S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/08/2019 - 23:11

పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తున్నపుడు బూచోడు వస్తాడు.. నిన్ను ఎత్తుకెళతాడు అంటూ చీకటిని చూపించి పిల్లలను భయపెట్టడం అందరి ఇంట్లో ఎవ్వరైనా సాధారణంగా చేసేదే. పిల్లలు సాధారణంగా చీకటికి భయపడుతుంటారు. మరికొందరు అపరిచితులు, నీళ్లూ, బొమ్మలు, ఎతె్తైన ప్రదేశాలు, బల్లులు, బొద్దింకలు, కుక్కలకు భయపడుతుంటారు. అలానే ఒంటరిగా ఉండటానికి, నలుగురిలో కలవడానికీ, ఒకవేళ కలిసినా మాట్లాడటానికి కంగారు పడుతుంటారు.

09/06/2019 - 18:41

డబ్బును ప్రేమించు కానీ డబ్బుకు దాసోహం కావద్దు. గెలుపుకోసం ప్రయత్నించడంలో తప్పులేదు కానీ దానికోసం అడ్డదారులు తొక్కకు. దానం చెయ్యి కానీ అతిదానం నీ ఆస్తులను హారతి కర్పూరంలో కడిగేటట్లు చేస్తుంది. పొదుపు చెయ్యి కానీ అతిగా పొదుపు నీ వ్యక్తిత్వాన్ని దిగజారుస్తుంది. ఇతరులను నమ్ము కానీ అతిగా నమ్మితే నీ కొంప కొల్లేరు అవుతుంది అని గుర్తుపెట్టుకో..

09/04/2019 - 18:59

మానవ జీవితంలో గురుశిష్యుల బంధం చాలా పవిత్రమైనదే కాక విలువైనది. విద్య, వివేకం నేర్పుతూ సకల విషయాలపట్ల అవగాహన కలిగేలా జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, చైతన్యపరిచేవాడే గురువు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతులు వెలిగించేవాడు సద్గురువు.

09/04/2019 - 18:57

గురువర్యా!
బోధి చెట్టులాంటి మీ నీడనే కదా!
జీవిత పాఠాలు నేర్చుకున్నది
మీరు వెలిగించిన అక్షరజ్యోతులే కదా!
బతుకుదారులు చూపిస్తున్నవి
ఉన్నత విలువలు పెంచ
ఎంత ‘తపస్సు’ చేశారో...
ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ద
ఎంతగా ‘మేధోమథనం’ గావించారో...
ఎంత జ్ఞానామృతాన్ని ఆర్తిగా
మస్తిష్కంలో నిక్షిప్తం చేశారో...
ఎన్ని జీవన సుద్దులు

,
09/03/2019 - 18:50

దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేది అక్షరసత్యం. ఆరోగ్యవంతమైన ప్రజలు ఉన్నపుడే ఆరోగ్యవంతమైన సమాజం, రాష్ట్రం, దేశం ఉంటుంది. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే ప్రధాన పాత్ర పోషిస్తోంది. పోషకాహారం, ఆహారం ఈ రెండూ కవల పిల్లల వంటివి. శరీరం విధులు నిర్వహించేందుకు కావాల్సిన శక్తిని అందిస్తూ ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి, రోగాలతో పోరాడటానికి అవసరమైన శక్తిని అందించేదే నిజమైన పోషకాహారం.

09/01/2019 - 22:52

‘నా పూజలో ముఖ్యమైనవి గడ్డి(గరిక) పోచలే. ఇవి లేని పూజవల్ల ప్రయోజనం ఉండదు అందువల్ల ఒకటి-లేదా ఇరవైఒక్క గడ్డిపోచలతో పూజ చేస్తే నేను సంతుష్టుణ్ణవుతాను. దీని ఫలితం నూరు యజ్ఞానవల్ల గానీ, ఉగ్రతపోనిష్ఠవల్ల గానీ సంపాదించే పుణ్యంకన్నా ఎన్నోరెట్లు అధికం’అని వినాయకుడే సూచించినట్టు గణేశ పురాణం చెబుతోంది.ఇలా గణేశుడే చెప్పడానికి కారణం ఓ పురాణ కథ.

09/01/2019 - 22:48

ఆ. వె. అగ్రపూజలందియాయురారోగ్యాలు
భక్తజనులకొసగు శక్తిగణప
తయ్య! నిన్నుఁ గొలతుధరణీ ధరంబునుఁ
బోలు దైవ మీవు పూజనీయ!

తే.గీ. అణువణువునందు సారతులందువాడ!
శరణగోరెద నీ దివ్యచరణములను;
మహిత భక్తితోఁ గొలచిన మమ్ముగాంచి
బ్రోచువాడవు విఘ్నేశ! పూజనీయ!

09/01/2019 - 22:46

పార్వతీనందనుడు, ఉమాసుతుడు అయన వినాయకుడు గణాలకు అధిపతి. అన్ని విద్యలకు ఆదిదేవుడు. ఏ కళను ఆరాధించేవారైనా వినాయకుడిని పూజిస్తారు.

,
08/30/2019 - 19:55

ఒక్క ఆలోచన ఉంటే చాలు
దేనినైనా సాధించవచ్చు.
సంతోషాన్ని, డబ్బును, కీర్తిని కూడా సంపాదించవచ్చు.
ఎలా అంటారా.. చూడండి...
చెట్లు ఇష్టపడని వారు ఎవరూ ఉండరు కదా. రంగు రంగుల పూలు
కమ్మని కమ్మని వాసన లిచ్చే ఆకులు.. ఇలా ఇంత చాలు...
మనం రోజు చేసే పని చేసేయొచ్చు. అందులోనే కాస్త రిలాక్స్‌పొందొచ్చు.
అవసరాలకు డబ్బు కూడబెట్టుకోవచ్చు.

,
08/29/2019 - 18:44

యువతరం మారిపోయిందోచ్
నిజమే మాట్లాడుతున్నాను. కొన్నాళ్లక్రితం చదువుకునేది ఉద్యోగం సంపాదించడానికే అన్నట్లు ఉద్యోగం కోసం ఎంతో కష్టపడి అది అందగానే ఇంకేం కావాలి అని నిశ్చింతా రోజులు గడిపేసేవారు.
కానీ కాలం ఇపుడు అట్లా లేదు. ఈరోజు ఉన్న ఉద్యోగం రేపు ఉంటుదన్న గ్యారెంటీ లేదు.
అందుకే కాలానికి తగ్గట్టుగా యువతరం ఆలోచన్నూ మార్చుకుని ముందుకు పోతున్నారు. అవేస్టార్ట్‌ప్ కంపెనీలు.

Pages