S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర గాథాలహరి

10/29/2018 - 22:32

తే.గీ శౌరితో గూడి భీముడు, కౌరవేయు
మర్దనము సేయుగతి, మధుమాసవేళ
దక్షిణానిల మక్షీణ కక్షబూని
బాధపెట్టుచున్నది, పాంథతతిని
-అసలే మధుమాసం. ఆపైన మలయానిలం చల్లగా వీస్తోంది. అంతకుమించి వ్యాపారార్థులై దూరదేశానుండడంవల్ల కలుగుతున్న సతీ విరహబాధ. ఆ బాధ ఎలా ఉందంటే శ్రీకృష్ణుని నేతృత్వంలో భీముడు, దుర్యోధనుని మర్దించినప్పుడు అతనికి కలిగిన బాధకన్నా ఎక్కువగా ఉందట.

10/29/2018 - 22:31

ప్రాకృత మూలం
జమ్మంతరే వి చలణం జీ ఏణ ఖుమ అణతుజ్ఘ అచ్చిస్సం
జ ఇతం పి తేణ బాణేణ విజ్ఘసే జేణ హంవిజ్ఘా (ముగ్ధుడు)
సంస్కృతచ్ఛాయ
జన్మాంతరే పి చరణౌ జీవేన ఖలు మదన తవార్చయిష్యామి
యది తమపి తేన బాణేన విధ్యసి యేనాహం విద్ధా
ఆ.వె॥ ఎట్టి శరముతోడ కొట్టినావో నన్ను
అట్టి శరముతోడ కొట్టుమతని
మార! శ్రీ రమాకుమార! పూజింతును
జన్మ జన్మములకు జ్ఞప్తికలిగి!

10/29/2018 - 22:31

తే.గీ అగ్ని వేరు కనగ మన్మధాగ్ని వేరు
సరస హృదులందు ప్రేమాగ్ని సతముమండు
రసవిహీన జనుని అంతరంగమందు
మన్మధాగ్ని క్షణములోనే మాయవౌను

10/29/2018 - 22:28

ఆ.వె రత్న ఖచితమైన, రమ్యహారమునైన
పడతి ప్రక్కనుంచు, పడకగదిని
ఎంతఘనునికైన హీనత తప్పదు
సమయ మహిమవలన, స్థలమువలన

10/24/2018 - 22:15

ఆ.వె కరములెపుడు మోదకరములై వర్తిల్లు
కళల వెన్నొ మిగుల కలుగువాడు
అందనట్టివాడు, అందమ్ముగలవాడు
రాజు వాడు, హృదికి రాజువాడు

10/23/2018 - 22:29

తే.గీ గ్రామణి తనయ నవ యువక హృదయాల
ముగ్థగానె, మోహంబులో ముంచుచుండె
విషపు చెట్టు వోలె పెరిగి పెరిగి ముందు
ముందు ఈ బాల ఏ కొంప ముంచగలదో

10/23/2018 - 22:42

ఆ.వె ఆ సురేంద్రుగావ, అసురేంద్రుయాచించి
ఆకసంబునందు ‘అడుగు’గొల్చి
చుక్కలనెడు పూల చక్కగాన తిగొన్న
చక్రిపాదమునకు శరణమనుడు

10/21/2018 - 23:57

తే.గీ కనన శోకమా! నీవశోకమవు, నిజము
పడతి చరణాహతికి, సుంత బాధపడక
పల్లవింతు వెల్ల హృదులు పల్లవింప
నీదు నిరుపమ రసికత నెన్నదరమె

10/23/2018 - 22:45

ఆ.వె
ముద్దుగొలుపు ముదిత ముఖ చంద్రచంద్రికా
శీతఝరులు, మదిని చెలగుచుండ
మాడ్చు మండు టెండ, మధ్యాహ్నవేళలో
వెడలు, పాంధునెట్లు వెతలు పెట్టు
మనస్సులో ప్రియురాలి ముఖమనే చంద్రబింబంనుండి జాలువారే చల్లని ప్రవాహాలుండటంవల్ల ఆ బాటసారికి ఉష్ణతాపం తెలియడంలేదట. మండుటెండలో కులాసాగా నడచి వెళుతున్న ఒక బాటసారిని గూర్చిన చమత్కార భరితమైన గాథ ఇది.

10/15/2018 - 22:36

ఆ.వె పిండి దంచు, రైతు పిల్లకు మేనెల్ల
పిండియలము కొనగ, విహిత జలధి
మథనమున వెలసిన, మహాలక్ష్మిగానెంచి
కన్నులార్పకుండ, కనిరి జనులు

Pages