S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/17/2019 - 22:39

ఇంట్లో అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటే అది అందమైన లోగిలే అవుతుంది. అలా ఇంటిల్లిపాది సంతోషంలో అందం, పరిశుభ్రత వంటి అంశాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే ఇంటిని అందంగా, శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో అందరూ కాసేపు కూర్చుని గడిపేది, ఎవరైనా వస్తే కూర్చునేది డ్రాయింగ్ రూములోనే.. కాబట్టి డ్రాయింగ్‌రూమును మరింత అందంగా తీర్చిదిద్దుకోవాలి.

02/17/2019 - 22:35

అవును ఇది నిజం..
కల్పితము కాదు
కథ అంతకంటే కాదు
ఆకాశమంత స్వప్నం ముక్కలై..
నిండునూరేళ్ళ జీవితం
అర్ధాంతరంగా..
విధిరాత వారి
మరణం ముందు ఓడిపోయింది..
పునరపిజననం.. పునరపిమరణం..
దేశ రక్షణ చట్రబంధములో కేవలం
పుట్టుక మాత్రమే తమదని
జీవితాలు దేశం కోసమని
తోటివారి ప్రాణాలను
వారి గుండెల్లో పెట్టుకొని..
రక్షకులై నిలిచి..

02/15/2019 - 18:49

ప్రతిరోజూ మనం కూరగాయలు, పండ్లు ఎన్నో తీసుకుంటాం కదా.. వీటితో పాటు ఇంకొన్ని పదార్థాలను తరచూ తినేందుకు ప్రయత్నిస్తే ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఒకసారి చూద్దాం.
గుమ్మడి గింజలు

02/14/2019 - 18:41

జీవనశైలిలో, ఆహారపరంగా మార్పులు రావడానికి మనం ఇష్టపడం. అలాకాకుండా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే.. మెనోపాజ్ దశ దాటాక ఎదురయ్యే చాలా రకాల సమస్యల్ని అదుపులో ఉంచుకోవచ్చు. మరి అవేంటో చూద్దామా..

02/13/2019 - 19:15

చరిత్ర పుటలు తిరగేస్తే
అన్నీ అబద్ధాలే!

ఆత్మ‘హత్య’
పాఠాలున్నవి
ప్రేమ పుస్తకాలు
ఎలా అవుతాయి?

లేని ‘అమర ప్రేమికులకు’
పెద్ద పీట వేసి
భావితరాలను
పెడదోవ పట్టించింది!

‘ఒకటి’ అవ్వలేకపోతున్న
ఇద్దరి నడుమ
చివరి క్షణం వరకూ ఎక్కడున్నా
ఒకరి క్షేమాన్ని ఇంకొకరు
నిరంతరం ఆకాంక్షించడమే
అమర‘ప్రేమ’!

02/13/2019 - 19:13

రెండు మనుషుల కలయికతో
ప్రేమ జనించదు
ముఖ సౌందర్యాలని దాటుకుంటూ
గుండె లోతుల్ని స్పృశించగలిగితే
నీ పాదాక్రాంతమే

భిన్న వైరుధ్యాల నడుమ
మొక్కవోని నమ్మకమై నిలబడితే
కడదాకా నిలబెడుతుంది

ఎదుటివారి కళ్లలో నవ్వులు
పూయించగలిగితే ఎడారి బతుకులంతా
ఒయాసిస్సుల సంపదలే

అనంగీకారాన్ని కూడా ప్రేమగానే భావిస్తే
ఉన్మాద స్థితికి చరమగీతమే

02/12/2019 - 18:26

బట్టలు మురికిగా తయారవ్వడానికి రకరకాల పదార్థాలు అంటే ఆహారం, పానీయాలు, ఇంక్, లిప్‌స్టిక్, ఆయిల్.. ఇలా ఏవైనా కారణాలు కావచ్చు. ఇలా మరకలు పడిన వాటన్నింటినీ కలిపి ఉతికేయకుండా.. ఒక్కో రకమైన మరకకు ఒక్కో పరిష్కార మార్గం ఉంటుంది. అలాగే మరక పడిన బట్టలు ఏ రకమైనవో చూసి దానిని బట్టి శుభ్రం చేయాల్సి ఉంటుంది.

02/11/2019 - 23:13

ప్రియాంక చోప్రా జోనాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రియాంక చోప్రా మైనపు విగ్రహం కొలువుతీరింది. ఈ బొమ్మకు ‘ప్రియాంకచోప్రా జోనాస్’ అని పేరు పెట్టారు. 2016లో ఎమీ పురస్కారాల వేడుకల్లో ఎర్రరంగు డ్రెస్ ధరించి సందడి చేసిందామె. ఇప్పుడు ప్రియాంక మైనపు బొమ్మకూ అలాంటి డ్రెస్సే వేశారు.

02/11/2019 - 23:11

అతివలే అన్నింటికీ నిర్వాహకులు.. మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులు వారే విక్రయించుకునేలా ఒక కేంద్రం.. అదే ‘షీ మార్ట్ అండ్ లూస్’. దీన్ని చందానగర్‌లో జీహెచ్‌ఎంసీ ఏర్పాటుచేసింది. మహిళలు వారు తయారుచేసిన వస్తువులను అమ్మడానికి అనేక తంటాలు పడుతుంటారు. అనేక చోట్ల తిరుగుతూ వారు తయారుచేసిన వస్తువులను విక్రయించడానికి ఇబ్బంది పడుతుంటారు.

02/08/2019 - 19:26

మనసు ముక్కలైందా?
అయితే..
ఏకాంతమే శరణ్యం!
రెక్కలు తెగిన
విహంగంలా..
భావం అలమటిస్తుంటే..
ఏకాంతం తలుపు తట్టక తప్పదు!
కోపం..
జడలు విప్పి నాట్యం చేస్తుంటే..
నిర్జనమే వాంఛనీయం!
అశాంతిలో
ప్రశాంతిని నింపేది ఏకాంతమే!
ఒత్తిళ్లకు సంకెళ్లు వేసి..
తన పొత్తిళ్లలో..
పొదివి పట్టుకుని..
అక్కున చేర్చుకునే అమ్మ ఏకాంతం!

Pages