S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/10/2016 - 21:55

దూకుడు సినిమాలో ‘‘నిన్ను హీరో అంటే ఎట్లా నమ్మేవురా, కళ్లకింద అంతంత క్యారీబాగ్‌లు వేసుకొని’’ అన్న బ్రహ్మానందం డైలాగ్‌కి అమాయకంగా యం.ఎస్.నారాయణ ‘‘గ్రాఫిక్స్‌లో తీసేస్తారనుకున్నా’’ అంటాడు. ఆ డైలాగ్స్‌కి జనాలు సినిమా హాలులో పగలబడి నవ్వారు. గ్రాఫిక్స్‌లో తీయచ్చో లేదో తెలీదు కాని ఆపరేషన్ ద్వారా ఈ కంటి కింద క్యారీ బాగ్స్‌ని తప్పక నిర్మూలించగలం.

09/07/2016 - 21:16

టీచర్స్‌డే- డా సర్వేపల్లి రాధాకృష్ణగారి జన్మదినం. వూరూరా స్కూలు స్కూలునా పిల్లకాయల చందాలతో ఘనంగా జరుగుతున్నది ఏటేటా. సందర్భం వచ్చింది. కర్నాటకలోని ఓ గ్రామం జరిగిన అధ్యాపక దినోత్సవాలు- వార్తల్ని ఉత్తేజపరిచాయి.

09/07/2016 - 21:14

సాధారణంగా బిక్కీ బీదాకి రేషన్ కార్డులుంటాయ్. ఏ కార్డుకైనా ఎన్నో ఉపయోగాలుంటాయ్. కానీ, విశ్వవిఖ్యాత సినిమా నటీమణులు- దీపికా పదుకొనె, సోనాక్షీసిన్హా, రాణీముఖర్జీ, జాక్విలిన్ ఫెర్నాండెజ్ లాంటి సంపన్న తారలకి- చౌకధరల దుకాణాల మీద రేషన్ తెచ్చుకుంటున్న కార్డులున్నాయి.

09/07/2016 - 21:12

హైదరాబాదు రోడ్డు బాధలు ఢిల్లీకి, ఢిల్లీ బాధలు హైదరాబాద్‌కీ చెప్పుకొని, మొర్రోమని విలపించనక్కరలేదు. మధ్యప్రదేశ్‌లో రోడ్లు ఎంత అధ్వాన్న స్థితిలో వున్నారుూ అంటే, అక్కడ ‘ఆప్ పార్టీ’ సమన్వయకర్తగావున్న అగ్రవాల్ రోడ్డుకి అడ్డంగా పడి ఆందోళన ప్రారంభించాడు.

09/03/2016 - 21:33

మూషికమెక్కి మహిలో యింటింటికి వెళ్లి
ప్రమోదాన్ని యివ్వాలని వస్తున్నావా
మోదకప్రియా, ఓ బొజ్జ గణపయ్యా

వెండి, బంగారు గణపతులు కొందరు
కృత్రిమ రంగులొద్దు, నకిలీలు వద్దు
పుడమి తల్లి యిచ్చిన మట్టితో చేసిన కమనీయ విగ్రహం నీది

08/31/2016 - 23:11

‘‘ఎవడు బ్రతికాడు మూడు యాభైలు- అంటే నూట యాభై సంవత్సరాలు?’’ అన్నాడు శ్రీశ్రీ. కానీ ప్రపంచంలో యిప్పుడు ముగ్గురున్నారు. అందులో యిద్దరు ‘‘మూడు యాభైలు బ్రతికేశాం- యింకా బ్రతికే వున్నాం’’ అంటున్నారు. మూడోవాడు ఇండోనేషియాకి చెందిన ‘ఎమ్‌బాహ్‌గోధో’ నూట నలభై ఐదేళ్ళవాడు. మరో ఐదేళ్లు లాగించేలాగే వున్నాడు.

08/31/2016 - 23:10

అవునండీ బాబూ! అతను వర్కర్ అండీ బాబూ! ఇంటినుంచి కారులో వెళ్తే 17 నిమిషాలు పడుతోంది. పైగా ట్రాఫిక్ జామ్స్‌లో యిరుక్కుంటే అంతే సంగతులు.
ఐతే జెకొస్లోవేకియాకు చెందిన టెక్నీషియన్ ఫ్రాంటీ సేక్ హద్రావా తన ఆఫీసుకి మరో ఏడు నిమిషాలు ముందే వెళ్లాలనుకున్నాడు. నేలమీదా, రైలుమీదా అయితే ట్రాఫిక్ జంఝాటం. గాలిలోనైతే?

08/31/2016 - 23:08

‘రాజు తల్చుకుంటే దెబ్బలకి కొదువా?’ అంటారు. రాజస్థాన్ సంస్థానాధీశులలో ఒకడయిన ఆల్వార్ మహారాజు జైసింగ్‌కి లండన్‌లో 1920లో ఒక తీరని అవమానం సంభవించింది. రాజుగారు సీదా సాదా దుస్తులలో, లండన్ వీధులలో తిరుగాడుతూ రోల్స్‌రాయ్స్ మోటారు శకటాల షోరూమ్ ముందు ఆగి లోపలికి తొంగిచూశాడు. రేటు వగైరా కనుక్కుందాం అన్నట్లు లోపలికి నడిచి- ‘‘అబ్బాయ్! ఈ కారు వెల ఎంతుంటుందీ?’’ అని అడిగాడు.

08/27/2016 - 22:02

అమెరికాలో ఓ ఫిల్లవాడు తన స్కూల్ ఫంక్షన్‌కి భారతదేశం నించి వచ్చిన తన తాతనీ, నానమ్మనీ తీసుకురావద్దని వాళ్ల అమ్మ నాన్నకి చెప్పాడు. ‘‘ఎందుకని?’’ అడిగిన ఆ తల్లిదండ్రులకి ఆ పిల్లవాడు ఇలా జవాబిచ్చాడు. ‘‘తాత, నానమ్మ మొహం నిండా ముడతలున్నాయి. స్కూల్‌లో నా స్నేహితులు వాళ్లని చూస్తే రేపొద్దున నాక్కూడా అలా ముడతలొస్తాయని ఏడిపిస్తారు, అందుకే వద్దు’’. అది విన్న ఆ ముసలి వారు చాలా బాధపడ్డారు.

08/25/2016 - 21:47

‘‘నువ్వు బడికెళితే..పిల్లల్ని ఎవరు చూస్తారు? హైదరాబాద్ నగరంలో తొమ్మిదేళ్ల అస్మా అనే చిన్నారికి ఎదురైన ప్రశ్న. తొమ్మిదేళ్ల ప్రాయంలో ఏ చిన్నారైనా ఆడుతూ..పాడుతూ గెంతులేస్తూ స్కూలుకు వెళుతుంది. కాని అస్మాకు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అమ్మానాన్న రోజూ కూలీకి వెళతారు. ఇంట్లో ఆమెకన్నా చిన్నవారైన ముగ్గురు తోబుట్టువుల ఆలనాపాలనా ఈ తొమ్మిదేళ్ల అస్మా చూసుకోవాలి.

Pages