S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/16/2018 - 20:20

ఇప్పుడు ఎక్కడ చూసినా అపార్ట్‌మెంట్స్ చిన్న చిన్న గదులు.. సామాన్లు గది అంతా పరుచుకున్నట్టు ఉంటూ అసలే చిన్న గదిని మరింత ఇరుకుగా ఉన్నట్టు చేస్తుంటాయి. అట్లాకాక చిన్న గదులే పెద్దవిగా కనిపించాలన్నా లేదా విశాలంగా ఉన్నట్టు అనిపించాలంటే చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించాలి. ముందుగా గది గోడలకు వేసే రంగుల పైన దృష్టిని నిలపాలి.

08/15/2018 - 23:55

మొక్కలు పెంచుకోవడం అందరికీ ఇష్టమే. ఆ ఇష్టాన్ని వ్యక్తం చేయాలంటే మంచి జాగా ఉండాలి. మట్టి, ఎరువులు అన్నీ ఉండాలి, కనీసం పెద్ద పెద్ద కుండీలన్నా ఉండాలి అనుకొంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే గార్డన్ మీ ఇంట్లోనే చక్కగా ఆరేంజ్ చేసుకోవచ్చు.

08/14/2018 - 21:48

కాషాయం, తెలుపూ
ఆకుపచ్చ కలుపు
పతాకమై పైకెగసిన ప్రతీకలో
ప్రతిసారీ చూడాలొక గెలుపు
త్యాగాల రాగాలతో మార్మ్రోగిన ధరణి
సాహసాల సహవాసం
చెలరేగిన అవని
పోరాటపు ఉగ్గుపాలు
పొంగించిన పౌరుషం
ప్రాణాలే పణంగా
కొనసాగిన ఉద్యమం
ఒక వీరుడి తల..
చిరునవ్వులు రువ్వుతూ
ఉరికొయ్యకు ఊగిందట ఉయ్యాల
ఒక యోధుడి ఎద..
ఎదిరించే నినాదమై

08/14/2018 - 21:48

అప్పుడందరివీ చీకటి బతుకులే
సూర్యోదయమవుతున్నా..
బిక్కుబిక్కుమంటూ
కాలం గడుపుతున్న రోజుల్లో..
అందరి గుండెలకీ
ఆత్మస్థైర్యాన్ని నింపిన
యుగపురుషుల కాలమది!

పూరిగుడిసెల్లో
చీకటి పారద్రోలి చైతన్యం నింపే
కాగడాల వెలుతురుకి
నడకలొచ్చిన సమయమది!

08/13/2018 - 21:59

కొంతమంది ఏ పని చేయాలన్నా కొంత నిరాసక్తంగా ఉంటారు. ఏదో నిరుత్సాహం కనిపిస్తూ ఉంటుంది. ఏంటో ఏమి చేయాలో నాకు అర్థం కావడం లేదు అంటుంటారు.
అబ్బా ఇప్పుడు చేయాలా అంటారు. ఇంట్లో ఉన్నవాళ్లు కాక మరో ఇద్దరు భోజనాలకు వస్తున్నారు అంటే ఎంతో బాధపడిపోతారు. అమ్మో ఇద్దరికి వంట చేయాలా అని ఎక్కడాలేని బాధ వ్యక్తం చేస్తుంటారు.

08/13/2018 - 21:51

వర్షం కురిసిన ఆ కాళరాత్రి
ముళ్లకంపల పొదల మాటున నిన్ను విసిరి
పారేసి చేతులు దులుపుకుని పోయి రెవ్వరో!
ఆ హృదయం ఎంత పాషాణ సదృశ్యమో!
ముద్దుల మూటగట్టుమోము
పసిమొగ్గవు నీవు!
ఓ పసిపాప ఒకవేళ నీవీ విశ్వంలో
జీవించియున్న నీ భవిష్యత్తు ఎంత ఉజ్వలమై
ఉండెడిదో కదా అట్టి నీ జీవితాన్నివారి
స్వార్థం కోసమో లేక దరిద్రం కోసమో మరి

08/12/2018 - 23:02

ఆలోచనల
రెక్కల తొడుక్కుని
మధుర భావ పక్షులు
అంతరంగమనే ఆకాశంలో
విహరిస్తూ
నన్ను కవ్విస్తుంటే
ఊహాలోకాల్లోకి జారిపోయా!
ఇంకేముంది
హృదయపు పూదోటలో
విచ్చుకున్న సృజన కుసుమాలు
రంగవల్లులను తలపించేలా..
హరివిల్లును మరిపించేలా
భావుకతా వర్ణాలను
ఒంటికి అద్దుకుని
అందాలను ఆరబోస్తూ
అలరింప
పదబంధాలతో

08/12/2018 - 23:01

ఒకప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్ సెట్ చేసిన స్టైల్ - పలాజో. నడుము దగ్గర నుంచి పొడవుతో పాటు వెడల్పు కూడా పెరుగుతూ పాదాల వరకు ఉండే పలాజో ప్యాంట్ స్టైల్ కొత్త హంగులతో మళ్లీ ఇపుడు తెరమీదకి వచ్చేసింది. సంప్రదాయ శ్రేణిగా భావించే ధోతీకి ఇపుడు మళ్లీ ఆదరణ లభిస్తోంది. దీనికి జతగా పొట్టి టాప్, కుర్తీలను ఎంచుకోవడం మామూలే.

08/10/2018 - 21:19

ఉద్యోగినులు అయిన మహిళలు అటు ఉద్యోగం, ఇటు ఇంట్లో పని చేయలేక సతమతమవుతుంటారు. అటువంటివారు స్వయం ఉపాధి మార్గంలోకి వెళ్లుతున్నారు. మనకిష్టమొచ్చిన టైములో పనిచేయవచ్చు. మనం చేసిన పనికి తగ్గ ఫలితాన్ని పొందవచ్చు అనుకొంటూ ఈ స్వయం ఉపాధిమార్గంలో వస్తున్నారు. ఇందులో కూడా కొత్త పొంతలు తొక్కుతూ తాము మాత్రమే ఉపాధి ఆదాయాన్ని పొందే వీలు నుంచి నలుగురికి ఉపాధి కలిగించ గలిగే స్థాయికి మారుతున్నవారూ ఉన్నారు.

08/09/2018 - 21:14

నేటికాలంలో వారాంతపు సెలవురోజులను ఎక్కడికైనా వెళ్లి గడిపే ఆలోచన్లు పిల్లలే కాదు పెద్దలూ చేస్తున్నారు. వారంతం రెండు రోజులు బయటకు వెళ్లాలంటే కొంతమంది ఏమేమి తీసుకెళ్లాలో అని చిరాకు పడుతుంటారు. చిరాకు పరాకులు లేకుండా హుషారుగా వారాంతపు సెలవుదినాలను హాయిగా గడపాలంటే కొన్నిచిట్కాలు పాటిస్తే చాలు. ముందుగా ఎక్కడివెళ్తున్నామన్నది డిసైడ్ చేసుకొన్నాక దాన్నిబట్టి ఏ డ్రస్సులు వేసుకోవాలో నిర్ణయించుకోవాలి.

Pages