S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/27/2016 - 02:44

‘‘రసగుల్లాలంటే బెంగాలీ రసగుల్లాలే- నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయ్’’ అంటూ రెడీమేడ్ రసగుల్లా డబ్బాలూ, సీసాలూ కొనుక్కునే తీపి ప్రియులారా! బహుపరాక్! ఈ రసగుల్లాలు దొంగ ‘పాలు’ అంటే కృత్రిమంగా తయారుచేసిన క్షీరములతో నిషేధించిన రసాయనాల సాయంతో చేస్తున్నారుట.

10/27/2016 - 02:42

బెట్టింగులు, పందేలు క్రీడారంగంలో ఎక్కువగానే వుంటాయి గానీ, యిదో తమాషా బెట్.

10/27/2016 - 02:40

‘అయోనిజ- సీత’ - అన్నమాట విన్నాం. ఆధునిక కాలంలో ‘అన్యగర్భజ’లు పుట్టగా చూస్తున్నాం. గానీ అక్షరాలా రెండుసార్లు జన్మించిన పాప- విన్లీ హూప్.
అమెరికా టెక్సాస్‌కి చెందిన ప్లానో అనే నగరానికి చెందిన గర్భవతి- మార్గరెట్ బోలియర్ ఆసుపత్రికి పోయి అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకున్నది.

10/27/2016 - 02:41

మహమ్మద్ నిషామ్ అంటే కేరళలో బీడీలు కాల్చే వాళ్లకే కాదు బీడీల బిజినెస్ చేసే యావత్ ప్రపంచానికీ తెలుసు. కాకపోతే రుూ బీడీల మహారాజు ప్రస్తుతం త్రిశూర్ జైల్లో- జనవరి నెలనుంచీ యావజ్జీవ కారాగారశిక్ష హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడంటే అతిశయోక్తి కాదు.

10/22/2016 - 21:24

ఓసారి ఓ అరవై ఏళ్ల ముసలతను తన పైదవడ బాగా నొప్పిగా వుందన్న బాధతో వచ్చారు. చూస్తే తనకి ఉన్నవి పైన కింద కట్టుడు పళ్లు, తీసి పెట్టుకునే రకం. ‘‘మీపై, కింద పళ్ల సెట్టు బయటికి తీయమని’’ నేనడిగిన ప్రశ్నకి తను పెట్టించుకున్న గత ఆరు సంవత్సరాలలో ఎప్పుడు వాటిని బయటకు తియ్యలేదని, రాత్రిళ్లు కూడా అవి పెట్టుకునే పడుకుంటానని ఇచ్చిన సమాధానానికి నేను ఖంగుతిన్నాను.

10/20/2016 - 21:57

పెళ్లయ్యాక శిల్పాశెట్టి వెండితెరకు దూరమైంది. విభిన్న కోణాల్లో కనిపించే ఈ బాలీవుడ్ భామ ఎంచుకున్న రంగంలో తనదైన ముద్ర వేసుకుంటుంది. ఆమెలో నటి, రచయిత్రి, రియాల్టీ షో న్యాయ నిర్ణేత, వ్యాపారవేత్త, యోగాబ్యాసకురాలు, ఇంటిని చక్కదిద్దుకునే గృహిణి..ఇలా విభిన్న కోణాలు దాగి ఉన్నాయి. ఓ బిడ్డకు తల్లయినా..

10/20/2016 - 21:53

వెలుగుల పండుగు దీపావళి దగ్గరకు వచ్చేస్తుంది. ఇంటిని అందంగా ముస్తాబు చేయటానికీ, వెరైటీ కొవ్వొత్తి దివ్వెలతో గదులను వెలుగులతో నింపేసేందుకు ప్రతి గృహిణీ ఆరాటపడుతోంది. మార్కెట్లో వచ్చే వెరైటీ ప్రమిదల కోసం అనే్వషణ ఆరంభించటం పరిపాటి. చిన్ని చిన్ని విద్యుత్తు దీపాలతో పాటు చిరు వెలుగులనిచ్చే క్యాడిల్ ప్రమిదలను ఏర్పాటుచేసుకుంటే ఇల్లు శోభాయమానంగా వెలుగొందుతుంది.

10/19/2016 - 22:14

సాధారణంగా తొమ్మిదో తరగతి పరీక్షాపత్రాలలో సిలబస్సుకి, తాజా అవార్డులు, రివార్డులకీ సంబంధించిన ప్రశ్నలుంటాయి గానీ, మహారాష్టల్రోని భివాండీలోని ఒక హైస్కూలు పేరు- చాచానెహ్రూ హిందీ హైస్కూలు- మల్టిపుల్ ఛాయిస్ విభాగంలో పేపర్‌లో భలే ప్రశ్న వచ్చింది-

10/19/2016 - 22:12

మొత్తం మీద తన కెరీర్‌లో 34,347 అంతర్ జాతీయ స్థాయి క్రికెట్ పరుగులు సాధించిన భారతరత్న సచిన్ టెండూల్కర్- మొత్తం 664 మ్యాచ్‌లు ఆడాడు. అతను వికెట్‌ల మధ్య మెరుపువేగంతో పరిగెత్తడం యింకా చాలామందికి గుర్తు వుండే వుంటుంది!

10/19/2016 - 22:10

మధ్యప్రదేశ్‌లో భోపాల్‌కి దగ్గరగా వున్న హోషింగాబాద్‌లో ‘‘పాములవాడు’’ అంటే చాలు సలేమ్‌ఖాన్ భాయి దగ్గరకి దిగబెడతారు. అతను 30 సంవత్సరాలుగా జనవాసరాల నుంచి- ముఖ్యమంత్రి మొదలు సాధారణ వ్యక్తిదాకా అందరి యిళ్లల్లోనూ పాములను పట్టి సంచీలో వేసుకున్న రికార్డు వుంది. ఈపాటికే అతను రెండు లక్షల యిరవై వేలకి పైగా పాములను- ఎలుక పాముల నుంచీ కాలత్రాచుల దాకా పట్టి సంచీలో వేసుకున్నాడు.

Pages