S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణ లీలారింఛోళి

04/23/2019 - 18:31

తే.గీ. దివ్యమగు యమనా నదీతీరమందు
నీల మేఘ వర్ణుని కమ్ర నీరజాక్షు
ఘన విశాల వక్షుని బొడగాంచినంత
నాదు హృదయమ్ము నిలువక నలినదళము
పైని, నీటి బిందువు వోలె బరుగుచుండె
నని చెలులతో పలుకు రాధ కనుల మెదలు
మోహనాంగు డౌ కృష్ణుండు బ్రోచు గాక!

04/22/2019 - 19:52

తే.గీ. దాశరథీ గాథ జెప్పుచు తల్లియగు య
శోద ముదముతో వీపుపై సున్నితముగ
చిచ్చి గొట్టుచు నిద్దుర బుచ్చువేళ
రావణుని నామమంతలో రాగ, లక్ష్మ
ణా! త్వరితముగను ధనువునందుకొనుము
దశముఖుని పీచ మణచెద, ధరణి జాత
కు మితిలేని సంతసమును గూర్తునిపుడె
అంచు బల్కెడు గోవిందుడభయమొసగు ॥

04/21/2019 - 22:17

తే.గీ. శర్వ సర్వేశ నీకిదె స్వాగతమ్ము
సుఖముగాని నిచటను పవిష్టుడవుగమ్ము
కమలభవ! క్షేమమా! సృష్టిక్రమము దెలుపు
ప్రథమపూజ్య! మార! కుమార! రండు రడు
భద్రమా! సురేంద్ర కుబేర వరుణులార!
అంచు కలవరించెడు శౌరి అభయ మొసగు॥
*

04/19/2019 - 20:01

తే.గీ. రమ్య చంద్రికారోచిస్సులలరువేళ
ఫుల్లమల్లికా స్తబకముల్ వెల్లివిరియ
పికరవమ్ములు వీనుల విందుసేయు
మధుర మురళీరవంబులు మలయుచుండ
ప్రథిత బృందావనాంతర ప్రమదసదన
మందు సుందర గోపికా బృందమెల్ల
ఘనత రానంద జలధిలోమునిగి తేలె॥

04/18/2019 - 20:24

తే.గీ. వెన్నదుత్తను జూచియు వేగ జేర
కడగి మెల్లగా పాకుచు వెడలుచుండ
ఇంత లోపలను యశోద ఎదురుపడగ
ఏమియు నెరుగ కున్నట్లు మోము ద్రిప్పి
చల్లగా జారుకొన జూచు నల్లనయ్య
చల్లగా జూచి మలను సాకు గాక!

04/17/2019 - 20:15

ఆ.వె. నాదు హృదయమందు నాదు చెవులయందు
నయనయుగమునందు నాల్కయందు
మహిమగల్గినట్టి ‘మధుర’ మధురముగా
నిలచియుండుగాక! నిశ్చలముగ॥

04/16/2019 - 20:16

తే.గీ. మధుర లోనున్న జనులిచ్చు మధురమైన
ఘృత పదార్థములను స్వీకరించినట్లె
వల్ల వీజన నికరంపు పరమమైన
ప్రేమను ప్రియముగా స్వీకరించినటేల
విదురుడిచ్చిన విందును స్వీకరించి
నట్లె, ఆకు చేలు అటుకులందినట్లె
నాదు అత్యల్పమగు భక్తి నాదరించి
కావు మోపరమ పవిత్ర కంజనేత్ర

04/15/2019 - 23:27

సీ. అమరేంద్రు గర్వంబు హరియించివెల్గిన
ధన్యగోవర్థనో ద్ధర్త వీవు
వల్లవీజనముల వలువలు హరియించి
భాసిల్లు గోపికా భర్తవీవు
క్రౌర్య స్వరూపుడౌ కంసుని ప్రాణముల్
హరియించిన యసుర హర్తవీవు
ఆర్తజనంముల అఘముల బాపియు
కాచి రక్షించెడు కర్తవీవు
తే.గీ. మున్ను వ్రేపల్లె వాడలో వెన్నతిన్న
ముగ్ధమోహన రసరమ్య మూర్తి వీవు

04/14/2019 - 22:04

తే.గీ. విమల సుందర నయనార విందయుగము
గల్గు శతకోటి మన్మథాకారుడవగు
సరసబృందావనారామ చక్రవర్తి
నీదు రూపమ్ము హృద్వీధినిలచుగాక !
భావం: బృందావన సార్వభౌముడవగు ఓ రాధా మనోనాయకా! సుందరమైన నేత్ర యుగంతో శతకోటి మన్మథాకరుడవై భాసించే నీ దివ్య మంగళ విగ్రహం నా మనో వీధిలో నిలిచి యుండుగాక ( శీభవానంద)
తే.గీ. మహిత కవిసార్వ భౌమ త్వముడుగబోను
అతుల సౌందర్య రాశుల నడుగబోను

04/11/2019 - 22:21

తే.గీ. భువిని కావ్యరస సుధానుభవము కన్న
వ్యాకరణ శాస్త్ర పాండితీ పటిమ కన్న
బర్హి పింఛమ్ము శిరముపై వరలు చుండ
కంఠమున పూసల సరులు కదులుచుండ
భువన మోహనంబు గ వేణువు పలికించు
నందనందను ధ్యానమానందమొసగు

Pages