ఫోన్‌ను ఆ యువతికి చూపిస్తూ ఏదో చెబుతున్నాడు.

04/16/2016 - 01:55

‘‘నిన్నటిదాకా ఏమన్నా రాయిలా పడుండేదానివి, ఈ రోజేం బంతిలా ఎగురుతున్నావ్!’’ తీక్షణంగా అడిగాడు జయంత్.
‘‘బంతిని కాను ముద్దబంతిని కాను నేనిప్పుడు బూమెరాంగ్‌ని’’ దృఢంగా పలికింది సరిత.
‘‘ఏ రాంగ్‌వో కాని నాకు మాత్రం రాంగ్ నంబరువి అయిపోతున్నావు’’.
‘‘అదేమాట నేనంటే?’’ తలెత్తి భర్తనే సూటిగా అడిగింది.
‘‘అనక్కరలేకుండానే అంటున్నావు కదా?’’

04/08/2016 - 21:17

సమస్త మానవ ప్రపంచం ఒక్కసారిగా కలవరపడింది. అంతరిక్షంలోని ఒక తెలియని శక్తి భూ ఆవరణలోకి ప్రవేశించి మానవులను ఎగరేసుకుపోతోంది. పిల్లా పాప, చిన్నా పెద్ద, ముసలి ముతక, ఎంతటివారైనా ఎవ్వరికీ ఏ భేదం లేదన్నట్లు, ఎవరో లాక్కుపోతున్నట్లు ఎగిరి మాయమవుతున్నారు. వీరంతా భూ ఆవరణాన్ని దాటి తెలియని ఒక బిలంలోకి పోతున్నారు. మనుష్యుల హాహాకారాలు మిన్నంటుతున్నాయి. కాని అవి ఎవ్వరి దరి చేరటంలేదు.

04/01/2016 - 23:57

‘‘మీ సంస్థకి పోటీగా ఈశాన్య భారతంలో ఇంకో సంస్థ ఉత్పత్తి ప్రారంభించబోతోంది. వచ్చే సీజన్‌నుండి మార్కెట్‌లు ఇబ్బడి ముబ్బడిగా వాళ్ల ప్రోడక్టులతో నిండబోతున్నాయి. అమ్మకాలు లేక, గోడౌన్లలో స్టాక్ కదలక మీ ఫేక్టరీ ఉత్పత్తి ఆపేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ జెఎండ్ జె సంస్థ అధికార్ల సమావేశంలో ముఖ్య సలహాదారు కార్తికేయ తన ప్రసంగం ప్రారంభించాడు.

03/25/2016 - 21:03

కళ్లెదురుగా నీళ్లు.. ఆ నీటిపై తేలే అందమైన నగరం.. నా కళ్ల వెనుక మాత్రం కల్లోల సముద్రం.. మనసును మండిస్తున్న బడబానలం.. వారం రోజుల ఇటలీ ప్రయాణంలో భాగంగా ఇవాళ వెనిస్‌లో ఉన్నాం. నిన్నా, మొన్నా ఫ్లోరెన్స్.. అంతకన్నా ముందు రోమ్.. ఆ రోజు రోమ్‌లో నేను చిక్కుకున్న పరిస్థితిని తలచుకుంటేనే కాళ్లలోనుంచి వణుకు రావలసిన విషయమది!

03/18/2016 - 22:34

‘‘మీరు సమాజంలో పేరున్నవారు. ఈ పట్టణంలో గుర్తింపు వున్నవారు. ఇలా మాకు చెప్పకుండా తల్లిదండ్రులకు చెప్పకుండా రహస్యంగా పెళ్లిళ్లు చేయటం పద్ధతేనా?’’

03/11/2016 - 23:40

‘‘హమ్మయ్య! ఈ రోజుకి మొదటి అధ్యాయం పూర్తయ్యింది’’ వాషింగ్ మిషన్‌లో మూడో రౌండ్ బట్టలను ఉతకడం పూర్తిచేసిన భువన నిట్టూర్చింది, నుదుటన అలముకున్న స్వేదబిందువులను తుడుచుకుంటూ.

Pages