S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/17/2016 - 00:13

చెలామణీలో లేకుండా ‘పాతర’లలో మూలుగుతున్న కరెన్సీ కట్టల కోసం- చెలామణీలో వున్న కోట్లాది ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లను ఉన్నపళాన చిత్తు కాయితాలుగా మార్చేయడంతో- పేదా, గొప్పా- అంతా సమానమైపోయారు. బాగుంది గాని నిత్యావసర ప్రపంచంలో అనవసరంగా వున్న పైకం అంతా కొత్త నోట్లలోకి మార్చుకోవాలీ అంటే ముప్పాతిక వంతు పనిచెయ్యని ఎ.టి.ఎమ్‌లు- లక్షా ఇరవై వేల లెక్కల వున్న ఖాళీ పోస్ట్ఫాస్ సేవింగ్స్ బ్యాంకులూ సరిపోతాయా?

11/17/2016 - 00:07

అమెరికాలో కాలిఫోర్నియాలో ‘వౌంటెన్ వ్యూ’ హైస్కూలు చాలా పెద్దది. అందులో చరిత్ర పాఠాలు చెప్పే అధ్యాపకుడు- అరవై అయిదు సంవత్సరాల అత్యంత అనుభవజ్ఞుడైన అధ్యాపకుడు ‘ఫ్రాంక్ నెవార్రో’ని క్లాసులో పాఠాలు చెబుతూండగానే బయటికి గెంటేసింది మ్యానేజిమెంట్. వెంటనే శెలవులో పొమ్మంది. ఇంతకీ అతను చేసిన నేరమల్లా కొత్త అధ్యక్షుడు ‘డోనాల్డ్ ట్రంప్’గారు ‘హిట్లర్‌లాంటివాడు’ అనడమే.

11/17/2016 - 00:03

చెన్నైలో హోటల్స్‌లో కొత్త ‘ట్రంప్ దోశలు’ అమ్మడం మొదలుపెట్టాయి. వాటిమీద మామూ లు టాక్సులు తప్పవు గానీ, కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిసారి దోశలమీద ‘‘అది ఎమ్.ఎల్.ఏ దోశ అయినా ఎమ్.పి. దోశ అయినా సరే- దానిమీద టా క్స్ లేదు- వెయ్యరాదు’’ అని ఆర్డర్లు పడ్డాయి.

11/12/2016 - 21:14

పళ్లు క్లీనింగ్ చేయించుకోవడం వల్ల పాచి, మరకలు పోతాయి. అలా మరకలు పోయాక కూడా పళ్లు పసుపుపచ్చగా ఉన్నవారిలో బ్లీచింగ్ లేక లేజర్‌తో పళ్లని తెల్లగా చేసే ప్రయత్నం చేస్తాం. వంశపారంపర్యత కారణంగా పళ్లు పసుపుపచ్చగా ఉన్నవారిలో కూడా బ్లీచింగ్ లేక లేజర్ చికిత్స చేస్తారు. బాధితులు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్య విషయం ఏమిటంటే, ఇవి తాత్కాలిక ఉపశమనం ఇచ్చే చికిత్సా విధానాలు.

11/11/2016 - 00:19

అనుకున్నది సాధించాలంటే అంగవైకల్యం అడ్డురాదని నిరూపించింది శ్రద్ధా వైష్ణవ్. పుట్టుకతోనే మూగ, చెముడు. అయితే ఆమె ఎప్పుడూ తనకు వున్న వైకల్యం గురించి బాధపడలేదు. తనకు ఇష్టమైన క్రికెట్ ఆడటం ప్రారంభించింది. సైగలనే మాటగా మలచి బౌలర్‌గా రాణిస్తున్నారు. నేడు ఈ 18 ఏళ్ల శ్రద్ధ చత్తీస్‌గఢ్ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలిగా ఎంపిక అయ్యా రు. దేశంలోని దివ్యాంగు (బధిరు)లందరికీ రోల్ మోడల్‌గా నిలిచింది.

11/10/2016 - 01:24

‘పులి’ మన దేశంలో జాతీయ జంతువుగా యింకా రకరకాలుగా పేర్గాంచింది. దాన్ని అంతరించిపోతున్న జాతులలో చాలా ముఖ్యమైనదిగా ప్రకటించారు. నలభై వేల గాండ్రు గాండ్రు పులున్న మన దేశంలోని అడవులలో వాటి సంఖ్య నలభైవేల దాకా వుండేది కాస్తా ఇరవై రెండు వేలకి దిగజారిపోయింది.

11/03/2016 - 22:10

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

11/03/2016 - 22:09

చలికాలం వచ్చిందంటే గుర్తుకువచ్చేవి, వెచ్చదనాన్నిచ్చేవి వింటర్‌వేరే! చలి నుంచి శరీర రక్షణకు నేడు కొత్త వెరైటీస్‌తో వింటర్ కలెక్షన్స్ మార్కెట్లో ప్రవేశిస్తున్నాయి. సీజనల్ ఫ్యాషన్లు అనుసరించడంలో ఎప్పుడూ ముందుండే నేటి తరం వింటర్ డ్రెస్సింగ్‌లోనూ సరికొత్త ఫ్యాషన్లకు తెరలేపింది. ముదురు రంగుల్లో జర్కిన్లు, వెరైటీ డిజైన్లతో కూడిన సరికొత్త వులెన్ దుస్తుల్లో కనువిందు చేస్తున్నారు.

11/03/2016 - 03:01

సెల్ఫీలు తీసుకునే వెర్రి వ్యామోహం అమెరికా అధ్యక్షుడు ఒబామా దగ్గరనుంచి మన ప్రధానమంత్రి మోదీగారి దాకా వ్యాపించి పోయింది. యువతీ యువకులు సెల్ఫీలు తీసుకునే వెర్రి వ్యామోహంలో చాలాసార్లు నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొండ అంచున, లోయ లోపల, పులి బోను లోపల, జలపాతం కింద - యిలా ఒక దగ్గర అని లేదు.

10/29/2016 - 21:42

హిందూమత సంస్కృతికీ, సంప్రదాయానికీ చిహ్నం ‘దీపావళి’ పర్వదినం. తెలుగువారు ఈ పండుగను దివ్వెల పండుగ అని అంటారు. శ్రీరామచంద్రుడు పట్ట్భాషిక్తుడైన రోజు. రాక్షసరాజైన బలి చక్రవర్తిని వామనమూర్తి పాతాళలోకానికి అణచివేసిన దినం. వీణను కూడా పట్టుకోవటం చేతకాని సుకుమారి సత్యభామ విల్లును చేతబట్టి బాణాల వర్షం కురిపించి రాక్షస సైన్యాన్ని తరిమిన శుభదినం.

Pages