S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/12/2016 - 22:07

నల్గొండ జిల్లా మఠంపల్లి ఘాట్‌వద్ద
నడవలేకపోతున్న ఓ మహిళను
వలంటీర్లు ఇలా తీసుకువచ్చారు.

08/12/2016 - 22:05

నాగార్జునసాగర్‌లోని శివాలయం ఘాట్‌వద్ద పురోహితులు ఎండలోనే ఉండాల్సి వచ్చింది. మంచినీటి సౌకర్యమూ లేదు. పదేపదే ఘాట్‌లనుంచి తరలించారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా చేశారు.

08/11/2016 - 23:48

విజయవాడ: పుష్కరాలకు వచ్చే భక్తులకు అక్షయపాత్ర అండగా నిలుస్తోంది. రోజూ మూడు లక్షల మందికి పసందైన భోజనం అందేలా ఏర్పాట్లు చేసింది. భారీ కిచెన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం అవసరమైన స్థలాన్ని ఇచ్చింది. భక్తులకు ఆహారాన్ని అందించేందుకు అక్షయ ఫౌండేషన్ హరేకృష్ణ మోటివేషన్ ఫౌండేషన్‌తో కలిసి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కర్నూలు, మిర్యాలగూడ, గొల్లపూడిల్లో తాత్కాలిక వంటశాలలను ఏర్పాటు చేసింది.

08/11/2016 - 22:22

నాగార్జునసాగర్ డ్యామ్ సహా రెండు జిల్లాల్లోని అన్ని ఘాట్‌లవద్ద ప్రత్యేక భద్రతాచర్యలు తీసుకున్నారు. సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. పోలీస్, ఇతర అధికారులు, సిబ్బంది దాదాపు 15,3535 మంది పుష్కర విధుల్లో పాల్గొంటున్నారు. మరో 2వేల మంది ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి వాలంటీర్లు భక్తులకు సేవలందించనున్నారు.

08/11/2016 - 22:27

తెలంగాణలో పుష్కరాలను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించే గుందిమళ్ల ఘాట్ జలకళతో ఆకట్టుకుంటోంది. ఇక్కడి ఘాట్‌లో విశాలమైన 9మెట్లు ఏర్పాటు చేశారు. వాటిలో 8 ఘాట్లపై రెండడుగుల మేర జలాలు చేరాయి. శుక్రవారం ఉదయానికి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సోమశిల ప్రాజెక్టులో 70 అడుగుల మేర శ్రీశైలం జలాలు చేరుకున్నాయి. అక్కడి సంగమ ప్రాంతమూ పుష్కల జలాలలో కళకళలాడుతోంది.

08/11/2016 - 22:07

కనువిందు కెరటాల మునుముందు కురికే
అందాల కృష్ణమ్మ ఎందాక పయనం?

నీ సార తీరాల భూగర్భఖనులుగా
ఏ శిల్ప ఖండాలు గొప్పవై కప్పబడి
ఎక్కడైనా వున్న చక్కగా చెప్పవే
ఎప్పటెప్పటి చరిత కవితగా పాడవే కనువిందు

ఏ గంధ వృక్షాల సౌగంధికములందు
ఏ అడవి పుడమిని ఎంతగా తిరిగావొ

08/11/2016 - 22:05

భగవంతుడి అవతారమైన దత్తాత్రేయుడు కృష్ణానదిలో అంతర్లీనంగా ఉన్నారని భగవాన్ విశ్వయోగి విశ్వంజీ పేర్కొన్నారు. శుక్రవారం నుండి ప్రారంభమయ్యే కృష్ణాపుష్కరాల సందర్భంగా ఆంధ్రభూమి ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ, కృష్ణానది జన్మస్థలమైన సహ్యాద్రి దత్తాత్రేయుడి స్థిరనివాసమని గుర్తు చేశారు.

08/11/2016 - 04:32

ఫ్రాన్స్‌లోని నార్మండీ ప్రాం తంలోని రివాన్ నగరంలో వున్న అతి పెద్ద బార్ ‘లీబర్‌క్యూబా’ బార్ రూం, దానితోపాటు అది వున్న బేస్‌మెంట్- క్షణాల్లో తగలడిపోయి పదమూ డు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయి- శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి.
చాలామందికి గా యాలయినాయని గవర్నమెంటు ప్రకటన వివరించింది.

08/11/2016 - 04:31

సినిమా లెజెండ్ మారిలిన్ మన్రో గతించి 54 సంవత్సరాలు అయింది. (ఆగస్టు 5)

08/11/2016 - 04:30

ఓ కుర్రకుంక విలాసంగా ఎగరేసిన ‘సిగరెట్ పీక’ పూరి గుడిసెల్ని కాల్చేయడం మనం చూశాం చాలా సార్లు. కానీ, జర్మనీకి చెందిన ఒక పెద్దమనిషి స్పెయిన్‌లో వున్న క్యానరీ దీవులలో వున్న లాసాల్మా ప్రాంతంలోకి పోయి, ‘‘ఇది పాడయిపోయిందనీ, దాన్ని ఏం చెయ్యాలీ అనుకుంటూ తన ‘టాయిలెట్ పేపర్స్’ని అడవి అంచున తగలెట్టాడు. అవి భగ్గున మండి మొత్తం అడవిలోనే దావానలం సృష్టించాయి.

Pages