S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/14/2018 - 20:43

సుప్రభాత వేళ
పక్షులు తమ కిలకిలారావాలతో
స్వరహారతి పడుతుంటే..
మంచు తెరలను దాటి
వడివడిగా..
ధరణిని ముద్దాడే
లేలేత ఉషాకిరణాలతో
జగమంతా పులకరింత!

11/13/2018 - 20:31

ఆటలు పిల్లల దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. ఆటలు ఆరోగ్యానికే కాదు పిల్లలకు వినోదం అందించడం లోనూ, బుద్ధి వికాసం కలిగించడం లోనూ, చురుకుదనం పెంచడంలో కూడా తోడ్పడుతాయి. బడిలో ఆటల వల్ల పిల్లల్లో చక్కటి క్రమశిక్షణ, పట్టుదల, కార్యదీక్ష, సమయస్ఫూర్తి, ఐకమత్యం వంటి గుణాలు పెంపొందుతాయి. ప్రస్తుతకాలంలో పిల్లలు ఎలక్ట్రానిక్ ఆట వస్తువులతో ఎక్కువ సమయం గడపడం వల్ల ఎలాంటి వ్యాయామాలు చేయడం లేదు.

11/09/2018 - 19:25

నలభై ఏళ్ళ క్రితం మాట. అప్పుడు నేను నాలుగవ తరగతి చదువుతున్నాను. సైకిల్ షాపులో పావలా ఇస్తే గంట సేపు సైకిల్ అద్దెకి ఇస్తారు. నా ఈడు పిల్లలందరికీ సైకిల్ తొక్కాలని మహాసరదాగా ఉండేది. పెద్దవాళ్ళ సైకిల్ తొక్కాలంటే సీటు అందదు. ఫెడల్స్‌మీద కాళ్ళు పెట్టి అడ్డ తొక్కుడు తొక్కేవాళ్ళం. సైకిల్ షాపులో పిల్లలు తొక్కుకునే చిన్న సైకిల్ అద్దెకు ఇస్తారు.

11/09/2018 - 19:23

ఆ కొండ బండరాళ్ళ వెంట నీ వులిని చేతబట్టి
పరుగు పరుగునా సాగిపోతూవున్న ఓ మహనీయ,
మహోన్నత శిల్పకళా ద్రష్టా! సృష్టికర్తా!
నీ పయనము ఎచటికి? నీ కోపము ఎవరిమీద?
కాస్త ఆగవయ్యా, మహానుభావా!
నేను అడిగే ప్రశ్నలకు సమాధానము చెప్పి వెళ్ళవయ్యా,
నీవు చెక్కిన ఆ మనోజ్ఞ రసదీపికా సుమబాలికా మూర్తి అయిన
ఆ స్ర్తి మూర్తి కన్నులలో ఉయ్యాలలూగుచున్న

11/08/2018 - 18:38

శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో అవసరం. ఇవి చాలా మేలుచేస్తాయి. మన శరీరానికి హానిచేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ఇవి శరీరంలో ఎక్కువగా ఉంటే కాన్సర్, గుండెజబ్బులు వంటి రోగాలు దరిచేరవు. మరి శరీరంలో వీటి శాతాన్ని పెంచాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఏ ఏ ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటాయో తెలుసుకుందామా!

11/06/2018 - 20:00

భారతీయ సంప్రదాయంలో ప్రతి పండుగకు (ఐతిహాసిక పురుషులు శ్రీరామనవమి, కృష్ణజయంతి వంటి పండుగలకు తప్ప) ప్రతి పండుగకు ఖగోళ పరిణామ విజ్ఞానం, అంతర్లీనమై ఉంది.

11/06/2018 - 19:59

పల్లవి:

దివ్వె వెలుగుతున్నప్పుడు - తప్పదెపుడు క్రీనీడ
దేశం బాగున్నప్పుడు - తప్పదు పగవానిపీడ
ఎదుగుతున్న వేళలో - ఏదో ఒక మొట్టికాయ
ఎదురొడ్డేవానిదే - విజయంలో పైచేయి

చరణం:

11/06/2018 - 19:55

అలసత్యచ అత్యాచారదైత్యుని
హతమార్చునాడె దీపావళిగద!
అలమతాబౌచు కంపైన ప్రకృతిదైత్యు
హతమార్చునాడె దీపావళిగద!
అగ్రజవానులై ఉగ్రవాదాసురు
పరిమార్చునాడె దీపావళిగద!
వరసుదర్శన శౌరివై అధర్మాసురు
పరిమార్చునాడె దీపావళిగద!
తగచిచింద్రీగ, చిచ్చుబుడ్డిగను, ప్రమిద
దివ్వెగాగ, కాకరవత్తి రవ్వగాగ
బాలుడును, బాలికయును ఒప్పారునాడె

11/05/2018 - 19:33

చీకటిని చీల్చే ప్రతి దీపం
మనలోని అజ్ఞానాన్ని తొలగించి
తొవ్వ చూపిస్తుంది

అహంకారపు పొరల్లో
కూరుకుని మానవత్వాన్ని పాతరేసినప్పుడు
మనిషిననే స్పృహని మేలుకొల్పే
దివ్వెలు, అడుగడుగునా

శబ్దంలోని నిశ్శబ్దాన్ని గుర్తించి
ఒంటరితనం కాదు సమూహమే మనల్ని
ఒక్కటిగా చేసే వెనె్నల మడుగులు

11/04/2018 - 22:27

ఎంతగొప్పది
అంతరంగం!
అంతా తానై...
మనల్ని నడిపించినా..
కంటి కెమెరాకు చిక్కదు!
గుప్పెట్లోకి దొరకదు!

ఒక్కోసారి ఎడారిలో
నీటి స్వప్నంలా..
ఊరటనివ్వని జీవితాన్ని ప్రసాదిస్తుంది!

అంతరంగ సాగరంపై
తరంగాలై..
జ్ఞాపకాల దొంతరలతో
దాగుడుమూతలాడుతూ..
ఊహల పల్లకీలో ఊరేగిస్తుంది!

Pages