S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/30/2017 - 22:18

కాలమెంత మారినా మనిషి ఎన్ని విజయాలు సాధించినా ఎంత ఎత్తుకు ఎదిగినా ప్రకృతికి మనిషికి విడదీయరాని సంబంధముంది. నిజంగా చెప్పాలంటే ప్రకృతే మనిషికి మొదటి పాఠశాల. ప్రకృతినుంచే అన్నీ అలవరుచుకొని మనిషి అడుగు ముందుకేస్తాడు. మనుగడ సాగిస్తాడు. మరీ ముఖ్యంగా పల్లె ప్రజలకు, రైతులకు ప్రకృతితో ఎంతో అనుబంధముంది. ప్రపంచంలోని పండుగలన్నీ మొదట మట్టికి, ప్రకృతికి సంబంధించినవే.

08/29/2017 - 22:45

యువతరం సరికొత్త ఆశలు, ఆలోచనలతో ముందుకు సాగుతోంది. ఇలాంటి కోవకు చెందినవారే ఈ యువ ఇంజనీరింగ్ విద్యార్థినులు. ఇంకా నాలుగేళ్ల కోర్సు పూర్తిచేసుకోనూలేదు. అప్పుడే సేవబాట కాదు కాదు..సహాయ బాట పట్టారు. రక్తదానం..ప్రమాదాల్లో గాయపడిన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందివ్వడం.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్లు పంచడం..

08/29/2017 - 22:42

మనింట్లో పనిమనిషి ఉందంటే ఆమె చేత గొడ్డు చాకిరీ చేయించుకుని మిగిలిపోయిన అన్నం ఇచ్చి పంపేస్తాం. కానీ ఈ కృష్ణవేణి వారి బాగోగుల గురించి ఆలోచిస్తుంది. చట్టాలు, హక్కులు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా వారి శ్రేయస్సుకు పాటుపడుతుంది. ‘పనివారు కాదు-మనవారు’ అనే నినాదంతో నిరుపేద పనివారకు సేవలందిస్తున్నారు సామాజిక వేత్త కొత్త కృష్ణవేణి.

08/29/2017 - 22:38

కొత్త ట్రెండ్ సృష్టించాలన్నా.. అభిమాన హీరో స్టైల్‌ని ఫాలో అవ్వాలన్నా కుర్రకారు ఎప్పుడూ స్పీడే. వేసుకునే దుస్తుల నుంచీ, ధరించే యాక్ససరీస్ వరకూ కొత్త ప్యాషన్‌ని ఫాలో అవుతూనే ఉంటుంది నేటి యువతరం. అమ్మారుూ, అబ్బారుూ యాక్ససరీస్‌లో మరింత స్టైల్‌గా ముందుంటాయి లెదర్ కఫ్స్. నిజానికి వీటి వాడకం రెండు మూడు ఏళ్ల క్రిందటే మొదలైనా ప్రస్తుతం హాట్ ఫ్యాషన్, టాపిక్ అవ్వడం చెప్పుకోదగ్గది.

08/23/2017 - 23:08

ప్రతి కార్యంలోనూ తొలిపూజలందుకునే దైవం, విఘ్ననాశకుడు శ్రీవినాయకుడు. ఈయనకి 64 రూపాలున్నాయంటారు. వాటిలో 32 రూపాలు ముఖ్యమైనవని, మళ్లీ అందులో షోడశరూపాలు అతి ముఖ్యమైనవని చెబుతారు. వీటిలో శే్వతార్కగణపతిని ఎక్కడా చెప్పకపోయినా తెల్ల జిల్లేడు వక్షాలు 100 సంవత్సరములపైన వున్నట్లయితే వాటి మూలంలో గణపతి ఆకారం తయారవుతుందని ప్రశస్తి. అయితే ఇలాంటి గణపతి రూపం దొరకటం దుర్లభమని పెద్దలు చెబుతారు.

08/22/2017 - 23:36

శలభాసనం తామరస్థితి తెలుపుతుంది. ఇది పశ్చమోత్తనాసనానికి, హలాసనానికి వ్యతిరేకస్థితిలో ఉంటుంది. దీనివలన శరీరానికి ప్రయోజనాలు చేకూరుతాయి. అర్ధ శలభాసనం వేయడానికి మొదట నేలపై పడుకోవాలి.ఉదరం, చాతి, చుబుకం నేలను తాకుతు వుండాలి. భుజాలు చదునుగా పరచాలి.

08/22/2017 - 23:32

బొప్పాయిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బొప్పాయిని రోజు అరకప్పు తీసుకోవడం ద్వారా దాంపత్య జీవితం మెరుగ్గా వుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీర్యంలో నాణ్యతను పెంచడంతో పాటు బొప్పాయిలోని ఎంజైమ్ అని పిలువబడే అర్జినిని..మర్మాంగాలకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా కండరాల పనితీరు మెరుగవుతుంది. అలాగే బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుండడం ద్వారా నిత్య యవ్వనులుగా కనిపిస్తారు.

08/15/2017 - 22:00

తలనొప్పి, నోటి పూత పోవాలంటే వారానికి నాలుగు రోజులు మునగాకు తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దంత సమస్యలు తగ్గాలంటే.. జుట్టు బాగా పెరగాలంటే.. జుట్టు తెల్లబడకుండా వుండాలంటే, చర్మవ్యాధులు రాకుండా వుండాలంటే ఖచ్చితంగా రోజువారీ డైట్‌లో అరకప్పు మునగాకు వుండాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మునగాకును నేతిలో వేయించి తీసుకోవడం ద్వారా రక్తహీనత దూరమవుతుంది.

08/08/2017 - 21:43

రెండు పదులు దాటిన కుర్రాళ్లు ఏం చేస్తారు. షికార్లు..్ఛటింగ్‌లు.. వీకెండ్ టూర్లతో ఎంజాయ్ చేస్తారు. ఈ ముగ్గురు కుర్రాళ్లు మాత్రం మురికివాడల ప్రజలలో మార్పు తీసుకువచ్చేందుకు కదిలారు. పనీపాటా లేకుండా సేవ పేరుతో కాలాక్షేపం చేయటం వీరి నైజం కాదు. పనిచేస్తూనే పదుగురికి సాయం చేయాలనే మంచి మనసు వీరిది. వీరే కమల్ నాయక్, సీతాకాంత్, నీలోఫర్,తబ్సమ్.
చారిటీ కేక్ ఏర్పాటు

08/01/2017 - 22:00

ప్రాణాంతకమైన క్యాన్సర్‌ను ఆధునిక వైద్యంలో ఎన్నో మందులు వచ్చాయి. చర్మ క్యాన్సర్‌కు కూడా సరికొత్త మందును కనిపెట్టారు. చర్మంపై వచ్చే క్యాన్సర్‌కు కారణమైన మెలనోమా కణాల నిర్మూలనకు ఈ మందు బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. సాధారణ కణాలతో పాటు ఈ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా ఈ మందు అడ్డుకట్ట వేస్తోంది. ఈ మందుకు హెచ్‌ఎ15 అని నామకరణం చేశారు.

Pages