S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం కథ

02/12/2016 - 20:14

రాజేష్‌కుమార్ స్నేహితులతో వీక్‌ఎండ్ పార్టీలో బిజీబిజీగా వున్నాడు. శుక్రవారం సాయంకాలం రాజేష్, అతని మిత్రులు అంతా ఫార్చ్యూన్ హోటల్‌కి చేరుకుని సరదాగా గడుపుతుంటారు. రాజేష్ బి.టెక్ తర్వాత కొంతకాలం జాబ్ చేసి, అది నచ్చక స్వంతంగా బిజినెస్ చేస్తున్నాడు.

02/05/2016 - 20:22

‘షిట్.. తను మళ్లీ అదే తప్పు చేసింది. ఏ మాయ కమ్మేస్తుందో ఏమో ఆ తప్పు జరక్కుండా నిరోధించటంలో విఫలమవుతోంది. ఈ తప్పు కచ్చితంగా భర్తకి తెలిసే తీరుతుంది. ‘తెలిస్తే ఏమవుతుంది?’ తల బద్దలయ్యేలా ఆలోచిస్తోంది సుజన. ఆ వార్త తెలిసినా ఎప్పట్లాగానే ప్రశాంతంగానే ఉంటాడా? లేక పిడుగులు కురిపిస్తూ విలయం సృష్టిస్తాడా?

01/29/2016 - 21:11

ఆరోజు ఆదివారం. సూర్యుడు నులివెచ్చని కిరణాలు వెదజల్లుతున్నాడు వింతకాంతితో. మా ఇంట్లోనూ కొంగ్రొత్తగా వుంది. మా కుటుంబ సభ్యులందర్నీ టెక్నాలజీ ప్రభావం నుంచి తప్పించి, సాధారణ మనుషుల్లా మెలగాలని, ఆప్యాయంగా గడపాలని ఇందుకు ఆదివారం ఒక్కరోజైనా కేటాయించాలని వారిని ఒప్పించాను. మావారి కంప్యూటర్, లాప్‌టాప్, స్మార్ట్ఫోన్.

01/22/2016 - 21:03

అప్పుడే ఎనిమిదైంది. నా ఖర్మ కాకపోతే ఇవాళే సమయం ఇలా పరిగెత్తాలా? అనుకుంది ప్రభావతి. కోడలు అనన్య ఇంకా ఇంటికి రాలేదు. ఇన్నాళ్లూ అంతగా పట్టించుకోని కొడుకు హరి ఇవాళెందుకో రెండు, మూడుసార్లు- ‘ఇంకారాలేదా? రోజూ ఇలాగే వస్తోందా’ అని అడిగాడు. ఇవాళ హరి త్వరగా వచ్చాడు. అందుకే ప్రభావతికి దడగా వుంది. ఈ పిల్ల త్వరగా వస్తే బాగుండు అనుకుంటూ వీధి చివరకు చూసింది.

01/08/2016 - 22:35

‘శైలజా.. సాయంత్రం ఆఫీసు నుండి తొందరగా వస్తా.. రెడీగా వుండు! షాపింగ్‌కెళదాం..’ బైకు తాళాలు తీసి బయల్దేరుతూ అన్నాడు శ్రీకాంత్.
‘ఇప్పుడెందుకండీ ? అక్కడ ఏం కొనాలి?’ అన్యమనస్కంగా అందామె.
‘ఏం కొంటాం? గోంగూర, కొత్తిమీర..!’ అని పకపకా నవ్వి, ‘నీకోసం చీర!’అని అన్నాడు.

01/01/2016 - 22:03

రైల్వే స్టేషన్... ప్రతిరోజూ సాయంత్రం అయిదున్నరకల్లా అక్కడుంటాను. పావు తక్కువ ఆరుకు లోకల్ ట్రెయిన్ వుంది. బస్సులోనూ వెళ్ళొచ్చు. కానీ, ట్రాఫిక్ జాముల్లోంచి ఇల్లు చేరేసరికి చాలా ఆలస్యమైపోతుంది. ఆ రోజు సాయంత్రం అయిదున్నరకు కాస్త ముందుగానే ప్లాట్‌ఫాం మీదున్నాను. అక్కడ చాలా తక్కువమంది వున్నారు. అటూ, ఇటూ పచార్లు చేస్తుండగా నా దృష్టి ఓ సిమెంట్ బెంచ్‌మీద కూర్చున్న వరలక్ష్మి ఆంటీ మీద పడింది.

12/25/2015 - 23:21

గోపురం లాంటి మొగుడని మురిసిపోతూ మొగలి పువ్వులా గుబాళిస్తూ, గులాబీ పువ్వులా నవ్వుతూ, జిలేబీ చుట్టలాంటి జుట్టుతో, కిలాకిలా రావాలతో కొత్తగా కాపురానికొచ్చింది పురం. ఆమె అసలు పేరు త్రిపుర. అందరూ ‘పురం’ అని పిలుస్తుంటారు. ‘పురం.. నీ పుట్టింట్లోలా నీ ఇష్టం వచ్చినట్లు చలాయించడానికి ఇక్కడ వీలు లేదు. ఇక్కడ నామాటే చెల్లుబాటు. నేనెలా చెబితే అలా నడుచుకుంటే నిన్ను నవనీతంలా చూసుకుంటా.

12/18/2015 - 22:24

పాలకడలి ప్రశాంతంగా ప్రవహిస్తున్న వేళ.. ఆ లాహిరికి ఆనంద పరవశుడై ఆదిశేషువు డోలికలూపుతూండగా.. చిరునవ్వులు చిందిస్తూ రమారమణి తన కరపద్మాలతో సుతిమెత్తగా పతి పాదములొత్తుతూన్న సమయాన.. జగన్నాటక సూత్రధారి చిన్ముద్రలో చిరు మెదలిక..

12/11/2015 - 22:25

సత్యప్రసాద్ చనిపోయాడు. అయితే, ఆ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. నేను ఇతరుల విషయం పట్టించుకోను. ఎవరితోనూ పరిచయాలు పెంచుకోను. చిన్నతనం నుంచి ఒంటరి బతుక్కి అలవాటు పడ్డాను. ఆర్మీలో పదిహేనేళ్లు పనిచేశాను. ప్రతి నెలా పెన్షను వస్తుంది. చిన్న ఉద్యోగం కూడా ఉంది. మరి నాకు ఇతరులతో ఏం పని?

12/12/2015 - 21:04

‘మేము హైద్రాబాద్ వచ్చేశామమ్మా.. మావూళ్లో పనులు దొరకడం లేదు.. మీ ఇంట్లో పనిమనిషి కావాలన్నారంట.. 501 ఫ్లాట్లో కూడా చేస్తున్నాను..’ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంది సావిత్రి.
‘ఏమేం పనులు చేస్తావు? పొద్దునే్న రాగలవా?’ అడిగాను.
‘అన్ని పనులూ చేయగలనమ్మా.. మీకేమేం చేయాలి?’ వినయంగా ఆరా తీసింది సావిత్రి.
ఆమె వినయ విధేయతలకి ముచ్చపడి- ‘మీ ఆయన ఏం చేస్తుంటాడు? పిల్లలెంతమంది?’అని అడిగాను.

Pages