S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/30/2017 - 00:56

గంటలో 2500 బస్తీలు తీసి, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సృష్టించాడు ఆస్ట్రేలియాకు చెందిన కార్ల్‌టన్ విలియమ్స్! ఇతగాడి వయసు 52. గంటసేపు జరిగిన ఈ విన్యాసాన్ని వీడియో రికార్డు చేసి, యూ ట్యూబ్‌లో పెట్టడంతో బోలెడంత హిట్టైంది. ఇది జరిగి రెండేళ్లు గడిచిపోయాక ఈ మధ్యనే మళ్లీ తన రికార్డును బద్దలు కొట్టేశాడు అదే గంటలో 2,682 బస్కీలతో.

07/21/2017 - 23:52

మనిషికి జింక్ ఎంతో అవసరం. గర్భిణిగా ఉన్నప్పటి నుంచే జింక్ ధాతువును అందిస్తారు. ప్రతిఒక్కరూ రోజుకు కనీసం 15 మిల్లీ గ్రాముల జింక్ అవసరం. ఆహారపదార్థాల ద్వారానే అవసరమైన జింక్‌ను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. టాబ్లెట్స్ రూపంలో తీసుకునే బదులు జింక్ ఎక్కువగా ఉండే పళ్ళు, పప్పు దినుసులు, ఆకు కూరలు, పాలు, క్యాబేజీ, బంగాళాదుంప, బీట్‌రూట్, వేరుశనగలు ప్రతిరోజూ ఆహారంలో తీసుకుంటే చాలు.

07/21/2017 - 23:51

డియర్ హోస్‌కు,
‘నిత్య ఆలోచనల్లో (తనగురించి) మునిగి తేలేవాడే నిత్య సంతోషి’.
ఇదేదో నిన్ను పొగడటానికి సంధించిన వాక్యాస్త్రం అనుకుంటున్నావు కదూ! కానేకాదు. ఓ రెండ్రోజుల క్రితం జరిగిన ఓ సంఘటన నా మనస్సును నిర్మాణాత్మకంగా తొలచివేసింది. అది నీతో పంచుకుందామనుకుంటున్నాను.

07/21/2017 - 23:50

పెళ్లయిన వెంటనే కొత్త జంటలు హానీమూన్, ముద్దూముచ్చట్లు తీరిన వెంటనే చెంగున కొత్త కాపురం పెట్టేస్తున్నాయి. చాలా జంటలు కూడా ఉమ్మడి కుటుంబాల్లో ఉండటానికి ఇష్టపడటం లేదని ఆధునిక సర్వేలు వెల్లడిస్తున్నాయి. షాదీ డాట్‌కామ్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలను జంటలు వెల్లడించాయి. దాదాపు 8,500 మందిపై సర్వే నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న 4,617 మహిళల్లో 3,952మంది విడిగా ఉండటానికే ఇష్టపడుతున్నారు.

07/20/2017 - 00:11

చెక్స్ కేవలం గేమ్ బోర్డులో, ఫ్లోర్ టైల్స్, పికినిక్ బ్లాంకెట్స్ మీదే కాదు నేడు చిన్నా,పెద్దా అందరూ కూడా మక్కువగా దుస్తుల్లో ధరిస్తున్నారు. చీరల్లో చెక్స్ ఒదిగిపోతున్నాయి. సీజన్ మారినట్లు చెక్స్ ట్రెండ్ సృష్టిస్తోంది. బాలీవుడ్ భామలు అలియాభట్ నుంచి దీపికాపదుకునే వరకు కూడా చెక్స్ డిజైన్లను అమితంగా ఇష్టపడతున్నారు. ర్యాంప్స్ మీద హొయలు పోవటమే కాదు గల్లీల్లో కూడా చెక్స్ చెక్‌పెట్టకుండా ధరిస్తున్నారు.

07/18/2017 - 22:37

ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే వర్షాకాలమే మంచిది. కొండలను ముద్దాడే మేఘాలు, పొగమంచు కప్పుకున్న పచ్చదనం, నీటి తుంపర్లు.. ఇలా ఒకటేమిటి ప్రకృతిని తనివితీరా చూస్తూ ఈ కాలంలో కుర్రకారు ట్రెక్కింగ్‌కి సిద్ధమవుతుంటారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పూచే పూలతో పుడమి తాజా అందాలను సంతరించుకుంటుంది. పక్షులను, జంతువులను పలకరించుకుంటూ ముందుకు సాగిపోవచ్చు.

07/13/2017 - 23:53

ఒక వ్యక్తి మరణం మొత్తం కుటుంబానే్న రోడ్డున పడేస్తుంది. నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల వెనుక ఎన్నో కుటుంబాల చిన్నాభిన్నమైన జీవిత చక్రాలు కనిపిస్తుంటాయి. ఇటీవలకాలంలో అతివేగం, అజాగ్రత్తవల్ల ఎందరో అసువులుబాస్తున్నారు. ప్రమాదంలో యజమాని చనిపోతే మొత్తం కుటుంబమే విషాదంలో మునిగిపోతుంది.

07/13/2017 - 23:50

రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో ఇ్ద్య్యౄజర్ఘీబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈ కింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

07/12/2017 - 22:56

ఆషాఢం అనారోగ్య మాసం అని మనందరికి తెలుసు. విపరీతమైన ఈదురుగాలులతో పుల్లచినుకులు పడే సమయం. కాలువలోను, నదులలోను ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది. పొలం పనులన్నీ ఈమాసంలోనే మొదలు పెడుతారు రైతులు. ఈ రోజుల్లో కొత్తగా పెళ్లి అయిన యువకులు ఆరునెలల కాలం అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది.

07/12/2017 - 22:55

దేశంలో విడిగా జీవించే జంటలు రాను రాను అధికమవుతున్నాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లయినా.. ప్రేమ పెళ్లయినా పదికాలాల పాటు పచ్చగా ఉండటం లేదు. వెయ్యి పెళ్లిళ్లు జరిగితే అందులో ఒక జంట విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నదని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇంట్లో తమకు ఏమాత్రం సంతోషం అనేది కరువైతే వెంటనే విడాకులకు దరఖాస్తుచేసుకోవటం నేడు ఫ్యాషన్‌గా మారిపోయింది.

Pages