S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/03/2016 - 03:01

మహిళల సంక్షేమానికి ఎన్ని చట్టాలు చేసినా భారతీయ సమాజంలో అనాదిగా కొనసాగుతున్న లింగవివక్ష వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని సీనియర్ ఐపిఎస్ అధికారిణి అర్చన రామసుందరం (58) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో పారా మిలటరీ బలగాల్లో ఒకటైన ‘సశస్త్ర సీమా బల్’ (ఎస్‌ఎస్‌బి) డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె- ‘లింగవివక్ష అంతం కానిదే మహిళా సాధికారత సాధ్యం కాద’ని చెబుతుంటారు.

01/30/2016 - 21:02

ఎవరైనా ఎక్కువసేపు నిద్రతీస్తే బద్ధకం, ఊబకాయం తప్పవని మనం తరచూ వింటుంటాం. అయితే, తగినంతగా నిద్ర పోవడం వల్ల శరీరం బరువు తగ్గే అవకాశం ఉందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. మేలు చేసే కొన్ని బ్యాక్టీరియాలు పొట్టలో ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా దోహదపడతాయి. రాత్రిపూట మాత్రమే ఈ బ్యాక్టీరియాలు చురుగ్గా పనిచేసి జీర్ణవ్యవస్థకు సహకరిస్తాయి.

01/29/2016 - 21:18

ముఖం మీద మొటిమలు, కళ్లకింద నల్లటి మచ్చలు..
బ్యూటీపార్లర్‌కి వెళ్లాలా? స్కిన్ స్పెషలిస్ట్‌ను కలవాలా?
మార్కెట్‌లో రకరకాల క్రీమ్‌లు..
ఏది వాడితే ఏమవుతుందో..?
- కాబోయే పెళ్లికూతురి మదిలో అంతులేని సందేహాలు.
పాతికేళ్లు నిండని సాఫ్ట్‌వేర్ కుర్రాడికి-
తన ముఖం కళావిహీనంగా ఉందన్న ఆందోళన..
అమ్మాయిలు మనసుపడేలా ఉండాలంటే
ఏం చేయాలన్నదే నిరంతర ఆలోచన..

01/28/2016 - 21:33

మానసికోల్లాసానికే కాదు, గ్రీన్ టీని సౌందర్య సాధనంగానూ ఉపయోగిస్తే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. ప్యాకెట్లలో లభించే గ్రీన్ టీ ఆకులను ముద్దగా చేసుకుని ‘ఫేస్‌ప్యాక్’ వేసుకుంటే ముఖచర్మం కాంతివంతమవుతుందని ప్రఖ్యాత మోడల్ మిరందా కెర్ తన సౌందర్య రహస్యాలను వివరిస్తోంది. వేడినీళ్లలో గ్రీన్ టీ ఆకులను వేసి స్నానం చేస్తే శరీరం కొత్తఅందాలతో మిలమిలలాడుతుందని ఆమె భరోసా ఇస్తోంది.

01/27/2016 - 22:43

ప్రస్తుతం బెజవాడలో సత్యనారాయణపురాన్ని, మిగతా నగరాన్నీ విడగొడుతూ జనాల ప్రాణాలను హైరానా పెడుతోంది బి.ఆర్.టి రోడ్డు. సరిగ్గా ఇలాంటిదే దేశ రాజధాని దిల్లీలోనూ ఒకటి వుంది. ‘బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టు మార్గ్’ అంటారు దీన్ని.

01/27/2016 - 22:35

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్‌సైట్లలో వెల్లువెత్తుతున్న ‘సెల్ఫీ’ల కారణంగా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్మార్ట్ఫోన్లతో సెల్ఫీలు తీసుకోవడం, వాటిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోకి ‘పోస్ట్’ చేయడం అనేది నేడు చాలామందిలో ఓ వ్యసనంగా మారుతోందని అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

01/27/2016 - 08:50

శీతాకాలంలో దోమల వ్యాప్తి అధికంగా ఉంటుంది గనుక మనం అనారోగ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండక తప్పదు. ఒకప్పుడు రాత్రి సమయాల్లోనే దోమల బాధ వుండేది. ప్రస్తుతం వాటికి రాత్రింబవళ్ల తేడా వుండడం లేదు. పగటి పూట విజృంభించే దోమల వల్లే ప్రమాదం హెచ్చుగా వుంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎనాఫిలస్ అనే జాతిలోని ఆడదోమల వల్ల మనకు మలేరియా వ్యాధి సోకుతుంది. క్యూలెక్స్ దోమ కారణంగా బోదకాలు వస్తుంది.

01/20/2016 - 22:32

సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కాలు తదితర పొగాకు ఉత్పత్తుల ప్రచారానికి ఇక తాను స్వస్తి చెబుతానని బాలీవుడ్ శృంగార భామ సన్నీ లియోన్ ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేసింది. గతంలో నీలిచిత్రాల నటిగా విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆమె 2012లో బాలీవుడ్‌లో అడుగుపెట్టాక వివాదాలకు, సంచలనాలకు క్రమంగా దూరంగా ఉంటోంది.

01/19/2016 - 22:07

మన ఇంటి పెరట్లోనో, చుట్టుపక్కల ఖాళీ ప్రదేశాల్లోనో పలురకాల మొక్కల్ని నిత్యం చూస్తూంటాం.. వాటిలో మనకు తెలియని మొక్కలు ఎన్నో.. అవి ఎందుకూ పనికిరాని పిచ్చిమొక్కలని భావిస్తాం.. వాటిలోని ఔషధ గుణాల గురించి మనకు తెలియదు.. శారీరక అనారోగ్యాలను నివారించే ఔషధ గుణాలు ఇలాంటి మొక్కల్లో పుష్కలంగా ఉంటాయి..

01/19/2016 - 22:05

శారీరక, మానసిక ఉల్లాసానికి ఉదయానే్న యోగాసనాలు వేయడం అందరికీ తెలిసిందే. అయితే, పెంపుడు శునకాలతో కలిసి ‘యోగా’ చేయడం ఇపుడు చాలాదేశాల్లో సరికొత్త ‘క్రేజ్’గా మారింది. శునకాలతో కలిసి యోగా విన్యాసాలు చేయడాన్ని ‘డోగా’ అని వ్యవహరిస్తున్నారు. హాంకాంగ్‌లో సోమవారం నాడు 270 మంది యజమానులు తమ పెంపుడు శునకాలతో కలిసి పలురకాల యోగాసనాలు ప్రదర్శించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

Pages