S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/24/2017 - 23:09

2002 నుంచి ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం రాష్ట్రీయ మంచ్ అని ఒక ఆర్‌ఎస్‌ఎస్ శాఖ పనిచేస్తోంది. ఉత్తరాఖండ్‌లో కూడా దీని బ్రాంచ్ పనిచేస్తున్నది. హిందూ-ముస్లిం సంఘీభావ ఉద్దీపన దీని కర్తవ్యం. ఈ ఏడాది ‘ఎంఆర్‌ఎం’ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నామని ఆ సంస్థ కోకన్వీనర్ మహీరాజధ్వజ్ సింగ్‌గారు ప్రకటించాడు.

05/24/2017 - 23:08

బళ్ళారికి చెందిన రామదుర్గ అనే గ్రామంలో ఈ మండుటెండాకాలంలో కూడా ఆ సరస్సు నిండుగా నీళ్ళు. ఆ నీటిలోపల జలపుష్పాలు వున్నాయి. కాని వానల్లేవట. రాత్రికి రాత్రే కుర్రకారు ఆ పెద్దచెరువుకి గండి కొట్టేశారు. మొత్తం నీళ్ళు అన్నీ కాలవల పాలు అయినాయి. ఉదయమే కుప్పలుగా మిలమిల మెరుస్తూ చేపలు నీళ్లు చాలక కొట్టుకుంటున్నాయి. ఎవడ్రా?

05/19/2017 - 21:44

పనిచేసే చోట రాణించాలంటే కష్టపడటం ఒక్కటే కాదు, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కూడా తప్పనిసరి. ముఖ్యంగా కొందరు మహిళలకు ఇది చాలా అవసరం అంటారు నిపుణులు.
సమస్య ఎదురైనపుడు ఎక్కువమంది బాధపడితే.. చాలా తక్కువమందే పరిష్కారం కోసం ఆలోచిస్తారు. మీరు బాధపడేవారైతే.. ఆ ధోరణి మార్చుకొనే ప్రయత్నం చేయండి.

05/19/2017 - 21:35

ప్రపంచంలో ఏకమొత్తంగా (ఒకేబెల్ట్) ఉండే ఏకైక, అతిపెద్ద మాంగ్రూవ్ అడవుల (మడ) సమూహం సుందర్‌బన్. బంగ్లాదేశ్, భారత్ (వెస్ట్‌బెంగాల్) పరిథిలో పదివేల చ.కి. మేరకు విస్తరించింది. ఇందులో 81శాతం బంగ్లాదేశ్ పరిథిలోను, 19 శాతం భారత్ పరిథిలోనూ ఉంది.

05/19/2017 - 07:25

అందంగా ఉండాలని అమ్మాయిలు తహతహలాడటం సహజం. మారుతున్న పరిస్థితులు నేడు అబ్బాయిలే స్టయిల్‌గా కనబడాలని తహతహలాడుతున్నారు. ఇందుకోసం వెతకని సామాజిక మాధ్యమం లేదంటే నమ్మండి. ముఖానికి మెరుపులద్దటానికి, నయా ట్రెండ్స్ ఫాలో అవుతూ అమ్మాయిలను ఆకర్షించటానికి చేయని ప్రయత్నం లేదు. సౌందర్య సలహాల యువకులు విపరీతంగా వెబ్‌సైట్లను వెతుకుతున్నట్లు ఇటీవల నిర్వహించిన సర్వేలో సైతం వెల్లడింది.

05/19/2017 - 07:15

దూర ప్రాంతాలకు ఆడపిల్లలు ఒంటరిగా వెళ్లాలంటే భయం. అలాంటిది పూజ రాజ్‌పుట్ అనే నావీ అధికారిణి రెండు వేల కిలోమీటర్లు సూపర్‌బైక్‌పై ప్రయాణించి గోవా, మంగుళూరు, ఊటీ, కాళీఘట్, కార్వార్ వరకు ప్రయాణించింది. గుంపుతో వెళితే తాను అందించాల్సిన సందేశాన్ని ప్రజలకు చేరదేమో అనుకుని పూజా రాజపుత్ 1600సిసి సూపర్‌బైక్ మీద తన ప్రయాణానికి శ్రీకారం చుట్టింది.

05/17/2017 - 22:17

నటనారంగంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, ఇది సహజమని, జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అని అంటోంది బుల్లితెర నటి రష్మీదేశాయ్. నటిగా తనకంటూ గుర్తింపు వచ్చినప్పటి నుంచి ప్రైవేటు జీవితానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు కొంత దూరాన్ని మెయిన్‌టెయిన్ చేస్తున్న రష్మీ దేశాయ్ తనకున్న సమయంలో కొంత సొంత వ్యాపారానికి కేటాయస్తున్నట్లు వెల్లడించింది.

05/17/2017 - 22:15

19 ఏళ్ల సారికాదేవి సంగీతంపై ప్రముఖ గాయనీగాయకులు శ్రేయా ఘోషల్, అంకిత్ తివారీ, అర్మాన్ మాలిక్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాను ఎంచుకుని ఈ వర్థమాన గాయని తన పాటలను అప్‌లోడ్ చేస్తూంటుంది. ఈ పాటలను విని చాలామంది ఆమె గాత్రాన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నారు. ఒకప్పుడు కచేరీలు చేస్తేనే సంగీతకారులకు గుర్తింపు లభించేది.

05/17/2017 - 22:15

పోయిన ఆదివారం చండీగఢ్‌లో జరిగిన ‘మదర్స్ డే’ సంబరాల్లో మరో యాభై మంది వనితలతో కలిసి ప్రదర్శన వేదిక మీద అద్భుతంగా నడిచిన శ్రీమతి మాన్ కౌర్ వీక్షకులను ‘కిర్రె’క్కించేసింది.. ఈ బామ్మగారు పరుగుపందెం వేస్తానంటూ తిరగడం, ఆమె కుమారుడు గురుదేవ్ మురిసిపోతూ చూశాడు. అతని వయస్సు 78- అంటే ఈవిడ వయస్సు ఎంత? సరిగ్గా 101 ఏండ్లు. ఈ తాతా తాతమ్మల ముందు యువతీ యువకులు నిలబడలేరు.

05/17/2017 - 22:13

బొకారో స్టీల్ సిటీలో ఆ పడుచు దంపతులు తడి పొడి ఇస్ర్తిలు చేసుకుంటూ మూడు పదులు నిండకముందే ఐదుగురు సంతానాన్ని కన్నారు. చీకటిపడేసరికి మందుచుక్క పడితేనే తప్ప బ్రతకలేని రాజేష్ జంట, సంతోష్ సహిష్ అనే నాటు వైద్యుడికి నలభైఐదు వేల రూపాయలకి బేరం కుదుర్చుకొని తన ఆరు నెలల పసిబిడ్డను ఇచ్చేశారు. రోజూ మీరు తాగినంత మద్యం పోయిస్తానని ఆ నాటువైద్యుడు అన్నాడు.

Pages