S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/15/2017 - 02:42

జిమ్‌లో చేసే వ్యాయామం వల్ల ఒత్తిడి దూరం అవుతుందని నిపుణుల అధ్యయానాలు వెల్లడిస్తున్నాయి. వ్యాయామం చేశామంటే చేశాం అనే విధంగా కాకుండా జిమ్‌కు వెళ్లి చేస్తే శారీరకంగా, మానసికంగా మేలు జరుగుతుందని ఈ అధ్యయనాల ఫలితాలు తెలియజేస్తున్నాయి. వ్యక్తిగతంగా ఎవరికివారే చేయటం వల్ల ఒత్తిడి స్థాయిలో గణనీయమైన మార్పులు, జీవన నాణ్యత మెరుగైనట్లు పరిశోధనల్లో వెల్లడైంది.

11/15/2017 - 02:41

ఆహారానికి కొరత ఉన్నప్పుడు పంచదార తీసుకోవడంవల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చు. టేబుల్ షుగర్‌ను ఓరల్ రీహైడ్రేషన్ ద్రావకం తయారీకి వినియోగిస్తారు. ఇందులో ఉప్పు కూడా ఉంటుంది. డయేరియా, వడదెబ్బ సమయాల్లో ఓఆర్‌ఎస్ ద్రావకం ప్రాణాలను కాపాడుతుంది. సిమెంటు, వస్త్రాలు, ఇతర ఉత్పత్తుల తయారీలో చక్కెరను వినియోగిస్తారు.
ఎందులో ఎంత చక్కెర

11/11/2017 - 20:22

పండగండి పండగ
చిన్నారుల పండగ

వాడవాడల్ల పండగ
మాబడిలోన పండగ

బాలలు నచ్చేపండగ
పెద్దలు మెచ్చే పండగ

రంగురంగుల తోరణాలు
మా బడికే ఆభరణాలు

గులాబీల హారంచేసి
చాచాజీ మెడల్ వేసి

విశ్వశాంతియే సందేశం
శే్వత కపోతం సంకేతం

పంచశీల మనవాదం
విశ్వానికి మనవేదం

మానవాళి పొగడగ
మానవతయె మనుగడ

11/11/2017 - 20:20

రారండోయ్ బాలల్లారా! రారండి!
బడి పిల్లల్లారా! రారండీ!
భారతీయ చిన్నారుల పండుగలు రెండేరెండు!
దీపావళి పర్వదినం ఒకటి
‘చాచాజీ’ జన్మదినం మరొకటి,
అదే అదే బాలల దినోత్సవం!
చాచాజీకి చిన్నారులంటే ప్రియం
చాచాజీ! మీరంటే మాకెంతోప్రియం!
అదిగదిగో, అల్లదిగో ఎఱ్ఱగులాబీ
చాచాజీ షేర్వాణీనలంకరించిన గులాబీ
భారత బృందావనిలో గుబాళించే చిన్నారి గులాబీలు!

11/10/2017 - 20:19

చాలాకాలం క్రితం సినిమా పాటగా పల్లవించిన సూక్తి- ‘‘చదువురానివాడివని దిగులు చెందకు- మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు?’’- అక్షర లక్షల విలువ చేసే అమూల్యమైన ఆ పాట మాటల్లోని అంతరార్థాన్ని అవగాహన చేసుకుంటే నేటి విద్యార్థుల / విద్యార్థినుల వ్యక్తిత్వ వికాస ధోరణి ఎంతగా వెనుకబడివుందన్న వాస్తవం ముంజేతి కంకణంలా దర్శనమిస్తుంది. సంస్కారాన్ని నేర్పలేని చదువు ద్వారా సభ్య సమాజం ఏం నేర్చుకుంటుంది?

11/09/2017 - 19:40

రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో

bhoomika@andhrabhoomi.net కు మెయల్ చేయవచ్చు.

లేదాఈకింది చిరునామాకు పంపగలరు.

మా చిరునామా :

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

11/08/2017 - 19:15

ఇలాంటి సన్నివేశాలు వెండితెరమీద చూస్తాం. ఉన్నదంతా నాకేసి ఆనక రెస్టారెంటు యజమానికి ఎగనామం పెట్టడం చూడ్డానికి బాగానే వుంటుంది కాని.. జరిగితే? ఇంగ్లాండ్‌లోని గ్లోసేస్టార్ నగరం చాలామంది ‘బ్యాంకాక్ క్యాంటీన్’లో థాయిలాండ్ భోజనం అంటే ఇంగ్లీషు జనాలు పడి చస్తారు.

11/08/2017 - 19:14

ముప్ఫై ఐదు సంవత్సరాల అనసూయాదేవి, వాళ్ళ ఊరు ఉత్తర భారత్‌లో ఫతేపూర్ దగ్గరి చిన్నపల్లె తప్ప లోకం ఎరుగదు. భర్త పోయినదగ్గరనుంచి అన్నయ్య అవధేష్‌కుమార్ దగ్గరే ఉంటున్నది. కాని 2012 నుంచి ఆమె విపరీతమైన మోకాలి నొప్పితో సతమతమైపోతోంది. నిలబడలేక కూర్చోలేక నడవలేక నానా బాధలు పడుతూ వున్న చెల్లెల్ని ఆ పల్లెటూరు అన్నయ్య- నాటు మందులకు వీడ్కోలు పలికి, జిల్లా ఆసుపత్రికి తీసుకుపోయాడు. వాళ్ళు ఎక్స్‌రేలు తీశారు.

11/08/2017 - 19:12

ఆరోగ్యం అంటే శారీరక, మానసిక ఆరోగ్యాల మేలుకలయిక. పరిపూర్ణ ఆరోగ్యానికి పనికొచ్చే యోగాసానాలు మనచెంతకు తెస్తుంది ఒబిలిశెట్టి మాధురి. ఇరవై రెండేళ్ల మాధూరి పిల్లలకు, పెద్దలకు ఉచితంగా యోగాసానాలు నేర్పుతోంది. యోగా సాధన చేయటం అంటే ఆత్మసాక్షాత్కరం చేసుకోవటమే అని అంటోంది. యోగాను మన డైలీ జీవితంలో భాగంగా చేసుకుంటే జబ్బులే దరిచేరవు అంటూ మార్గదర్శనం చేస్తోంది.

11/01/2017 - 19:49

ఉప అంటే దగ్గరగా/అంటుకుని, వాసము అంటే ఉండడం. ఉపవాసం అంతిమ లక్ష్యం భగవంతునికి సమీపంగా, ఆత్మదర్శనార్ధియై ఉండడం. నిత్యకర్మల చేత అలసిన శరీరం, మనసు వాటినుండి దూరంగా జరిగి భగవత్ తత్వానికి దగ్గరగా వుండగోరుకోవడమే ఉపవాస దీక్ష పరమార్ధం.

Pages