S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/20/2019 - 22:30

భావాలన్ని కదం తొక్కుతూ
కాగితంపై కవాతు చేస్తుంటే

ఇంకిపోని నా కలం సాక్షిగా
కొత్త చరిత్రని లిఖిస్తాను

చేదు నిజంలాంటి గతాన్ని చెరిపి
భవిష్యత్తుపై తీపి ఆశ రుచి చూపిస్తా

ఏళ్ల బానిసత్వాన్ని వదిలేసినా
మనసుని వీడని అలసత్వాన్ని వదిలిస్తా

నా కవిత్వం వెన్నల్లో ఆడుకునే
అక్షరాలే కాదు
అవసరం అయితే కత్తిపట్టే
యుద్దవీరులుని నిరూపిస్తా

03/19/2019 - 22:11

రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అశాంతికి నెలవైన ఆ ఈశాన్య రాష్ట్రం నుంచి నిత్యం వేలాది మంది యువతీ యువకులు ఉపాధి కోసం ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలకు వలస పోతుంటారు.. ప్రాంతీయ విద్వేషంతో మహా నగరాల్లో కొందరు తమపై దాడులు చేస్తున్నా- వలస వచ్చిన వారు వౌనంగా భరిస్తారు.. జీవనోపాధి కోసం వలస బాట పట్టిన నాగాలాండ్ యువత అవమానాలకు, అవస్థలకు ఎదురీది కాలం వెళ్లదీస్తుంటారు..

03/19/2019 - 22:06

రంగులంటే ఆషామాషికాదు
ప్రతీ భావానికి ప్రతీక
జీవితంలో కష్టనష్టాల సునామిలో
కొట్టుకుపోయినా
ధైర్యాన్నిచ్చే గొప్ప నేస్తం

స్వచ్ఛ తెలుపులాంటి మనసుతో
మనుషుల్ని హత్తుకున్నప్పుడు

అన్యాయంపై గొంతెత్తి
ఎర్రజీరలు పులుముకున్న
కళ్లలోని ఎరుపురంగులు

నచ్చలేనితనాన్ని
మోముపై నలుపై నిరసనై
వెల్లువెత్తినప్పుడు

03/18/2019 - 19:55

భారతీయులు అవిసె గింజలను ఎంతో పురాతన కాలం నుంచి తమ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఇప్పుడంటే చాలామంది వీటిని తినడం తగ్గించేశారు. కానీ నిజానికి అవిసె గింజలను తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఎవరూ వాటిని విడిచిపెట్టరు. ఈ గింజల్లో శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.

03/17/2019 - 22:55

సీ॥ ఆడవారిని ఁదూలనాడఁబోయినవారు
బాగుపడగఁబోరు భవితలోన;
తోడునీడగువారిఁద్రోసిబుచ్చినవారు
అతి జుగుప్సితులౌదురవనిలోన;
మహిళల పట్లను మార్గంబుఁదప్పిన
తమవంశమంతవౌ ధరణిలోన;
వారిసేమముపట్లఁబట్టింపులేకున్న
వేదనే మిగులునీ పృథ్విలోన;
తే.గీ॥
స్ర్తిలు పూజింపఁబడుచోట సిరులుగురియు
నెచట గౌరవముంబొందురచట సుఖము;
వారి ప్రతిభకు ఁబట్టమ్మునరయఁగట్ట

03/15/2019 - 18:44

సాధారణంగా డోలు వాయిద్యాలను పురుషులే ఎక్కువగా వాయిస్తుంటారు. ఎందుకంటే దీనికి బలం చాలా అవసరం.. కానీ గోవాకు చెందిన ఈ మహిళలు ఆ సాంప్రదాయాన్ని తిరగరాశారు. వీళ్లు సొంతంగా ఓ బ్యాండు మేళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో సభ్యులందరూ మహిళలే.. గోవా రాష్ట్రంలో వీరికి ప్రత్యేక గుర్తింపు లభించింది. దాంతో వివాహ కార్యక్రమాలకు, ఇతర ఉత్సవాలకు రాష్ట్రంలో చాలామంది వీరినే పిలుస్తున్నారు.

03/15/2019 - 18:41

చీకటి కాటుక
కలల కళ్ళను
నిదుర దోసిట్లో పొదువుకుంది!

మెరిసే నక్షత్రాలై
మురిసే ఆశలను
ఊహల వాకిట్లో నిలుపుకుంది!

జ్ఞాపకాల పూలు విరిసి
తపనల తలపులను
తొణికే వధువులతో నింపుకుంది!

మధుర రాగాల
మలయ పవనాలు
ఎదను పరిమళమై అల్లుకుంది!

జావళి పదములు
చల్లిన రవళులు
వెండి మువ్వలై పరుచుకుంది!

03/13/2019 - 20:15

ఒక్కసారిగా గాల్లో తేలిపోయేంత సంతోషం..
ప్రపంచంలోని ఆనందమంతా ముంగిట్లో వాలినంత ఆనందం..
కానీ..
అంతలోని..
ఎక్కడలేని నిరాశ.. నిస్పృహ..
ఇలా ఎందుకు జరుగుతుంది?
ఆ సమయంలో ఏం చేయాలి?
వివరాల్లోకి వెళితే..

03/13/2019 - 20:12

నేను
కృతిని
ప్రకృతిని
ప్ర‘కృతి’ని

నేను
కుడిఎడమల అర్ధాంగిని
రహస్యకేళి విన్యాసాన్ని
దశమ అవతారగర్భను.

నేను
మానవగర్భను
ఆజన్మ విశ్వగర్భను
నవమాస సృష్టిగరిమను

నేను
సంసార సారధిని
సారధ్య సన్యాసాన్ని
నిశ్శబ్ద సాత్వికాన్ని

03/12/2019 - 18:30

వేసవికాలంలో అనారోగ్య సమస్యలు అంటే.. ఫ్లూ, కళ్ల కలక, మీజిల్స్, దగ్గు, జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహార విషయంలో అనేక జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఈ కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అందువల్ల ఏది పడితే అది తింటే కడుపులో మంట, అజీర్తి సమస్యలు, వేడి చేసి మోషన్స్ వంటివి వేధిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం తినాలో తెలుసుకుందాం..

Pages