S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర గాథాలహరి

10/14/2018 - 22:41

ప్రాకృతమూలం
ఏహిసి తుమంత్తిణి మిసం వ జగ్గిఅం జామిణీఅ పడమద్దం సేసం సంతావ పరవ్యసా ఇవరిసంవవో లీణం (అల్లడు)
సంస్కృత చ్ఛాయ
ఏష్యసి త్వమితి నిమిషమివ జాగరితం యామిన్యాః ప్రథమార్థమ్
శేషం సంతాప పరవశాయ వర్షమివ వ్యతిక్రాంతమ్
ఆ.వె నిన్నరాత్రి సగము నీవు వచ్చెదవంచు
నీదు చెలికి గడచె నిమిషమట్లు
నీవు రాని కతన నిబిడవౌ విరహాన
వత్సరంబువోలె పరగెసగము

10/14/2018 - 22:46

ప్రాకృతమూలం
అహిలేంతి సురహిణీ ససి అ పరిమలాబద్ధ మండలం భమరా!
అముణి అ చంద పరిహవం అ పువ్వకమలం ముహంతిస్సా (వసంతుడు)
సంస్కృత ఛాయ
అభిలీయంతే సురభినిః శ్వసిత పరిమలాబద్ధమండలం భ్రమరాః
అజ్ఞాత చంద్ర పరిభవ మపూరవకమలం ముఖం తస్యాః

10/14/2018 - 22:45

ఆ.వె నీలకంఠు కొరకు నీరమ్ములే చాలు
వెదకుచుంటివేమి? విరులకొరకు
ఎంతవారినైన, ఈ గౌతమీ తటుల్
చెరుపగలవటంద్రు, చిన్నవాడ!

10/14/2018 - 22:44

ఆ.వె చెడ్డవారలైన, చేడెల ముందర
పురుష రత్నమంచు, పొగడుకొంటి
నిన్ను, దూరమైతినీ ప్రేమ ఝరినుండి
ఇపుడు తీరి వగవ నేమి ఫలము?
‘‘సత్ప్రవర్తన లేని ఆడవాళ్ళముందు నా భర్తను అదేపనిగా పొగుడుకున్నాను. వాళ్లల్లో ఎవరో ఒకరు వాణ్ణి వల్లో వేసుకుని నాకు దూరం చేశారు. అంతా చేతులారా నేనే చేసుకున్నాను. ఇపుడు బాధపడి ఉపయోగమేముంది?’’ అని పతికి దూరమైన ఒక స్ర్తి అనుకొంటోంది.

10/14/2018 - 22:44

ఆ.వె వానిమీద నాకు, వలపు లేదందువు
వాని పేరు చెవిని బడినయంత
అర్కుని బొడగన్న అంభోరుహమువోలె
నివ్వటిల్లునేమి? నీదు ముఖము
‘‘వాడిమీద నాకు అసలు ప్రేమే లేదంటావే, గానీ వాడి పేరు చెప్తే చాలు, సూర్యుణ్ణి చూచిన కమలంలా నీ ముఖం వికసిస్తోంది. ఎందుచేతనే చెలీ?’’ అని నాయికను ప్రశ్నిస్తోంది.

10/14/2018 - 22:43

ఆ.వె లేతమావి చిగురు పూతను సిగదాల్చి
వెఱ్ఱివాడొకండు వెడలుచుండ
ముద్దుసఖియనుగొని, పోవుచుండెననియు
వాని వెంబడించె,భ్రమర సమితి

10/07/2018 - 22:37

తెలిసిందిగా!
=======

10/05/2018 - 18:57

ఆ.వె
మంచివాని యొక్క మనసులో నున్నట్టి
ఏ రహస్యములును, ఎన్నడైన
వెలికిరావు, తుదకు కలహంబు గల్గినన్
కాలిపోవునవియు, కట్టెతోడ
-ఇది ఒక నీతిగాథ. ‘‘సజ్జనుడైన వాడితో స్నేహం చేస్తూ చెప్పుకున్న ఎలాంటి పరమ రహస్యాలయినా వానితోనే నశిస్తాయిగానీ, ఎన్నడూ బయటకు రావు. తుదకు కలహం కలిగిన సందర్భంలో కూడా!’ అని నాయకుడు చెపుతున్నాడు.

10/04/2018 - 18:56

ఆ.వె
గ్రహణవేళనైన రజనీశు బింబమ్ము
అమృత కిరణములనె అందజేయు
అటులె సజ్జనుండు అమిత కష్టమునను
ప్రల్లదంబు లెపుడు పలుకబోడు

10/03/2018 - 19:39

తే.గీ
కలుసుకొనెడు చోటు కనరాక, మదిలోన
కలత చెందినట్టి నెలత చూడు!
వెదకుచుండెన్ని వెదురు పొదలలోన
నిధుల మూట కొరకు నెమకినట్లు
ఒక ప్రేమికుల జంట ఫలానా చోట కలుసుకుందామనుకున్నారు. ఆమె వచ్చి సంకేత స్థలాన్ని మరచిపోయి ప్రియునికోసం అన్ని వెదురుపొదల్లోనూ వెదుకుతోందట. ఆమె వెతుకులాట చూస్తూంటే ఏదో పోగొట్టుకున్న నిధికోసం వెతుకుతున్నట్టుగా ఉందని చమత్కరిస్తున్నాడు గాథాకారుడు.

Pages