S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/28/2016 - 22:04

సర్వసాధారణంగా పంక్షన్స్‌కి వెళ్తుంటే సిల్కు చీరలలో, రుమాళ్లలో ఏదో సెంటో, అత్తరో జల్లితే కమ్మగా సువాసనలు వెదజల్లుతాయి. వాటిలో మల్లె, రోజా, సంపెంగ, చామంతి రకాల సెంట్లు వుంటాయి. అవి ఫారిన్, ఇండియన్‌వి వుంటాయి. అవి ఖర్చుతో పని. మగాళ్ళు ఒప్పుకోరు. అందుకని సువాసనకు, సౌందర్యాన్ని పెంచడానికి గంథం వాడుకుంటే ఉభయతారకంగా వుంటుంది.

07/27/2016 - 21:37

హరిత హారం పేరిట- గ్రామ గ్రామాలా, వాడవాడలా మొక్కలు నాటే ఉద్యమం ఒకటి తెలంగాణలో జోరుగా సాగుతున్నది. కానీ, హరితహారం విషయంలో- గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ను ఉత్తర ప్రదేశ్ కొట్టేసింది. ఈమధ్యనే ఉత్తరప్రదేశ్ ఇరవై నాలుగు గంటల కాలంలో 4 కోట్ల 93 లక్షల మొక్కల్ని నాటి ఇంతవరకూ పాకిస్తాన్ పేరిట వున్న రికార్డును బ్రద్దలు కొట్టింది.

07/24/2016 - 06:06

వయసు ఒక అంకె మాత్రమే, అందానికి ఇంకా ఆనందానికి ఎప్పుడూ అది ఆనకట్ట కాదు అని మనకి నిరూపిస్తున్నాడు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఇప్పటిదాకా అందాన్ని పెంచడానికి ఓ వైద్యుడిగా ఏమి చేయగలనో చెప్పాను. ఈసారి ఏమి చెయ్యలేమో చెప్తాను.

,
07/21/2016 - 23:38

ఆషాఢమాసం రాగానే జ్ఞాపకం వచ్చేది గోరింటాకు. సంస్కృతంలో గోరింటాకును నఖరంజని అంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి, దాంతోపాటు రోగ నిరోధక శక్తి కూడా వుంది కాబట్టి ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం శ్రేష్టమని మన పెద్దలు చెప్పారు. అదే సంప్రదాయంగా వస్తోంది. సంప్రదాయం సంగతి అలా ఉంచితే గోరింటాకు వలన ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.
ఆరోగ్యానికి గోరింట

,
07/21/2016 - 23:34

పెళ్లయనా.. వేడుకైనా.. కాలేజీ ఫంక్షన్ అయనా.. ఎప్పుడూ వేసుకునే చుడీదార్లే వేసుకోవాలా...కొత్తవాటిని వేసుకుంటే నలుగురిలో ఆకర్షణీయంగా కనిపిస్తామనే ఆకాంక్ష ప్రతి యువతిలోనూ ఉంటుంది. ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పటి నుంచో ఆదరణ ఉన్న లెహంగా చీరలు, చోలీలు ఇటీవల కాలంలో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హీరోయిన్లందరూ వీటికి ఫిదా అవుతున్నారు.

07/20/2016 - 22:44

‘పంది బురద మెచ్చుగానీ పన్నీరు మెచ్చునా?’ అన్నాడు మహాకవి వేమనగారు. కానీ అక్కడ ఆ సంద్ర తీర నగరంలో అంతా అధునాతన జనాలే. బురద కోసం వెంపర్లాడుతూ వచ్చి నడుం లోతు బురద మడుగులో దొర్లుతారు, పొర్లుతారు, కేరింతలతో, ఆటా, పాట కలిపి, బురద సంబరాలు- ఒకటి కాదు, రెండు కాదు పది రోజులు సాగిస్తారు. దక్షిణ కొరియాలోని బొరియాగ్ నగరంలో రుూ ‘‘బురద హోలీ’’ జూలై 15 నుంచీ కడు రంజుగా సాగుతున్నాయి. ఇది 18వ బురద సంబరం.

07/20/2016 - 22:41

బంగారం, గంజాయి లాంటివి దొంగతనంగా తెచ్చే ప్యాసింజర్లని చూశాం గానీ, కుక్కల్ని సూట్‌కేసుల్లో క్రుక్కి, రహస్యంగా తమ కూడా విమానాల్లో తెచ్చుకుంటున్న యజమానులు- రుూమధ్య మూడుసార్లు దొరికారు.

07/20/2016 - 22:39

జార్ఖండ్ రాష్ట్రం కొండ జాతులలో యిప్పటికి అమాయక ఆదివాసుల తండాలున్నాయి. ‘బిహోర్’ కొండ జాతికి చెందిన అమోదేవి అనే ముగ్గురు పిల్లల తల్లికి నాలుగో కాన్పులో పండంటి బిడ్డను కన్నదిగానీ, మూడో రోజునే ఆ పసికందుని రెండు వేల రూపాయలకు అమ్మేసుకుంది. ఛాత్రా జిల్లాకి చెందిన ఒక వ్యపారి బిడ్డని కొనుక్కొని పోయాడు.

07/20/2016 - 22:37

సెల్ఫీల పిచ్చి నిత్యమూ- ఎక్కడో అక్కడ యువతీ యువకులకి ప్రాణహాని కలిగిస్తూనే వుంది. అలాగే రుూ కాలం సంకర జాతి కుక్కల కాలం అవడంతో కొన్ని కుక్కలు ‘విశ్వాసం’ అన్న గుణానే్న మరచిపోయాయి. యజమానులనే మట్టువెట్టేస్తున్నాయి. ఇంచుమించు ప్రతిరోజూ రుూమధ్య కుక్కలు పిల్లల్ని కొరుక్కుతినడం వార్తలు వెలువడుతూనే వున్నాయి.

07/19/2016 - 20:52

అరుణిమ సిన్హా మరో విజయశిఖరాన్ని అధిరోహించింది. శరీరం గడ్డకట్టుకుపోయే చలిలో ఆమె సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది. కొండంత బలంతో ఎవరెస్ట్‌ను అధిరోహించి ‘‘ ప్రపంచంలో ఎవరెస్ట్ అధిరోహించిన తొలి వికలాంగ మహిళ’ రికార్డును సొంతం చేసుకున్న ఆమె ఇపుడు ఇండోనేషియాలో అతి ఎత్తయిన పర్వత శిఖరమైన కర్టెన్జ్ పిరమిడ్‌పై మరో కీర్తిపతాక ఎగురవేసింది. ఆ చల్లటి పర్వతం ‘అరుణిమ’దాల్చింది.

Pages