S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/28/2018 - 23:34

దేహాన్ని దేశాన్ని రాసిచ్చేసి
రాలిపోయిన వాడి పేరు
రాత్రిపూటైనా తలుచుకో!
రక్తాని దారిపొడవునా దానం చేసూత
కనుమూసిన వాడి కథను
కడవరకు గానం చేసుకో!
చెమటతో కాలాన్ని కలిపి
పొట్టకి పట్టెడన్నమై
రొట్టి లా కాలినవాడిని
గట్టిగా హత్తుకో!
రాత్రికీ పగటికీ మధ్యన
యంత్రమై తిరుగుతూ
లోకాన్ని మెరిపించి
ఆరిపోయిన వాడి గుర్తుగా

10/26/2018 - 19:10

ఆటగాళ్లు ఎవరైనా
ఆట రక్తి కట్టడం
చూపరులకానందం పరమానందం
గెలుపో ఓటమో
ఎవరో ఒక్కరికే!
పాడుతూ ఆడినా
ఆడుతూ పాడినా
ఎప్పటికప్పుడు
అపూర్వమైన అనుభూతి
ఇరువురి మధ్య
పలుజట్ల మధ్య
పలు దేశాల మధ్య
ఎవరాడుతున్నారన్నది కాక
ఎలా ఆడుతున్నారన్నది ముఖ్యం సుమా!
పోటీ ఎంతగా ఉన్నా
ఫలితమెలా ఉండబోతున్నా
ఎవరి అంచనాలెలావున్నా

10/25/2018 - 19:09

కొంతమంది పెద్ద ఉద్యోగస్థులైనా, ఇంట్లో అన్ని వ్యవహారాలను నడిపేశక్తి గలవారైనా సరే ఒక్కోసారి ఆత్మనూన్యతతో బాధపడుతుంటారు. దీనితో చేయాల్సిన పనులకు ఆటంకాలు ఏర్పడుతాయి. నలుగురిలో మాట్లాడాలన్నా, ఇప్పుడు ఇది చేస్తే ఎలా ఉంటుందోలే, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న ఆలోచన్లతో సతమతమవుతుంటారు.

10/25/2018 - 19:07

నీ యాదిలోనే పొలాల వెంబడి తిరుగుతుంటే
కొమ్మలపై కోకిలమ్మవై
ప్రియరాగాలతో పలకరిస్తావు
యుగళ గీతాలతో పులకరింప చేస్తావు
నే దిగులుతో సముద్రతీరానికి వెళ్లితే
ఇసుక తినె్నలపై వేయ లేక అడుగులేస్తుంటే
కలల సఖి అలల నెచ్చలివై
పాదాల ముద్దిడి పరవశింప చేస్తావు
నే నులిక్కి పడి ఆలింగానికై చేతులు చాస్తే
చెలియలి కట్టనుండి దూరంగా దూరమవుతావు

10/24/2018 - 19:25

ఈ మధ్య ఎక్కడ చూసినా స్ర్తిలకు ఇబ్బందులే తలెత్తున్నాయి. ఇంట్లో ఉన్నా కష్టమే. బయటకు వెళ్లినా కష్టమే అనిపిస్తోందోసారి.

10/23/2018 - 18:43

ఇటీవల మంబయిలో ఎనిమిదవ తరగతి చదువుతున్న సంజయ్ కోర్‌గావ్రీకర్ అనే 12 ఏళ్ల వయస్సు వున్న విద్యార్థి బ్లేడుతో చేతి నరాలు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సమయానికి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించడంతో వాడి ప్రాణాలు దక్కాయి. ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించావని ఫ్యామిలీ సైకాలజిస్టు అడిగితే నిలువెత్తు న్యూనతా భావంతో, నిరాశా నిస్పృహలలో కూరుకుపోయిన ఆ విద్యార్థి ఇచ్చిన కారణాలు దిగ్భ్రాంతికరంగా వున్నాయి.

10/23/2018 - 18:41

ప్రణయ కలహములు లేవు
జలకాలాటలు లేవు చిరు ముచ్చట్లూ కరువాయె
తోడు లేని ఒంటరి మనసు మొద్దుబారుతుండె
ఎల్లలు లేని సువిశాల మహా సామ్రాజ్యమ్ము బోసిపోయె
కనపడని వినపడని ఈ వేదన ఎప్పటికి తీరునో మన్మథా
అని ఒక భావకుడు విలపిస్తుంటే
ఓ నాయకి ఇలా అంటోంది.
కలహాల చోట కలహంసలు నడిచినా
జలకాటల్లో జలతారులు దింపినా
చిరుముచ్చట్లల్లో చిరునగవులుపూసినా

10/21/2018 - 23:48

నాలుగు రోజులు సరదాగా శాన్‌ఫ్రాన్సిస్కో చుట్టిరావాలన్నది దివ్య సంకల్పం. దివ్య ఉంటోన్న దక్షిణ కాలిఫోర్నియా నుండి ఉత్తరాన వున్న శాన్‌ఫ్రాన్సిస్కోకి నాలుగు వందల మైళ్ళ ప్రయాణం. భూమి లోలోతుల.. అగాథంలో విస్తరించుకున్నట్టుగా అనిపించే ఫసిఫిక్ మహాసముద్రాన్ని చూస్తూ మెలికలు తిరుగుతూ వందమైళ్ళ పైగా సాగే ఆకసాన్ని తాకే కొండంచుల ఫసిఫిక్ రూట్ ప్రయాణం ఎనిమిది గంటలు.. పిల్లలతో పది గంటలు..

10/17/2018 - 00:16

దుష్టత్వాన్ని అణచి, సాధుత్వాన్ని పెంచి శాశ్వతమైన శాంతి సౌఖ్యాలను ప్రసాదించే జగన్మాత- శ్రీ దుర్గాదేవి. పండు వెనె్నలను నిండుగా పండించే శరదృతువులో, చంద్రునిలాగా, బిడ్డలను చల్లగా కాపాడే జనని- శ్రీ దుర్గామాత. అష్టకష్టాలతో సతమతమవుతున్న ప్రజలను, అష్టమినాటి దుర్గ అన్ని విధములా ఆదుకొని కటాక్షించి ఆనందింపజేస్తుందని పురాణ ప్రశస్తి.

10/12/2018 - 19:09

పిల్లలు ఎంత చిన్న మంచి పనిచేసినా వారిని ప్రోత్సహించాలి. క్లాప్స్ కొట్టాలి. ఇలా చేస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. అప్పుడే పిల్లలకు ఆనందం కలుగుతుంది. వారి నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వస్తుంది. పిల్లలతో మాట్లాడేటప్పుడు కోపాన్ని పక్కన పెట్టాలి. వారిని ఎప్పుడూ తిట్టడం, కొట్టడం చేయకూడదు. పిల్లల ఎదుగుదలకు ఆర్థికంగా నిలదొక్కుకుని, డబ్బు ఆవశ్యకతను కూడా వారికి తెలియజేయాలి.

Pages