S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/11/2016 - 00:19

అనుకున్నది సాధించాలంటే అంగవైకల్యం అడ్డురాదని నిరూపించింది శ్రద్ధా వైష్ణవ్. పుట్టుకతోనే మూగ, చెముడు. అయితే ఆమె ఎప్పుడూ తనకు వున్న వైకల్యం గురించి బాధపడలేదు. తనకు ఇష్టమైన క్రికెట్ ఆడటం ప్రారంభించింది. సైగలనే మాటగా మలచి బౌలర్‌గా రాణిస్తున్నారు. నేడు ఈ 18 ఏళ్ల శ్రద్ధ చత్తీస్‌గఢ్ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలిగా ఎంపిక అయ్యా రు. దేశంలోని దివ్యాంగు (బధిరు)లందరికీ రోల్ మోడల్‌గా నిలిచింది.

11/10/2016 - 01:24

‘పులి’ మన దేశంలో జాతీయ జంతువుగా యింకా రకరకాలుగా పేర్గాంచింది. దాన్ని అంతరించిపోతున్న జాతులలో చాలా ముఖ్యమైనదిగా ప్రకటించారు. నలభై వేల గాండ్రు గాండ్రు పులున్న మన దేశంలోని అడవులలో వాటి సంఖ్య నలభైవేల దాకా వుండేది కాస్తా ఇరవై రెండు వేలకి దిగజారిపోయింది.

11/03/2016 - 22:10

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

11/03/2016 - 22:09

చలికాలం వచ్చిందంటే గుర్తుకువచ్చేవి, వెచ్చదనాన్నిచ్చేవి వింటర్‌వేరే! చలి నుంచి శరీర రక్షణకు నేడు కొత్త వెరైటీస్‌తో వింటర్ కలెక్షన్స్ మార్కెట్లో ప్రవేశిస్తున్నాయి. సీజనల్ ఫ్యాషన్లు అనుసరించడంలో ఎప్పుడూ ముందుండే నేటి తరం వింటర్ డ్రెస్సింగ్‌లోనూ సరికొత్త ఫ్యాషన్లకు తెరలేపింది. ముదురు రంగుల్లో జర్కిన్లు, వెరైటీ డిజైన్లతో కూడిన సరికొత్త వులెన్ దుస్తుల్లో కనువిందు చేస్తున్నారు.

11/03/2016 - 03:01

సెల్ఫీలు తీసుకునే వెర్రి వ్యామోహం అమెరికా అధ్యక్షుడు ఒబామా దగ్గరనుంచి మన ప్రధానమంత్రి మోదీగారి దాకా వ్యాపించి పోయింది. యువతీ యువకులు సెల్ఫీలు తీసుకునే వెర్రి వ్యామోహంలో చాలాసార్లు నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొండ అంచున, లోయ లోపల, పులి బోను లోపల, జలపాతం కింద - యిలా ఒక దగ్గర అని లేదు.

10/29/2016 - 21:42

హిందూమత సంస్కృతికీ, సంప్రదాయానికీ చిహ్నం ‘దీపావళి’ పర్వదినం. తెలుగువారు ఈ పండుగను దివ్వెల పండుగ అని అంటారు. శ్రీరామచంద్రుడు పట్ట్భాషిక్తుడైన రోజు. రాక్షసరాజైన బలి చక్రవర్తిని వామనమూర్తి పాతాళలోకానికి అణచివేసిన దినం. వీణను కూడా పట్టుకోవటం చేతకాని సుకుమారి సత్యభామ విల్లును చేతబట్టి బాణాల వర్షం కురిపించి రాక్షస సైన్యాన్ని తరిమిన శుభదినం.

10/29/2016 - 21:38

అదిగో!.. అంతటా జన సందోహాల నాదమయమైన వెనె్నల వెలుగులు.
కంటికింపైన కెంపుల మెరుపుల జీవస్వరాలు
మనసుతో ఊపిరి పోసుకుని
పదాలకు ప్రాణప్రతిష్ఠ చేసి
వీచే చల్లని గాలుల తాళధ్వనుల మధ్య
నర్తించే మనోజ్ఞ మహోజ్వల తళుకులు
దేదీప్యమానమైన దీపరాశుల కొంగ్రొత్త సొబగులవిగో
నేల నుండి నింగి వరకు..!
బతుకు పయనం ప్రశ్నార్థక అక్షయ తోరణమే కావచ్చుకానీ

10/27/2016 - 22:09

దీపావళి జీవితాల్లో వెలుగులను నింపటమే కాదు ఏమా త్రం అజాగ్రత్తగా ఉంటే అంతేస్థాయిలో విషాదాన్ని నింపేస్తోంది. ముఖ్యంగా బాణసం చా కాల్చేరోజూ పసి బిడ్డలకు, ఇంట్లో పెంపుడు జంతువులకు భయానకమైనదేనని చెప్పవచ్చు. మరి ఆరోజు బోసి నవ్వుల పాపాయిలు కమ్మగా నిద్రపోవాలంటే.. బొచ్చు నేస్తాలు సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

10/27/2016 - 22:04

మనకు నిత్యం లభించే ఉసిరికాయ ఉపయోగం ఏమిటా అని ఆలోచిస్తున్నారా! ఉసిరికాయలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలున్నాయి. ఆయుర్వేదంలో సైతం ఉసిరికి ప్రాముఖ్యతుంది. ఉసిరికాయలో సి విటమిన్, ఐరన్, కాలి షయం పుష్కలం గా వున్నాయి. రక్తా న్ని శుద్ధి చేసే గుణం ఉసిరిలో వున్నది. ఉసిరికాయ తినడంవలన గుండె జబ్బు లు దరిచేరవు. మూత్ర సంబంధమైన వ్యాధులు అదుపులోకి తెచ్చే గుణం ఉసిరిలో వున్నది.

10/27/2016 - 02:45

యుద్ధంచేస్తూ అసువులు బాసిన సైనికునిలాగా- ప్రఖ్యాత నర్తకీమణి శ్రీమతి అశ్వినీ ఎక్బోట్ స్టేజిమీద నాట్యప్రదర్శన యిస్తూనే కుప్పకూలిపోయింది. మొన్న శనివారం (22న) పూణేలోని భరతనాట్య మందిర్ కళావేదిక మీద తన్మయంగా, ప్రేక్షక మనోరంజకంగా నృత్యప్రదర్శన యిస్తున్న అశ్విని చివరి ఘడియల్లో కుప్పకూలిపోయింది. ఈ నర్తకీమణి మరాఠీ బుల్లితెరకీ, రంగస్థల ప్రేక్షకులకు ఎంతో యిష్టమైన నటి. నాట్యసుందరి.

Pages