S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/28/2017 - 21:48

ఆటలంటే చిన్నపిల్లలకు మక్కువ. ఆంక్షలు విధించకుండా ఆడనిస్తే వారిలో ఉల్లాసం.. ఉత్తేజం పెరుగుతుంది. ఆ ఉత్సాహమే వారిని ఉన్నతమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దుతుంది. పదిహేడేళ్ల ఫుట్‌బాల్ ప్లేయర్ రిద్ధీ వివేక్ పంగారే కూడా చిన్న ప్పటి నుంచి బాల్‌ను బలంగా కాలితో తనే్నది. కోచ్ గోపినాథ్ దీన్ని గుర్తించి ఆమెను ఫుట్‌బాల్ ప్లేయర్‌గా తీర్చిదిద్దాడు. ఇదే ఆమెను ఫుట్‌బాల్ ప్లేయర్‌గా మార్చేసింది.

06/27/2017 - 21:47

పనె్నండేళ్లే.. కిక్ ఇచ్చిందంటే ఖంగు తినకతప్పదు. అమ్మాయి కదా అని ఈ చిన్నారితో తలపడితే ఎదుర్కోడం కష్టమే. తన కిక్‌లతో రాళ్లను సైతం పిండి చేసేస్తోంది. అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోకుండా కరాటేలో రాణిస్తోంది అమృతారెడ్డి. పిల్లల్లో అసాధారణ ప్రతిభ దాగి ఉంటుంది. కొంతమంది మాత్ర మే నలుగురు ముందు తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. అలాంటివారిలో అమృత ఒకరు.

06/27/2017 - 21:43

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటి నా బాల్యానికి భరోసా ఇవ్వలేకపోతున్నాం. ఆడేపాడే వయసులో వారికి పెళ్లిళ్లు చేసి కన్నవారు తమ భారం తీరిపోయిందని వదిలించుకుంటున్నారు. పెళ్లి పేరుతో వారి జీవితాలను ఛిద్రం చేస్తున్నారు.. బాల్య వివాహల నిషేధ చట్టం ఉన్నా.. దేశంలో బాల్య వివాహలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏటా 1.4 కోట్లమంది బాలికలు పెళ్లీడు రాకుండానే పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.

06/24/2017 - 20:52

ఇళ్ళల్లో ప్రతి రోజు పరిమళ భరిత స్టిక్స్, అగరుబత్తి వెలిగించటం మన జీవనశైలిలో ఒక భాగమే. ఇవి చుట్టూ ఉండే ప్రాంతాన్ని సువాసనతో నింపుతాయ. పాలీ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు కలిగి ఉండే వీటివలన ఆస్తమా, క్యాన్సర్, జలుబు, దగ్గు వంటి ఇతరేతర ఆరోగ్య సమస్యలు కలుగుతాయని చాలా అధ్యయనాలలో వెల్లడైంది. కార్బన్ డై ఆక్సైడ్ విడుదలై, ఊపిరితిత్తుల కణాలను వాపులకు గురిచేసి శ్వాస సమస్యలను కలిగిస్తుంది.

06/23/2017 - 21:46

ఇప్పుడంతా నెటిజన్ల కార్యక్రమాలే నిత్యకృత్యాలైపోయాయి. వైఫైలు వచ్చాక పగలు, రాత్రుళ్ళు తేడా లేకుండా చాలామంది నెట్ కార్యక్రమాలలోనే తమ జీవన విధానాన్ని గడిపేస్తున్నారు. ట్విట్టర్లు, ఫేస్‌బుక్, వాట్సాప్, గూగుల్ వంటి సైట్లలో వీరవిహారం చేస్తున్నారంటే ఆశ్చర్యపోవలసిన పనిలేదు.

06/20/2017 - 21:41

దానిమ్మ పండుకు అనేక శతాబ్దాలనుండీ ప్రాచుర్యం వుంది. ఈజిప్టు ప్రాంతంలో వివిధ ప్రదేశాలలో, గృహాలలోనూ దానిమ్మ ఎక్కువగా పెంచబడుతుండేది. అందమైన ఎర్రని దానిమ్మ గింజల్లో అత్యధికంగా పోషక విలువలు, విటమిన్లు ఉన్నాయి. దానిమ్మ పండును వాడటంవలన అనేక ఆరోగ్య ఫలాలు అందుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆరోగ్యానికే కాకుండా సంతా న సాఫల్యానికి పూర్తిస్థాయి యవ్వ

06/17/2017 - 21:59

తండ్రి సాహచర్యమే ఆ కుమారుడికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో పాఠాలు నేర్పింది. పల్లెలో పుట్టిన తన కుమారుడు ప్రపంచస్థాయికి చేరుకునే ప్రస్థానంలో ఆ శతాధిక వృద్థుడు చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఆయనే జైనులుద్దీన్. ఆయన సానబెట్టిన ఆ భారతరత్నమే అబ్దుల్ కలామ్.

06/16/2017 - 21:30

పల్లెల్లో వయసొచ్చిన పిల్లలు స్కిప్పింగ్ చేస్తే పెద్దవాళ్లు ఊరుకోరు. ముఖ్యంగా రుతుస్రావం సమయంలో ఈ ఆటను ఆసలు ఆడనివ్వరు. కేవలం చిన్న పిల్లలు మాత్రమే ఆడుకుంటారు. కాని స్కిప్పింగ్ అనేది అన్ని వయసుల వారికి మంచిదే. వయసులో ఉన్న ఆడపిల్లలు స్కిప్పింగ్ చేస్తే గర్భాశయ సమస్యలు తలెత్తుతాయనే ఆపోహ ఉంది. కాని ఇది నిజం కాదంటున్నారు వైద్య నిపుణులు.

06/16/2017 - 21:28

యోగాలో ఇది అద్భుతమైన విన్యాసం. ఎవ్వరు చేయని ఈ అద్భుతాన్ని 13 ఏళ్ల మైసూరు బాలిక కుషీ చేసి రికార్డుల్లోకి ఎక్కింది. యోగాసనాలలో అరుదైన ‘నిరాలంబ పూర్ణ చక్రాసనం’ ఒక్క నిమిషంలో పదిహేనుసార్లు వేసి ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇంతవరకు ఈ ఆసనాన్ని నిమిషంలో ఇన్నిసార్లు ఎవ్వరూ వేయలేకపోయారు. శరీరాన్ని విల్లులా వెనక్కి వంచే ఈ ఆసనం అతికొద్ది మంది మాత్రమే వేయగలరు.

06/15/2017 - 21:56

అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇన్నాళ్లకు భారతీయ మహిళకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ (ఐటిఎల్‌ఒఎస్)లో తొలిసారి ఓ భారతీయ మహిళ జడ్జిగా నియమితురాలైంది. అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న ఆమే డాక్టర్ నీరుచదా. విజయలక్ష్మి పండిట్ తరువాత ఇలాంటి అత్యున్నత గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా నీరుచదా చరిత్రపుటల్లోకి ఎక్కారు.

Pages