S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రార్థన

10/25/2019 - 19:12

మీరు లోకమనకు వెలుగై యున్నారు. కొండ మీద పట్టణము మరుగై యుండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది ఇంటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు
- మత్తయి 5:14-15

10/18/2019 - 19:39

‘అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహం కారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు! అనురాగ రహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు.

10/11/2019 - 19:13

యెహోవా మన తండ్రి. యేసు ప్రభువు మన అన్న. మోక్ష నగరు మన పుట్టిల్లు. ముఖ్యదూతల్ మన స్నేహితులు. అబ్రహాము దావీదు మొదలైన వరభక్తాగ్రేసరులు మన చుట్టాలు. తనువు బలి పెట్టెను మన యేసన్న. తప్పుల్విడగొట్టెను మన తండ్రి.

10/04/2019 - 19:58

నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు - యోహాను 15:1.
నా యందు నిలిచి యుండుడి మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనే గాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నా యందు నిలిచి యుంటేనే కాని మీరు ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను. తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.

09/27/2019 - 20:26

ఆయన మన సమాధానమై యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్తమ్రును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. -ఎఫె. 2:14

09/20/2019 - 19:52

మరణాన్ని గెలిచిన యేసుక్రీస్తు మనతో స్నేహం చేయటానికి ఇష్టపడుచున్నాడు. సర్వసృష్టికర్త సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుండు మనతో స్నేహము చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయనతో స్నేహం మరణ బంధకాల నుండి మరణ భయము నుండి విడుదల కలుగజేస్తుంది. మన కొరకు ప్రాణము పెట్టిన దేవుడు యేసుక్రీస్తు.

09/06/2019 - 18:54

‘నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. చావైతే లాభము’ - ఫిలిప్పీ 1:21
లోకానికి మరణమంటే బహు భయం. అయితే మరణానికి, మరణాన్ని గెల్చిన, మరణపు ముల్లు విరిచిన క్రీస్తు అన్నా, క్రీస్తును వెంబడించే వారన్నా బహు భయము.

08/30/2019 - 20:12

‘ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికిని తల్లి’ - ఆది 3:20

08/23/2019 - 19:28

ఎవరైనా అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది.

08/16/2019 - 18:59

వనలు దేని చేత తమ నడత శుద్ధి పరచుకొందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా? - కీర్తనలు 119:9
‘నీవు వనేచ్ఛల నండి పారిపొమ్ము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము’ - 2 తిమోతి 2:22.

Pages