S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/06/2018 - 21:28

మారాం చేస్తున్న
పిల్లలతో తాత
కథ చెబుతాననగానే
అల్లరినంతా నిశ్శబ్దం కమ్మేసింది
అదిగదిగో
సృష్టికర్త స్వయంగా
పల్లకిమోస్తూ
దారివ్వడంటూ
చిరునవ్వులు చిందిస్తూ
భూతల స్వర్గంగా అడుగులు
వింటున్నారా చెప్పుకోండి చూద్దాం
మీలో ఎవరైనా
అదీ అదీ ఎవరో కాదు
మానవతామూర్తి సహనశీలి
మమతల కోవెల
విశ్వసనీయతకు

03/06/2018 - 21:28

ఓ మహిళా మేలుకో ఈ జగతి ఏలుకో
ఆడదంటే ఆది నుంచి ఆదిశక్తి
అమృతమూర్తి అన్న పూర్ణ
అందరికీ ‘అమ్మ’
అమ్మను ఆదరించు
కానీ చీదరించుకోకు
అమ్మను అనాథాశ్రమాల పాలు చేయొద్దు
అభాగ్య స్థితిలో నున్న
అమ్మను ఆదుకోండి
అమ్మను ఆదరించండం
అమ్మను గౌరవించండి
ఓ మహిళా మేలుకో
ఈ జగతి ఏలుకో
నవ మాసాలు మోసి
కనిపెంచిన అమ్మ అనురాగం

03/05/2018 - 22:30

గృహిణులైనా, ఉద్యోగినులైనా ఒక్క విషయం గుర్తించాలి. ఆలోచించాలి. మనం చేస్తున్న ప్రతి పనీ ఎవరికోసమో కాదు. కేవలం మనకోసం. మన వారు అనుకొన్న వారికోసం . కనుక ఎంతో కష్టపడుతున్నామని వాపోకూడదు. మన అనుకొంటే చేయాలి. మీకు నేను నాకు మీరు అనుకొంటే సమస్య ఉండదు. కాని స్ర్తీలంతా తన ఇల్లు వాకిలి తన మొగుడు, తన పిల్లలు, తన అనేదానికి ఎక్కువ విలువనిస్తారు. ఆ గిరిలో ఉన్నవారికోసం మాత్రమే పనిచేస్తానంటారు.

03/05/2018 - 22:25

అమ్మగుండె గుప్పెడే ఎప్పుడూ
అది ఆకాశానంతా నింపుకుంది.
పొత్తిళ్ళ లోపల ఊయలలూగే ఊఊల సవ్వడి ఆమెకే వినిపిస్తుంది.
చిన్నారి కన్నాయి కదలికలకు
విచ్చుకున్న కనురెప్పలు నవ్వుతుంటాయి!
అది అమ్మకు మాత్రమే తెలుసు!
తువ్వాయి కనురెప్పల చప్పుడు వెన్నకరిగి వెలుతురైనప్పుడు-
కన్న మనసు కరుణాసాగరవౌతుంది.
ఆ అనుభూతులు అమ్మ ప్రకంపనలకు తెలుసు!

03/05/2018 - 22:22

కొత్త ఏడాది రాగానే పెన్స్ బుక్స్ పట్టుకుని మన ఆశలు, ఆశయాలతో ఆర్థిక ప్రణాళిక వేసుకొంటాం. కాని కాలం గడిచేకొద్దీ వాటిని పక్కన పెట్టేసి అప్పటికయ్యది మేలు అనుకొంటూ ముందుకుపోతాం. అందుకే అప్పుడప్పుడు ఆ ప్రణాళికను తీసి మనం కనీసం అందులో ఏదైనా పొదుపు కోసం పెట్టుకొన్నవి ఆరంభించామా లేదా ఉదా.కు నెలకు ఐదువేలు దాయాలనుకొన్నారు అనుకోండి ఆరోజు.

03/04/2018 - 23:18

పలక బలపం పట్టుకోని రానివాళ్లే నేడు జాతీయ స్థాయిలో కార్యదర్శిగా పదోన్నతిని పొందారు. ఇలా చెబుతుంటే నమ్మబుద్ధి కావడంలేదా. నిజం.

03/02/2018 - 22:37

సంపాదన అవసరమే. అయితే, ఇది ఎంతమేరన్నదానిపై ఎవ్వరూ దృష్టి పెట్టడంలేదు. పక్కవారు ఏదో కొన్నారని మనకు అవసరమున్నా లేకపోయనా అది మన పరిధిలో ఉన్నాలేకపోయనా కొందరు కొనేస్తుంటారు. అదీ వాయదాల పద్ధతిమీద. ఇప్పటికీ ఈ పరిస్థితుల్లో మార్పులేదు. పక్కవాని గోల మనకేల? వానికి అవసరమైనది వాడు కొనుక్కొంటాడు. మనకు అవసరమైనది మనకు తెచ్చుకోవాలి అనే ఆలోచన ఎందుకు ఉండడం లేదు.

03/02/2018 - 22:31

భారతీయులకు రామాయణ మహాభారతాలు ప్రామాణ గ్రంథాలు. ఆ కథలలోని వ్యక్తులను ఆదర్శ పురుషులుగా మనం భావిస్తాము. అదేవిధంగా స్ర్తి పాత్రలను ఆదర్శ మహిళలాగా మనం కీర్తిస్తాము.

03/02/2018 - 22:28

నువ్వులు తెల్లవి, నల్లవి ఉన్నట్టుగా శుభానికి, అశుభానికి కూడా వాడుతుంటారు. ఇలా రెండు విషయాల్లో ప్రాముఖ్యత కలిగి ఉన్న నువ్వులు విటమిన్స్‌లో ను ప్రాధాన్యతను కలిగిఉన్నాయ. నువ్వులలో కాల్షియం, ఐరన్, ప్రొటీన్స్ లభిస్తాయి. నువ్వులనుంచి నూనెను తీస్తారు. ఈ నూనెను వంటనూనెగా ఉపయోగిస్తారు. ఈ నూనెతో దీపారాధన చేయడమన్నది ఎంతో శ్రేష్ఠం. ఈ నూనెను వాడటంవల్ల దేహంలో కొలెస్టరాల్ శాతం పెరగదు.

03/01/2018 - 22:29

వివేకంతో ఆలోచించిన మనిషి సమస్యలకు ఆందోళన చెందడు. అసలు సమస్య ఎక్కడ పుట్టిందోనని ఆ మూలాలను వెతుక్కుని, ఆ సమస్యను పరిష్కార మార్గం చూస్తాడు. ఇది వివేకుని లక్షణం! వీరిలో పిరికితనం, ద్వేషం, భయం అనేవి కనిపించవు. స్ర్తి ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా సమస్య అంటూ తలెత్తితే అసలు దానికి కారణమేమిటా అని ఆలోచిస్తుంది. కారణం కనుక్కొంటే సమస్యకు జవాబు దొరుకుతుంది.

Pages