S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

12/12/2017 - 18:14

మనస్సుచాలాచంచల స్వభావమైనది. ధర్మజుడు యక్షప్రశ్నల సమయంలో గాలి కన్నా వేగం కలిగినది ఏది అంటే మనసు అని చెప్పాడు. మనసు ఒక్క క్షణలో వెయ్యోవంతు కూడా పనిలేకుండా కూర్చోలేదు. నిరంతరం ఏదో ఒకదానిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది.ఇలాంటి మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియములకు ఆధీనమైపోతుంది. కామక్రోధాదులను బలపరుస్తుంది. అహంకార మమకారములను వృద్ధి చేస్తుంది.

12/10/2017 - 20:22

ప్రతి మనిషికి నమ్మకం ఉంటుంది. నమ్మకం లేకపోతే జీవనయానం సరిగా జరగదు అని కూడా అనుకోవచ్చు. అమ్మనాన్నలపై ఉన్న నమ్మకం వారి చెప్పిన మాటలపైనా కూడా ఉంటుంది. వారి చూపిన దారిలో నడిచి ఉన్నత స్థానాన్ని అలంకరిస్తుంటారు.

12/10/2017 - 02:52

ఎదుటివాడి మనసును గాయపరచేలా మాట్లాడటం, హింస కిందకే వస్తుందని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. మనం ఎదుటివారిని పలుకరిస్తే పండు వెనె్నల కురిసినట్లుండాలి. ఎపుడు ఎక్కడ మాట్లాడినా అది ప్రియంగా మాట్లాడాలని భారతం కూడా చెబుతుంది. మాట మనిషి విలువను పెంచుతుంది. మంచిమనిషిగా కీర్తి తెచ్చుకోవాలంటే మంచి మాటే దానికి మార్గగామి.

12/08/2017 - 18:24

ఏకాలంలో నైనా మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించాలి. గోసంపద ఉన్ననాళ్లు మానవుడు శ్రీమంతుడుగానే ఆయురా రోగ్యాలతోను, అష్టైశ్వర్యాలతోను ఉంటాడు. శాస్త్రాలన్నీ శ్రీమాత, భూమాత, మాతృదేవత, గోమాతలు పూజనీయములైనవని బోధించడం లో పరమార్థం ఇదే. మాతృమూర్తివల్ల లభ్యమైన మానవ జీవితాన్ని సవ్యంగా సాగించడానికిమానవుడు శ్రీమాతఅనుగ్రహాన్ని కోరుకుంటాడు.

12/07/2017 - 18:30

అత్రిమహర్షి, అనసూయల పుత్రుడు దత్తాత్రేయుడు. అత్రి పుత్రుడు కనుక ‘ఆత్రేయుడు’ అని కూడా పిలిచారు. శివానుగ్రహంతో దత్తాత్రేయుడు సంపూర్ణజ్ఞానాన్ని పొందాడని బ్రహ్మ పురాణం చెబుతుంది. ‘శ్రీదత్తా’ అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శ్రుతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయమూ తరింపజేయుటకె దత్తమూర్తి అవతరించారని చారిత్రక కథనం.

12/06/2017 - 18:14

తత్త్వశాస్తమ్రులో గాని మనస్తత్వ విషయములోగాని పరిశోధనలలోగాని, ఉద్యమాలలోగాని సంభవించిన మార్పులకన్నింటికి కారణం మహాజనకుడు కపిల మహర్షియే. మహాభారతములో, భాగవతములోనే కాకుండా ఉపనిషత్తులలో కూడా కపిల మహర్షి ప్రశంస ఉన్నది.

12/05/2017 - 18:30

నవగ్రహాల్లో శనిగ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్యుని కుమారుడు, యమునికి సోదరుడు శని. మానవులకు శని దేవుడు అంటే భక్తి కన్నా భయమే ఎక్కువగా ఉంది. అందుకు కారణం ఎవరిపైన అయినా శని ప్రభావం అంతో ఇంతో పడే వుంటుంది. వారి ఆ బాధలు అనుభవించే ఉంటారు. సంకటపరిస్థితులు ఎదుర్కోవలసి వస్తేశని పట్టాడని అంటుంటారు. కాని, శని సంచారం జాతకంలో ఉన్నప్పుడు శని శుభఫలితాలను కూడా ఇస్తుంటాడు.

12/03/2017 - 21:09

అపౌరుషేయాలైన వేదములు మంత్రద్రష్టలైన ఋషులచే పూర్ణమయిన అనంతము నుండి గ్రహింపబడి తమ స్మృతి పథం లో నిక్షిప్తపరుచుకొని తరతరాలకు అందించబడిని వేదవ్యాసులు వాటిని లిఖించి మానవాళికి మహోపకారం చేసారు.
సర్వకాల సర్వావస్థల యందు ఎంతో నియమనిష్ఠలతో తమ జీవితాలను క్రమశిక్షణకు అంకితం చేసి వేద నిధిని కాపాడుకుంటూ వచ్చిన ఋషి పుంగవులకు ఎంతో ఋణపడి ఉంది. మనభారతజాతి.

12/02/2017 - 18:41

కాలాన్ని భగవంతుని స్వరూపంగా భావిస్తాం. తరిగే కాలాన్ని, పెరిగే మనిషి ఆయుష్షును ఎవరూ ఆపలేరు. మన జననం మనకు తెలియదు.. మన మరణ నెపం కూడా తెలియదు. అదే దేవరహస్యం. కాని కాలంలో మంచికాలము , శుభకాలము అశుభకాలమని ఏదీ ఉండదు. కాని మనం తిథివారనక్షత్రాలంటూ విభాగించుకుంటూ అందులో శుభాశుభాలను లెక్కకడతాము. అష్టమి అమ్మో కష్టకాలమని భయపడు తుంటారు కొంతమంది. కాని దుర్గమాలను దూరంచేసే దుర్గాదేవి ని పూజించేది అష్టమినాడే.

12/01/2017 - 18:21

ఒక్కోసారి మనం చేయాలనుకొన్న పనులు ఏవీ ప్రయత్న లోపాలవల్లనో, పరిస్థితుల ప్రాబల్యంవల్లనో అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు. ఆశించినవన్నీ అనుకూలంగా ఫలితాలనిచ్చేట్టుగా పని చేసినట్టు అనిపించినా ఆఖరి నిముషంలో అనుకొన్న ఫలితాలు రావు. ఇది ఒక్కోసారి మనుసును మూగబోయేట్టు చేస్తుంది. కానిఇలాంటి పరాజయాలు మరింత పదునెక్కేట్టు చేస్తాయ. వాటి వల్ల మనిషిలోని అసలైన శక్తి బహిర్గతం కావాడానికి వీలు కలుగుతుంది.

Pages