S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణ లీలారింఛోళి

05/06/2019 - 19:46

తే.గీ. పక్వమందిన మామిడి పండ్లకన్న
రసన కింపుగూర్చెడు ద్రాక్షరసము కన్న
ఆవుపాలతో జేయు పాయసము కన్న
నాణెమైనట్టి చెరకు పానకము కన్న
మాధవా! నీదు నామమే మధురతరము

భావం: మాధవా! మధుసూదనా! బాగా పండిన మామిడి పండ్లకన్నా మధురమైన ద్రాక్ష రసంకన్నా ఆవుపాల తో జేసిన పాయసం కన్నా చక్కని చెరకు పానకం కన్నా నీ నామమే మధురాతి మధురం.

05/03/2019 - 19:38

తే.గీ. కనగ కృష్ణుండు గోవులగా చెనిచట
అలరి గోప బాలుర తోడ నాడెనిచట
కృపను గోవర్థనా చలం బెత్తెనిచట
ననియు ఘనయము నా తటిననుదినమ్ము
స్వాంతమందున దలపోసి సంతసించు
భాగ్యమీవయ్య రసభావ! వాసుదేవ!

05/02/2019 - 19:44

తే.గీ. ప్రియ సఖా! నిన్ను నను వీడి వెడలుమంచు
పలుకలేను, నిల్వుమనుట పాడిగాదు
కాక, నీ యిష్టమని యన్న, కనగనద్ది
నీ యెడ, నుపేక్ష యగును గాకన, నీవు హృదిని
మనలమైత్రిని మాత్రము మరువబోకు!

05/01/2019 - 20:01

తే.గీ. లలిత నవపుష్పమాలికల్ గళములందు
సౌరభమ్ములు విరజిమ్ము సమయమందు
వల్ల వీజన మెల్ల వ్రేపల్లెలోన
వేణు మాధవు రాకకై వేచి వేచి
వేడి నిట్టూర్పులకు విరుల్ వాడిపోయె!

04/30/2019 - 19:25

తే.గీ. అదియె రమ్య బృందావనం బవి యెలతలు
మధుర మధుమాస వైభవంబదియె జూడ
వేటి స్థానంబుల లందవి వెలయుచుండె
కనగ కృష్ణుడిచట లేని కారణమున
అప్పుడున్నట్టి మాధుర్య మిప్పుడేది

04/29/2019 - 18:58

తే.గీ. వాసుదేవుండు మదుర కు వచుచ్చవేళ
ఎండ కనె్నరుగని యట్టి ఇంతులున్న
వలచి నడివీధి నెదురెండ నిలచియుండ్రి
అంధులును గూడా పరుల సాయమ్మునంది
వచ్చి నిలిచిరి వీధిలో వాని కొరకు

04/28/2019 - 23:01

తే.గీ. కృష్ణ! గోవర్థనగిరి ఎత్తిపట్టి
మోసి మోసియు నీ చిన్ని భుజములలసె
నేమొ నీకు సాయమ్ము గామేము గూడా
మోసెద మనియు తమ భుజములను జేర్చ
గోపబాలురు జూపించు కుతుకమునకు
కపట మెరుగునట్టి అమాయకత్వమునకు
సంతసించెడు వనమాలి శర్మమొసగు

04/26/2019 - 20:01

తే.గీ. గొంతు గూర్చుని ఘటమును కుదురుగాను
కాళ్ళమధ్యను నిల్పియు కమ్రగదిని
పాలు పితికెడు వేళ గోపాల బాలు
సుందరమ్మగు రూపమానందకరము
పాలధారల సవ్వడి బహురమణము

04/25/2019 - 22:18

తే.గీ. చెంత కృష్ణుడు ప్రేమతో చెలగువేళ
వానితోడిదే లోకమై బరుగుచుండు
వాని నెడబాసి విరహాన నానువేళ
లోకమంతయు కృష్ణుడై మ్రోలనిల్చు!

04/24/2019 - 22:20

ఆ. వె. వంశగౌరవమ్ము పాండితీగరిమమ్ము
స్వర్ణవైభవమ్ము భవన చయము
మదిని ఆవరించి మదము గూర్పగలేవు
హృదయ సీమలోన కృష్ణుడున్న
భావం: వంశం యొక్క కీర్తి ప్రతిష్టలూ సంపాదించుకున్న పాండితీ వైభవమూ ఇంటినిండా ఉన్న ధనరాశులూ కట్టించుకున్న భవనాల వరుసలూ ఇవేవీ కృష్ణుడు గనుక హృదయంలో నిండి ఉన్నట్లయితే మదాన్ని గర్వాన్నీన కలిగించలేవు.
*
తే.గీ. అలిగి వానిపై కోపమ్ము నభినయింప

Pages