S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/29/2019 - 19:01

పిల్లలను పెంచడం ఒక కళ. అది అంత ఆషామాషీ విషయం కాదు. తల్లిదండ్రులు కోపాన్ని, ఒత్తిడిని అదుపుచేసుకుని కాస్త సంయమనంతో చిన్ని చిన్ని చిట్కాలను పాటించి ఆ చిన్ని మనసులను గెలుచుకోవచ్చు. మరి అవేంటో చూద్దామా..
* పిల్లలకు ఏదైనా పోటీల్లో నెగ్గినా, ర్యాంకు వచ్చినా వారిని అభినందించండి.

01/27/2019 - 22:51

గర్భం ధరించినప్పుడు బరువు పెరగడం, రంగు మారడం వల్ల గీతలు పడతాయి. వాటినే స్ట్రెచ్‌మార్క్స్ అంటారు. ఈ సమయంలో ఉన్నట్టుండి బరువు పెరగడం వల్ల చర్మం అడుగున ఉన్న ఫైబర్ విరిగి స్ట్రెచ్‌మార్క్స్ వస్తాయి.

01/27/2019 - 22:45

పరమాణువంత
పనితనం లేకున్నా
పలకరింపుకో బదులు
పలికేవారు కరువైనా
తెడ్డున్నా చెయ్యి
కాల్చుకునే తీరు తప్పకున్నా

అవని తనదే
ఆకాశం తనదే
ఆ మాటకొస్తే
నింగీ నేలా
లోకమంతా
తనదనుకోవడం
పరిమితులెరుగని దురాశ
పరమానందాన్ని
దరిచేరనివ్వని దురాశ

01/25/2019 - 20:07

బానిసత్వం నుంచి భవిష్యత్తుకై అడుగేసిన రోజిది
వందల సంవత్సరాల వెట్టికి
చరమగీతం పాడి
స్వపరిపాలన దిశగా
రాజ్యాంగాన్ని రాసిన సుదినం
స్వాతంత్య్ర భావనను ప్రతీ
పౌరుడు మోస్తూ గణతంత్రదేశంలో
నిలువెత్తు అభివృద్ధికి సాక్షి
డెబ్భై ఏళ్లకాలంలో
నా దేశం నడుస్తూ, పరిగెడుతూ
విపంచిలో విలువని పెంచిన
అద్భుతమైన రోజు
బడుగు బలహీన వర్గాల ఆశలకి

01/25/2019 - 20:06

సీ॥ అభ్రచుంబితమైన ఆ హిమశృంగమే
అలరు దివ్య మహనీయమకుటంబు
శోభామయమ్ములౌసుశ్యామ సీయలే
అంచితరమ్య భవ్యాంబరములు
శిబ్యాదిరాట్టుల చిరమైన త్యాగమే
రాజిత రమణీయ రత్నభూష
సంద్రంపు కెరటాల చక్కనౌ నురగలే
ధగధగ ద్ధగిత ముత్యాల సరులు
తే.గీ॥ పండిత కవిప్రకాండుల ప్రాభవంబె
విమల నవమందహాసమై వెలయునట్టి
భరతమాతకు జనియించు భాగ్యగరిమ

01/24/2019 - 19:28

పల్లవి: రసధునిలా ప్రవహించిన
రాగోజ్జ్వలహృదయా!
సరిగమలను శ్వాసించిన
సంగీత మహోదయా!
త్యాగయ్యా! ఇదిగో నీ
నీ కీర్తికి మా కీర్తనా..
అందుకోవయ్యా!
ఇది మా గీతార్చనా..

చరణం:

01/23/2019 - 18:50

కొంతమంది అదేపనిగా గోళ్లకు రంగు వేస్తుంటారు. అది చెరిగిపోయేంత వరకు కూడా ఉండకుండా వెంటనే నెయిల్ పాలిష్ రిమూవర్‌తో తుడిచేసి వెంటనే మరో రంగును వేసేస్తారు. ముఖ్యంగా కాలేజీకి వెళ్లే అమ్మాయిలు ఇలా ఎక్కువగా చేస్తుంటారు. ఫ్యాషన్లనీ, వేసుకునే దుస్తులకు మ్యాచింగ్ అనీ, పార్టీలనీ.. ఇలా ఎప్పుడూ గోళ్లకు రంగు ఉండాల్సిందే.. ఇలా తరచూ చేయడం వల్ల గోళ్ల రంగు మారిపోతుంది.

01/22/2019 - 18:22

మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేయాల్సిన వయస్సులో సెలబ్రెటీగా మారిపోయారు ఫిన్లాండ్‌కు చెందిన 65 సంవత్సరాల లీనా సల్మీ.. స్కేట్‌బోర్డ్‌తో అవలీలగా ఫీట్లు చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. కేవలం తను చేయడమే కాకుండా, స్కేట్ బోర్డ్ నేర్చుకోవాలనుకునేవారికి 65 సంవత్సరాల వయస్సులో ఇన్‌స్ట్రక్టర్‌గా మారిపోయారు. నాలుగు సంవత్సరాల కిందట కాలక్షేపం కోసం ఆమె స్కేటింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది.

01/20/2019 - 22:42

సర్పంచ్ పదవికి పోటీపడుతున్న 90 ఏళ్ల మహిళ

01/18/2019 - 18:32

జాతీయతా భావాన్ని రగిలించి జనహృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ అంటే ఆమెకు ఎనలేని గౌరవం.. పరిపాలనాదక్షుడిగానే గాక ప్రజానేతగా కీర్తిశిఖరాలను అందుకున్న శివాజీ ఆలోచనలు, ఆకాంక్షలు ఇప్పటి తరానికి తెలియజేయాలన్నదే ఆమె తపన.. తరాలు గడచినా ఎప్పటికీ స్ఫూర్తిదాతగా నిలిచే ‘్ఛత్రపతి’కి వినూత్న రీతిలో నివాళి అర్పించాలని ఆమె సంకల్పించింది..

Pages