S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/13/2016 - 00:22

‘ఈ పురస్కారం నాకు ఎంతో సంతోషాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తోంది.’’దక్షిణాది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ట్విట్టర్‌లో వ్యక్తంచేసిన మాటలు. మంగళవారంనాడు ప్రతిష్టాత్మక పురస్కారం ‘పద్మశ్రీ’ని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో స్పందిస్తూ...ప్రజలు నా కష్టాన్ని గుర్తిచినందుకు కృతజ్ఞతలు అని పేర్కొంది.

04/10/2016 - 01:09

పిల్లలమీద తల్లిదండ్రులకి ఎంత ప్రేమ వుంటుందో నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పెళ్లి కావాల్సిన తన కొడుకు నుదుటిమీద ఎత్తుగా, పెద్దగా అందవికారంగా ఉన్న గడ్డను చూసి తల్లిదండ్రులు బాధపడటం సహజం. పెళ్లిచూపులకోసం విదేశాల నుంచి వచ్చిన కొడుకు నుదుటి మీద ఉన్న గడ్డను చూసి ముందు పెళ్లిచూపుల కంటే డాక్టర్ వద్దకు వెళ్లటం మేలని భావించి తండ్రీ కొడుకులు వచ్చారు. ‘‘అసలు ఈ గడ్డ ఏంటి డాక్టర్?’’ అని అడిగాడు.

04/07/2016 - 22:12

అదుగదుగో వస్తున్నది నవ దుర్ముఖి ఉగాది
ఇది మానవ జన మేధోమథనానికి పునాది
దుర్ముఖియను పేరేమిటి? మర్మమేమిటో వినండి!
దుర్మద దేశద్రోహుల దృష్టి దహించుటకెనండి!
ధనస్వాముల, దళార్ల చీకటి ముసుగులు
జనసేవా పరాయణోజ్వల దృష్టుల భస్మమగును
తరతరాల ఒక కుటుంబ దర్పపు పాలన అది యొక
దురాచారమే! నేటికి తొలగినదది శుభసూచన
భారత సంస్కృతిదెలిసిన వారె పాలకులు గావలె!

04/07/2016 - 22:07

శ్రీ శుభములిచ్చి తెలుగిళ్ళ సిరులవిచ్చి
చైత్రమాసపు పరువాలు ధాత్రికిచ్చి
పచ్చని బతుకుల్ అందర్కి పంచి యిచ్చి
తెలుగు యిండ్లకు రావమ్మ వెలుగులిచ్చి

శిశిర రుతువు రాల్చినవన్ని చెట్లకిచ్చి
మనుషులందరికి మమత మంచి యిచ్చి
రమ్యమై నవరాగ సరాగ బాల
ద్రావిడాడపడుచువమ్మ నీవు రమ్ము

04/07/2016 - 22:05

స్వాగత గీతాల్ని వినిపించకుండానే
తెలుగువారి ముంగిట్లో
వచ్చి వాలిన వసంతం
అవును మరి- అది మన అందరి- సొంతం!
తొందరపడిన కోయిల-
ముందుగా కూసిందో-
సందడి చేసే సుమ సౌరభాలు
వడి వడిగా గుబాళించాయో

04/07/2016 - 22:03

తరు తరుణుల పీతాంబర ప్రభలు
కొమ్మల రెమ్మల కోలాటములు
మందారము, సిరిమల్లె నవ్వులు
వసంత సుందరి వయ్యారములు
తెలుగు తేజమును రంగరించుకుని
ఉగాది వెలుగులు విరజిమ్మింది.

మత్తకోయిలల మధుర స్వరాలు
శాతవాహన యశోగీతములు
భ్రమరాదుల ఝుంకారధ్వనికి
పక్షుల కిల కిల తాళమేయగా
తెలుగు జాతి తేజోవిలాసమున
నూతన సంవత్సరమొచ్చింది

04/07/2016 - 07:02

మరీ అంత భీషణ క్రౌర్యమా?

04/05/2016 - 22:25

స్పర్ష్ షా సంచలన రికార్డుస్పర్ష్ షా సంచలన రికార్డు12ఏళ్ల స్పర్ష్ షా గురించి తెలియనివారు ఉండరు. పాటలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్పర్ష్ షా తాజాగా ‘్భయం లేదు’ అనే పాటకు సైతం 12 మిలియన్ల మంది ఆకర్షితులయ్యారు. యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ పాట అందరి నాలుకలపై నాట్యం చేస్తోంది.దాదాపు 12 మిలియన్ల మంది ఈ పాట విన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

04/02/2016 - 19:03

పాకిస్తాన్‌లోని బహిరంగ ప్రదేశాలన్నీ పురుషులే ఆక్రమించేశారు. టీ బంకలు, డాబాలు ఒకటేమిటి అన్నీ వారి సొంతం అన్నట్లు స్వేచ్ఛగా వచ్చి తింటారు. తాగుతారు. మహిళలు ఇలాంటి ప్రదేశాలకు రావటం జరగదు. అలా చేస్తే సామాజిక సాంప్రదాయాలకు విరుద్ధం. అసలు రోడ్డు వెంట చాలా దూరం నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లటానికే భయపడతారు. ఇలాంటి సామాజిక సంకేళ్లను తెంచుకుని ఇపుడిపుడే మహిళలు అడుగు ముందుకు వేస్తున్నారు.

03/31/2016 - 23:22

కింక్రీదేవి.. ఈ పేరు. పలకడానికి కొంచెం కష్టంగా, క్లిష్టంగా ఉండవచ్చు. ఎందరికో స్ఫూర్తినిచ్చిన పేరు. పేరులాగే ఆమె కూడా కఠినమైన పోరాటాల బాటలో నడిచి విజయం సాధించిన నిరుపేద, నిరక్షరాస్య మహిళ.

Pages