S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/05/2018 - 19:33

చీకటిని చీల్చే ప్రతి దీపం
మనలోని అజ్ఞానాన్ని తొలగించి
తొవ్వ చూపిస్తుంది

అహంకారపు పొరల్లో
కూరుకుని మానవత్వాన్ని పాతరేసినప్పుడు
మనిషిననే స్పృహని మేలుకొల్పే
దివ్వెలు, అడుగడుగునా

శబ్దంలోని నిశ్శబ్దాన్ని గుర్తించి
ఒంటరితనం కాదు సమూహమే మనల్ని
ఒక్కటిగా చేసే వెనె్నల మడుగులు

11/04/2018 - 22:27

ఎంతగొప్పది
అంతరంగం!
అంతా తానై...
మనల్ని నడిపించినా..
కంటి కెమెరాకు చిక్కదు!
గుప్పెట్లోకి దొరకదు!

ఒక్కోసారి ఎడారిలో
నీటి స్వప్నంలా..
ఊరటనివ్వని జీవితాన్ని ప్రసాదిస్తుంది!

అంతరంగ సాగరంపై
తరంగాలై..
జ్ఞాపకాల దొంతరలతో
దాగుడుమూతలాడుతూ..
ఊహల పల్లకీలో ఊరేగిస్తుంది!

11/02/2018 - 20:18

ఆధునిక సమాజంలో సంప్రదాయ జీవన విధానానికి పాశ్చాత్య నాగరికత, సంస్కృతి చొచ్చుకొని రావటం కారణంగా ప్రభావితమైన విలువలు, దైనందిన నడవడిక, ఆలోచనలతో జీవితాలను మలుపు తిప్పుతున్నాయి. స్ర్తి పురుషులు కలిసికట్టుగా, సామాజిక నియమ నిబంధనలకు లోబడి క్రమశిక్షణాయుతంగా మత ధర్మాచరణతో, ఎప్పటికప్పుడు సంస్కరణలను ఔదలదాలుస్తూ జీవన సంక్షేమ ప్రగతికి, ప్రశాంతతకు కట్టుబడి జీవించడం అనాదిగా వస్తోంది.

11/01/2018 - 19:28

శానిటరీ ప్యాడ్‌లు అనగానే అందరూ తలలు దించేసుకుంటారు. ముఖం చాటేస్తారు. ఇదేం అంత సిగ్గుపడాల్సిన విషయం కాదు. లఘుశంకలాగే ఇది కూడా ప్రకృతి అవసరం అని ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? దీని గురించి ఆలోచించి పేద బాలికలకు, తండాల్లో ఉన్న మహిళలకు వాటి గురించి అవగాహనను అందించడంతో పాటు ఉచితంగా శానిటరీ ప్యాడ్‌లను అందిస్తోంది మీనామెహతా.. వివరాల్లోకి వెళితే..

10/31/2018 - 19:47

‘మీటూ’ అంటూ మహిళాలోకం నినదిస్తున్నవేళ మనువు మాటలు మరోసారి మననం చేసుకోవడం అత్యంత ఆవశ్యకం.

10/31/2018 - 19:44

పచ్చని చెట్లను
నరికి నగరపు కృత్రిమ
అడవుల్లో
సంచరిస్తున్నాం

ఒకప్పటి కాలం అంటూ
పుస్తకాల్లో అక్షరాలని చూసి
అల్ప సంతోషులై
కేరింతలు..
కొడుతున్నాం

కాకులు దూరని కారడవి
చీమలు చేరని
చిట్టడవి ఇప్పుడు అంతా
కథల్లోనే..

విధ్వంసం అభివృద్ధి
రూపంలో కాటేస్తుంటే
చెంపదెబ్బకు బదులు
చప్పట్లతో సన్మానిస్తున్నాం..

10/30/2018 - 19:35

నేటి తరం పదేళ్లయినా నిండకుండానే ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచేస్తోంది. వీరి నైపుణ్యం చూసి అబ్బురపోతూ.. మా పిల్లలు చాలా ‘స్మార్ట్’ అంటూ మురిసిపోతున్నారు తల్లిదండ్రులు. ఇలా అతిగా గాడ్జెట్స్‌కు అలవాటు పడితే ఇబ్బందులేంటో తెలుసా..

10/28/2018 - 23:34

దేహాన్ని దేశాన్ని రాసిచ్చేసి
రాలిపోయిన వాడి పేరు
రాత్రిపూటైనా తలుచుకో!
రక్తాని దారిపొడవునా దానం చేసూత
కనుమూసిన వాడి కథను
కడవరకు గానం చేసుకో!
చెమటతో కాలాన్ని కలిపి
పొట్టకి పట్టెడన్నమై
రొట్టి లా కాలినవాడిని
గట్టిగా హత్తుకో!
రాత్రికీ పగటికీ మధ్యన
యంత్రమై తిరుగుతూ
లోకాన్ని మెరిపించి
ఆరిపోయిన వాడి గుర్తుగా

10/26/2018 - 19:10

ఆటగాళ్లు ఎవరైనా
ఆట రక్తి కట్టడం
చూపరులకానందం పరమానందం
గెలుపో ఓటమో
ఎవరో ఒక్కరికే!
పాడుతూ ఆడినా
ఆడుతూ పాడినా
ఎప్పటికప్పుడు
అపూర్వమైన అనుభూతి
ఇరువురి మధ్య
పలుజట్ల మధ్య
పలు దేశాల మధ్య
ఎవరాడుతున్నారన్నది కాక
ఎలా ఆడుతున్నారన్నది ముఖ్యం సుమా!
పోటీ ఎంతగా ఉన్నా
ఫలితమెలా ఉండబోతున్నా
ఎవరి అంచనాలెలావున్నా

10/25/2018 - 19:09

కొంతమంది పెద్ద ఉద్యోగస్థులైనా, ఇంట్లో అన్ని వ్యవహారాలను నడిపేశక్తి గలవారైనా సరే ఒక్కోసారి ఆత్మనూన్యతతో బాధపడుతుంటారు. దీనితో చేయాల్సిన పనులకు ఆటంకాలు ఏర్పడుతాయి. నలుగురిలో మాట్లాడాలన్నా, ఇప్పుడు ఇది చేస్తే ఎలా ఉంటుందోలే, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న ఆలోచన్లతో సతమతమవుతుంటారు.

Pages