S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర గాథాలహరి

09/11/2018 - 18:50

ఆ.వె నీదు మనములోన నెలతలు మెండుగా
నిలచి యుండిరనుటతెలిసి తెలిసి
హృదయ సీమలోన నిసుమంత చోటుకై
సన్నబడుచునుండె వనె్నలాడి

నీ హృదయంలో అనేకమంది స్ర్తిలు క్రిక్కిరిసి ఉన్నారని తెలిసి కూడా ఆమె నీ హృదయంలో స్థానం కోసం మరింతగా సన్నబడుతోందని ఒక వనె్నకాడితో దూతిక పలుకుతోంది

09/10/2018 - 20:15

తే.గీ కర్ణ్భూషణలుగా నొప్పు, కలువపూలు
నవపరాగ మామెకు, నయనములబడగ
ఊదునెపమున, ముద్దాడు ‘‘ఓయి! ఘనుడ!
నీవ నిమిషుల యందున నెవరు చెపుమ?
ఆమె చెవులకున్న కలువపూవుల పుప్పొడి కన్నులలో పడగా ఊదే నెంతో ఆమెను ముద్దాడుతున్న ప్రియుణ్ణి ‘‘నీవు సామాన్యుడవు కాదు. ఏ దేవతా స్వరూపం నాయనా నువ్వు?’’ అంటూ చమత్కరిస్తున్నాడు వారిని గమనించిన ఒకడు.

09/09/2018 - 22:29

తాను తడిసినా ఫరవాలేదు

09/07/2018 - 19:05

తె.గీ నామ నోహరి, మృదువద నారవింద
దర్శనం, బతిఘనము, ముదావహమ్ము
అంతియేకాదు, ఆమెదౌ అభిజనంపు
మేరయును నాకు, ముదమిచ్చు మేరలేక

నా ప్రియురాలి ముఖ చంద్రబింబానే్న కాదు, ఆమె ఊరి పొలిమేరను చూచినా, నాకు అపరిమితమైన ఆనందం కలుగుతుందని నాయకుడు తన స్నేహితునితో చెపుతున్నాడు.

09/06/2018 - 19:24

తే.గీ చేయవలసినదానిని చేయకుంట
చేయకూడనిదానిని చేయుచుంట
అనెడురెండు పనులెపుడు, కనక శైల
మంత వానిని సైతము, అధముసేయు
‘‘చేయవలసినదానిని చేయకుండా ఉండడం, చేయకూడనిదానిని చేయడం, అనే రెండు పనులే- కొండంత మనిషిని సైతం అల్పునిగా చేస్తాయి’’ అని మిత్రుడికి హితోపదేశం చేస్తున్నాడో నాగరికుడు.

09/05/2018 - 21:29

ఆ.వె పెట్టుచున్నవరకు, పెన్నిధిగా బిల్చి
ఇంద్రుడనుట, శీత చంద్రుడనుట
పెట్టలేనివేళ, పెనుతిట్లు తిట్టు
ఈ జగాన ఖలుల, నైజమగును
-పెట్టినవాడు పెళ్లికూడు, పెట్టనివాడు పిండాకూడు’ అన్నది తెలుగు జాతీయం. అదే ఈ గాథలో ప్రతిపాదంచబడింది. నీచులైన వాళ్ళు పెట్టినన్నాళ్ళే మంచిగా పొగుడుతారు, పెట్టనినాడు తీవ్రంగా తిడతారు. ఇదే లోకం నైజం అంటున్నాడు జయరాయుడు

09/05/2018 - 21:30

ప్రాకృతమూలం
ఉప్పాఇ అదవ్యాణం, విఖలాణం కోభా అణం ఖలోచ్చేఅ
పక్కా ఇవి ణింబఫలాఇ ణవరం కాఏహి ఖజ్జంతి (పాలితుడు)
సంస్కృతచ్ఛాయ
ఉత్పాదిత ద్రవ్యాణామపి ఖలానాం కోభాజనం ఖలఏవ
పక్వాన్యపి నింబఫలాని కేవలం కాకైః ఖాద్యంతే
తెలుగు
ఆ.వె అధములైనవారి అక్రమార్జనమును
అధములైన వారె అనుభవింత్రు
పృధ్వి యందు చూడ, వేపపండ్లనెపుడు
కాకితినునుగాని, ఘనుడు తినడు

09/05/2018 - 21:32

ప్రాకృతమూలం
సో అత్థో జోహత్థేతం మిత్తం జం ణిరం తరం వసణే
తం రూ అం త్థ గుణా తం విణ్ణాణం జహింధమ్మో (హాలుడు)
సంస్కృత చ్ఛాయ
సోర్థో యోహస్తే తన్మిత్రం యన్నిరంతరం వ్యసనే
తద్రూపం యత్ర గుణా స్తద్విజ్ఞానం యత్ర ధర్మః
తెలుగు
ఆ.వె సుగుణ గరిమలేని సుందరరూపమ్ము
పరుల చేతిలోని సిరుల మూట
ధర్మదృష్టి లేని దండిజ్ఞానమ్మ
పనికిరాని హితుడు వలదు వలదు

09/02/2018 - 22:11

ప్రాకృతమూలం
జివిఅం అసాసఅం విఅణణిఅత్తఇ జొవ్వణం అతిక్కంతం
దిఅహా దిఅహేహిం సమాణహూంతి కి ణిఠ్ఠురో లో ఓ (హాలుడు)
సంస్కృత చ్ఛాయ
జీవితమశాశ్వత మేవ నివర్తితే వన వతిక్రాంతమ్
దివసా దివసైః సమాన భవంతికి నిష్ఠురో లోకః
తెలుగు
తే.గీ కరగిపోయిన పరువమ్ము మరలిరాదు
కాలమంతయు నొకరీతి గడువబోదు
ప్రాణములు శశ్వతంబుగ, పరగబోవు
ఇంత కఠినత్వము, జనుల కెందుకొరకు?

08/31/2018 - 19:51

ఆ.వె. వట్టి ఇసుక గోడ పదిలంబుగానట్లు
కమలధవుని యొక్క కరుణ లేక
పురుషయత్నమెంత పూర్ణంబుగానున్న
చక్కబడునె పనులు సత్వరముగ

Pages