S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

12/07/2017 - 18:30

అత్రిమహర్షి, అనసూయల పుత్రుడు దత్తాత్రేయుడు. అత్రి పుత్రుడు కనుక ‘ఆత్రేయుడు’ అని కూడా పిలిచారు. శివానుగ్రహంతో దత్తాత్రేయుడు సంపూర్ణజ్ఞానాన్ని పొందాడని బ్రహ్మ పురాణం చెబుతుంది. ‘శ్రీదత్తా’ అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శ్రుతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయమూ తరింపజేయుటకె దత్తమూర్తి అవతరించారని చారిత్రక కథనం.

12/06/2017 - 18:14

తత్త్వశాస్తమ్రులో గాని మనస్తత్వ విషయములోగాని పరిశోధనలలోగాని, ఉద్యమాలలోగాని సంభవించిన మార్పులకన్నింటికి కారణం మహాజనకుడు కపిల మహర్షియే. మహాభారతములో, భాగవతములోనే కాకుండా ఉపనిషత్తులలో కూడా కపిల మహర్షి ప్రశంస ఉన్నది.

12/05/2017 - 18:30

నవగ్రహాల్లో శనిగ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్యుని కుమారుడు, యమునికి సోదరుడు శని. మానవులకు శని దేవుడు అంటే భక్తి కన్నా భయమే ఎక్కువగా ఉంది. అందుకు కారణం ఎవరిపైన అయినా శని ప్రభావం అంతో ఇంతో పడే వుంటుంది. వారి ఆ బాధలు అనుభవించే ఉంటారు. సంకటపరిస్థితులు ఎదుర్కోవలసి వస్తేశని పట్టాడని అంటుంటారు. కాని, శని సంచారం జాతకంలో ఉన్నప్పుడు శని శుభఫలితాలను కూడా ఇస్తుంటాడు.

12/03/2017 - 21:09

అపౌరుషేయాలైన వేదములు మంత్రద్రష్టలైన ఋషులచే పూర్ణమయిన అనంతము నుండి గ్రహింపబడి తమ స్మృతి పథం లో నిక్షిప్తపరుచుకొని తరతరాలకు అందించబడిని వేదవ్యాసులు వాటిని లిఖించి మానవాళికి మహోపకారం చేసారు.
సర్వకాల సర్వావస్థల యందు ఎంతో నియమనిష్ఠలతో తమ జీవితాలను క్రమశిక్షణకు అంకితం చేసి వేద నిధిని కాపాడుకుంటూ వచ్చిన ఋషి పుంగవులకు ఎంతో ఋణపడి ఉంది. మనభారతజాతి.

12/02/2017 - 18:41

కాలాన్ని భగవంతుని స్వరూపంగా భావిస్తాం. తరిగే కాలాన్ని, పెరిగే మనిషి ఆయుష్షును ఎవరూ ఆపలేరు. మన జననం మనకు తెలియదు.. మన మరణ నెపం కూడా తెలియదు. అదే దేవరహస్యం. కాని కాలంలో మంచికాలము , శుభకాలము అశుభకాలమని ఏదీ ఉండదు. కాని మనం తిథివారనక్షత్రాలంటూ విభాగించుకుంటూ అందులో శుభాశుభాలను లెక్కకడతాము. అష్టమి అమ్మో కష్టకాలమని భయపడు తుంటారు కొంతమంది. కాని దుర్గమాలను దూరంచేసే దుర్గాదేవి ని పూజించేది అష్టమినాడే.

12/01/2017 - 18:21

ఒక్కోసారి మనం చేయాలనుకొన్న పనులు ఏవీ ప్రయత్న లోపాలవల్లనో, పరిస్థితుల ప్రాబల్యంవల్లనో అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు. ఆశించినవన్నీ అనుకూలంగా ఫలితాలనిచ్చేట్టుగా పని చేసినట్టు అనిపించినా ఆఖరి నిముషంలో అనుకొన్న ఫలితాలు రావు. ఇది ఒక్కోసారి మనుసును మూగబోయేట్టు చేస్తుంది. కానిఇలాంటి పరాజయాలు మరింత పదునెక్కేట్టు చేస్తాయ. వాటి వల్ల మనిషిలోని అసలైన శక్తి బహిర్గతం కావాడానికి వీలు కలుగుతుంది.

11/30/2017 - 23:42

అగ్ని, సూర్య, చంద్ర సంయుక్త బీజాక్షరి మంత్ర రాజము ‘రామ’ అనే రెండక్షరాలు. రామ అని పలికినంతనే సమస్త దురితములు హరించిపోవును. ఇక రామాయణ పఠనం, శ్రవణముల వలన కలుగు ఫలితములు అమోఘము. శ్రీమద్రామాయణము ఒక దివ్య మహామాల. ఈకావ్యము గురించి తెలియని భారతీయుడు ఉండడు. అటువంటి మహిమాన్విత కావ్యము యొక్క మహత్మ్యమును స్కంద పురాణంలో మనసున హత్తుకొను రీతిన ఆవిష్కరించబడింది.

11/29/2017 - 19:37

కృష్ణుడెవరు? అంటే.. ఒక పురాణ పురుషుడు. ఒక చారిత్రక పురుషుడు. ఒక మానసిక శాస్తవ్రేత్త (సైకియాట్రిస్ట్), ఒక వేదాంత దర్శనకారుడు, ఒక దివ్య సుందరుడు, ఒక ప్రేమమూర్తి, ఒక రాజకీయ చాతుర్యం మూర్త్భీవించిన వేత్త.. ఒక జగద్గురువు.. ఒక దైవం... ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం.. ఇది భారతం అంటూ మన దేశ నిర్మాణాన్ని కళ్ళముందు ఆవిష్కరించునే యత్నం చేస్తే అది కృష్ణరూపం, కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణం వందే జగద్గురుమ్.

11/28/2017 - 18:31

గురువారానికి ‘లక్ష్మీవారం’ అని పేరు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో వ్యవహారంలో కూడా ‘లక్ష్మీవారం’ అనే వాడుతారు. అటువంటి ‘గురువారం’ మార్గశీర్షమాసంలో సంపదల తల్లి అయిన లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. స్వయంగా విష్ణుమాసమైన మార్గశిరమాసంలోని గురువారాల్లో ఐశ్వర్యం, సంపదలకు అధిష్ఠాన దేవత అయిన మహాలక్ష్మీదేవిని పూజిస్తూ వ్రతం చేయాలని శాస్త్రాలు చెబుతూ వున్నాయి.

11/26/2017 - 21:06

భక్తి అనునది ఒక పవిత్ర కార్యం. భక్తి కార్యాలన్నీ పరమ పవిత్రమైనవే. కాని భక్తిలో అహంకారం చేరితే భక్తి మలినమవుతుంది. అలాకాక భక్తి అహంకారిలో ఉంటే అది భక్తినే కాని ముక్తికారకం మాత్రం కాలేదు. ఆ భక్తి ఎంత గొప్పది ఐనను నిరర్థకమే. ఎలా అంటే పాలు ఎంతో ఉత్కృష్టమైన ఆహారము. కాని ఆ పాలలోవిషము కలిస్తే అవి పానయోగ్యం ఎలా కాకుండా పోతాయో అట్లానే భక్తి అనే క్షీరములో అహంకారమనే విషము కలిస్తే అదినిరుపయోగం అవుతుంది.

Pages